Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 44:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 ‘నేను అసహ్యించుకునే ఈ అసహ్యకరమైన పనిని చేయవద్దు!’ అని చెప్పమని మళ్ళీ మళ్ళీ నేను నా సేవకులైన ప్రవక్తలను పంపాను, వారు వెళ్లి చెప్పారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అందుకని నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదే పదే పంపిస్తూ వచ్చాను. నేను అసహ్యించుకునే ఈ నీచమైన పనులు చేయవద్దు అని చెప్పేందుకు వాళ్ళని పంపాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

4 ఆ ప్రజల వద్దకు నా ప్రవక్తలను అనేక పర్యాయాలు పంపియున్నాను. ఆ ప్రవక్తలు నా సేవకులు. ఆ ప్రవక్తలు నా సందేశాన్ని ప్రజలకు చెప్పారు. మీరీ భయంకరమైన పని చేయవద్దు. విగ్రహారాధన విషయమై మిమ్మల్ని నేను అసహ్యించు కుంటున్నట్లు వారు ప్రజలకు చెప్పారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 ‘నేను అసహ్యించుకునే ఈ అసహ్యకరమైన పనిని చేయవద్దు!’ అని చెప్పమని మళ్ళీ మళ్ళీ నేను నా సేవకులైన ప్రవక్తలను పంపాను, వారు వెళ్లి చెప్పారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 44:4
24 Iomraidhean Croise  

వారి పూర్వికుల దేవుడైన యెహోవా తన ప్రజల మీద, తన నివాసస్థలం మీద జాలిపడి, వారికి తన దూతల ద్వారా పదే పదే సందేశాలు పంపించారు.


మీరు వారిని ఎన్నో సంవత్సరాలు ఓర్పుతో సహించారు. మీ ఆత్మ చేత ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించారు. అయినా వారు మీ మాట వినలేదు, కాబట్టి మీరు వారిని వారి పొరుగు దేశాలకు అప్పగించారు.


మా రాజులు, మా నాయకులు, మా యాజకులు, మా పూర్వికులు మీ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు; మీరు పాటించమని హెచ్చరించిన మీ ఆజ్ఞలు శాసనాలను లక్ష్యపెట్టలేదు.


వారి దుష్టత్వానికి, పాపానికి రెట్టింపు ప్రతిఫలమిస్తాను, ఎందుకంటే వారు నా దేశాన్ని నిర్జీవమైన తమ నీచమైన విగ్రహాలతో అపవిత్రం చేశారు వారి అసహ్యమైన విగ్రహాలతో నా వారసత్వాన్ని నింపారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


పదే పదే నేను మీ దగ్గరకు పంపిన నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోయినా,


ఎందుకంటే వారు నా మాటలు వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నా సేవకులైన ప్రవక్తల ద్వారా నేను వారికి మళ్ళీ మళ్ళీ పంపిన మాటలు వారు వినలేదు. వారే కాదు బందీలుగా ఉన్న మీరు కూడా వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


వారు నావైపు తమ ముఖాలు త్రిప్పక నాకు వెన్ను చూపారు. నేను వారికి పదే పదే బోధించినప్పటికీ, వారు క్రమశిక్షణను అంగీకరించలేదు, స్పందించలేదు.


నా పేరు కలిగిన మందిరంలో తమ నీచమైన విగ్రహాలను ప్రతిష్ఠించి దానిని అపవిత్రం చేశారు.


వారు తమ కుమారులను, కుమార్తెలను మోలెకుకు బలి ఇవ్వడానికి బెన్ హిన్నోము లోయలో బయలుకు క్షేత్రాలు కట్టారు. అది నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదా పాపంలో పడి అలాంటి అసహ్యమైనది చేస్తారని కనీసం నా మనస్సులోకి రాలేదు.


నా సేవకులైన ప్రవక్తలందరినీ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి పంపాను. వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరూ మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తన సరిచేసుకోవాలి; ఇతర దేవతలను సేవించవద్దు వాటిని అనుసరించవద్దు. అప్పుడు నేను మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు” అని ప్రకటించారు. కానీ మీరు నా మాట వినలేదు పట్టించుకోలేదు.


“కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఇలా అంటున్నారు: ‘వినండి! నేను వారితో మాట్లాడాను కాని వారు వినలేదు; నేను వారిని పిలిచాను కాని వారు జవాబివ్వలేదు. కాబట్టి నేను యూదా వారిమీదికి యెరూషలేము నివాసులందరి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడంతా వాళ్ళ మీదకి తీసుకురాబోతున్నాను.’ ”


మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, నేను మీతో పదే పదే మాట్లాడాను, కానీ మీరు వినలేదు; నేను మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు జవాబివ్వలేదు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.


యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో వారు ఏమి చేస్తున్నారో మీరు చూడడం లేదా?


పిల్లలు కట్టెలు సేకరిస్తారు, తండ్రులు మంట వెలిగిస్తారు, స్త్రీలు పిండిని పిసికి ఆకాశ రాణికి సమర్పించడానికి రొట్టెలు తయారుచేస్తారు. నా కోపాన్ని రెచ్చగొట్టడానికి వారు ఇతర దేవుళ్ళకు పానార్పణలు పోస్తారు.


మీ పూర్వికులు ఈజిప్టును విడిచినప్పటి నుండి నేటి వరకు, నేను పదే పదే నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరకు పంపాను.


ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: నీవు నీ ప్రేమికులతో నీ వ్యభిచారంలో నీ కామాన్ని కుమ్మరించి, నీ నగ్న శరీరాన్ని చూపించినందుకు, నీ అసహ్యకరమైన విగ్రహాల కారణంగా, నీవు వాటికోసం నీ పిల్లల రక్తాన్ని చిందించినందున,


నీవు వారిలా ప్రవర్తించడమే కాకుండా వారి అసహ్యకరమైన ఆచారాలను పాటించావు, ప్రవర్తన అంతటిలో వారికన్నా మరింతగా దిగజారిపోయావు.


గతంలో మీరు చేసిన నేరాలన్నిటిని విడిచిపెట్టి నూతన హృదయాన్ని నూతన ఆత్మను పొందండి. ఇశ్రాయేలీయులారా! మీరెందుకు మరణాన్ని పొందాలి?


నేను లోపలికి వెళ్లి చూస్తే, అన్ని రకాల ప్రాకే జీవులు, అపవిత్రమైన జంతువులు, ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహాలు గోడ మీద అంతటా గీయబడి కనిపించాయి.


మీ నామంలో, మా రాజులతో, అధిపతులతో, పూర్వికులతో, దేశ ప్రజలందరితో మాట్లాడిన మీ దాసులైన ప్రవక్తల మాటలు మేము వినలేదు.


యెరూషలేము, దాని ప్రక్కన ఉన్న పట్టణాలన్ని విశ్రాంతిగా క్షేమంగా ఉన్నప్పుడు, దక్షిణ ప్రదేశం, పడమటి మైదానాల్లో ప్రజలు విస్తరించి ఉన్నప్పుడు పూర్వకాలపు ప్రవక్తల ద్వారా యెహోవా ఈ మాటలను ప్రకటించలేదా?’ ”


ఎందుకంటే, మీరు గతకాలంలో దేవుని ఎరుగనివారిగా జీవించారు, సిగ్గుమాలిన వారై, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా, అల్లరితో కూడిన ఆటపాటలు, అసహ్యకరమైన విగ్రహారాధనలు చేస్తూ జీవించారు.


Lean sinn:

Sanasan


Sanasan