యిర్మీయా 44:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానార్పణలు అర్పిస్తాం, మేము మ్రొక్కుకున్న మ్రొక్కుబడులను నిశ్చయంగా నెరవేరుస్తాం’ అని మీరు మీ భార్యలు ప్రమాణం చేసినట్టే మీరు చేశారు. “అయితే సరే అలాగే కానివ్వండి, మీరు వాగ్దానం చేసినట్లు చేయండి! మీ మ్రొక్కుబడులను చెల్లించుకోండి! Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 ఇశ్రాయేలు దేవుడును, సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు – ఆకాశరాణికి ధూపము వేయుదుమనియు, ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు, మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలును మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే; నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘మీరూ, మీ భార్యలూ, ఇద్దరూ కలసి మీ నోటితో చెప్పారు.’ అలా చెప్పిన దాన్ని చేతులతో చేసి చూపించారు. ఆకాశ రాణికి ధూపం వేస్తామనీ, ఆమెకు పూజ చేస్తామనీ మీరు ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు మీ ఒట్టును నెరవేర్చండి. దానిని జరిగించండి. Faic an caibideilపవిత్ర బైబిల్25 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్తున్నాడు, ‘మీరు మరియు మీ భార్యలు ఏమి చేస్తామని చెప్పినారో అది చేశారు. ఆకాశ రాణికి “మేము మొక్కుకున్న బలులు అర్పిస్తాము, పానీయాలు పారపోస్తాము” అని మీరన్నారు. అయితే అలాగే చేయండి. మీమాట ప్రకారం మీరు చేస్తామన్న పనులు చేయండి. మీ వాగ్దానాలను మీరు నిలబెట్టుకోండి.’ Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానార్పణలు అర్పిస్తాం, మేము మ్రొక్కుకున్న మ్రొక్కుబడులను నిశ్చయంగా నెరవేరుస్తాం’ అని మీరు మీ భార్యలు ప్రమాణం చేసినట్టే మీరు చేశారు. “అయితే సరే అలాగే కానివ్వండి, మీరు వాగ్దానం చేసినట్లు చేయండి! మీ మ్రొక్కుబడులను చెల్లించుకోండి! Faic an caibideil |