Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 46:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 ఈజిప్టు నైలు నదిలా, ఉప్పెనలా ప్రవహిస్తుంది. ఆమె ఇలా అన్నది, ‘నేను లేచి భూమిని కప్పివేస్తాను, పట్టణాలను వాటిలోని ప్రజలను నాశనం చేస్తాను’ అంటుంది.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఐగుప్తీయుల దండు నైలునదివలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకునట్లుగా అది వచ్చుచున్నది. –నేనెక్కి భూమిని కప్పెదను పట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఐగుప్తు నైలు నదిలా పైకి లేస్తుంది. దాని నీళ్ళు నదుల్లా పైకీ కిందికీ విసిరినట్టుగా ప్రవహిస్తుంది. అది ‘నేను పైకి లేస్తాను. భూమిని కప్పి వేస్తాను. నేను పట్టణాలనూ, వాటిలో ప్రజలనూ నాశనం చేస్తాను’ అంటుంది.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

8 పొంగి ప్రవహించే నైలు నదిలా వచ్చేది ఈజిప్టు దేశమే. మహా వేగంతో ప్రవహించే మహా నదిలా వచ్చేది ఈజిప్టు దేశమే. ‘నేను వచ్చి భూమిని కప్పివేస్తాను. నేను నగరాలను, వాటి నివాసులను నాశనం చేస్తాను’ అని ఈజిప్టు అంటున్నది.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 ఈజిప్టు నైలు నదిలా, ఉప్పెనలా ప్రవహిస్తుంది. ఆమె ఇలా అన్నది, ‘నేను లేచి భూమిని కప్పివేస్తాను, పట్టణాలను వాటిలోని ప్రజలను నాశనం చేస్తాను’ అంటుంది.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 46:8
7 Iomraidhean Croise  

‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఈజిప్టు రాజైన ఫరో, నైలు నదిలో పడుకుని ఉన్న ఘటసర్పమా, నేను నీకు విరోధిని. “నైలు నది నాదే, నేనే దాన్ని చేశానని నీవు అంటావు.”


“మనుష్యకుమారుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు: “ ‘దేశాల మధ్య సింహంవంటివాడవు; నీవు నీ ప్రవాహంలో కొట్టుకుపోతూ, నీ పాదాలతో నీటిని చిమ్ముతూ, ప్రవాహాలను బురదమయం చేస్తూ, సముద్రాల్లో ఉండే భీకరమైన సముద్ర జీవిలాంటి వాడవు.


అతని కుమారులు యుద్ధానికి సిద్ధపడి, గొప్ప సైన్యాన్ని సమకూరుస్తారు, అది ఆగలేని వరదలా ముందుకు వస్తూ, అతని కోట వరకు యుద్ధాన్ని తీసుకెళ్తుంది.


“ఈ కారణంచేత భూమి కంపించదా? దేశవాసులందరూ దుఃఖపడరా? నైలు నది పొంగినట్లు దేశమంతా పొంగుతుంది, అది పైకి లేచి తర్వాత ఈజిప్టు నదిలా అణగిపోతుంది.


Lean sinn:

Sanasan


Sanasan