Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 44:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 “మీరు, మీ పూర్వికులు, మీ రాజులు, మీ అధికారులు దేశ ప్రజలు, యూదా పట్టణాల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ ధూపం వేసిన విషయం యెహోవా గుర్తుంచుకుని జ్ఞాపకం తెచ్చుకోలేదా?

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీపితరులును మీ రాజులును మీ యధిపతులును దేశప్రజలును ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకముచేసికొనలేదా? అదే గదా ఆయన మనస్సునకు వచ్చెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 “మీరూ, మీ పితరులూ, మీ రాజులూ, మీ నాయకులూ, మీ ప్రజలందరూ యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధులలోనూ మీరు వేసిన ధూపం యెహోవా మర్చిపోయాడు అనుకుంటున్నారా? ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఆలోచనల్లో ఇది మెదులుతూనే ఉంది.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

21 ఆ ప్రజలతో యిర్మీయా ఇలా అన్నాడు: “యూదా పట్టణాలలోను, యెరూషలేము నగరంలోను మీరు ఈ దేవతలకు చేసిన బలి అర్పణలు యెహోవా గుర్తుపెట్టుకున్నాడు. మీరు, మీ పితరులు, మీ రాజు, మీ అధికారులు మరియు దేశంలో ఇతర ప్రజలు ఆ పనులు చేశారు. మీరు చేసిన పనిని యెహోవా గుర్తుపెట్టుకొని దానిని గురించి ఆలోచన చేశాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 “మీరు, మీ పూర్వికులు, మీ రాజులు, మీ అధికారులు దేశ ప్రజలు, యూదా పట్టణాల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ ధూపం వేసిన విషయం యెహోవా గుర్తుంచుకుని జ్ఞాపకం తెచ్చుకోలేదా?

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 44:21
19 Iomraidhean Croise  

ఆమె ఏలీయాతో అన్నది, “దైవజనుడా, మీరు నాకు చేసిందేంటి? నా పాపం నాకు జ్ఞాపకంచేసి నా కుమారున్ని చంపడానికి వచ్చారా?”


గత తరాల పాపాలను మాకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసుకోకండి; మీ కరుణను త్వరగా మాపై చూపండి, ఎందుకంటే మేము చాలా కష్టాల్లో ఉన్నాము.


యెహోవా! ఎక్కువగా కోప్పడకండి; నిత్యం మా పాపాల్ని జ్ఞాపకం చేసుకోకండి. మేమంతా మీ ప్రజలమే కాబట్టి మా పట్ల దయ చూపించమని ప్రార్థిస్తున్నాము.


యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఆ అవమానకరమైన దేవుడైన బయలుకు ధూపం వేయడానికి మీరు ఏర్పాటుచేసిన బలిపీఠాలు యెరూషలేము వీధులంత విస్తారంగా ఉన్నాయి.’


ఈ ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నారు: “వారికి తిరగడం అంటే చాలా ఇష్టం; వారు తమ పాదాలను అదుపు చేసుకోరు. కాబట్టి యెహోవా వారిని అంగీకరించరు; ఆయన ఇక వారి దుర్మార్గాన్ని జ్ఞాపకం ఉంచుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తారు.”


ఇశ్రాయేలు, యూదా ప్రజలు, వారి రాజులు, అధికారులు, వారి యాజకులు, ప్రవక్తలు, యూదా ప్రజలు యెరూషలేములో నివసించేవారు తాము చేసిన వాటన్నిటితో నాకు కోపం రేపారు.


ఖచ్చితంగా మాకు ఇష్టం వచ్చినట్లే మేము చేస్తాము: మేము, మా పూర్వికులు, మా రాజులు మా అధికారులు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో చేసినట్లుగా మేము కూడా ఆకాశ రాణికి ధూపం వేస్తాము ఆమెకు పానార్పణలు అర్పిస్తాము. ఆ సమయంలో మాకు పుష్కలంగా ఆహారం ఉండింది, మేము బాగున్నాం, ఎలాంటి హాని జరగలేదు.


అప్పుడు యిర్మీయా తనకు జవాబిస్తున్న స్త్రీ పురుషులందరితో ఇలా అన్నాడు:


మీ పూర్వికులు, యూదా రాజులు, రాణులు చేసిన దుర్మార్గాన్ని, యూదా దేశంలో, యెరూషలేము వీధుల్లో మీరు, మీ భార్యలు చేసిన దుర్మార్గాన్ని మీరు మరచిపోయారా?


నీవు నీకోసం ఒక మట్టిదిబ్బను నిర్మించుకున్నావు, ప్రతి బహిరంగ కూడలిలో ఒక ఎత్తైన క్షేత్రాన్ని నిర్మించావు.


అయితే వారి చెడు పనులన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటానని వారు గ్రహించరు. వారి పాపాలు వారిని చుట్టుముట్టాయి; అవి ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి.


యాకోబు ఆత్మగౌరవమైన తన నామం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశారు: “నేను వారు చేసిన వాటిలో ఒక్కటి కూడా ఎన్నటికీ మరువను.


యెహోవా ఇది చూసి వారిని తృణీకరించారు, ఎందుకంటే ఆయన తన కుమారులు కుమార్తెల వల్ల కోప్పడ్డారు.


“వారి క్రియలు ఎలాంటివో ఆ లెక్క అంతా నా దగ్గరే ఉంది, దాన్ని నిల్వచేసే నా ఖజానాలో భద్రపరచలేదా?


ప్రసిద్ధిగాంచిన ఆ గొప్ప పట్టణం మూడు భాగాలుగా చీలిపోయింది, దేశాల పట్టణాలు కుప్పకూలాయి. దేవుడు బబులోను మహాపట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని తన ఉగ్రత అనే మద్యంతో నిండిన పాత్రను ఆమెకు ఇచ్చారు.


ఆమె చేసిన పాపాలు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి కాబట్టి, దేవుడు ఆమె అతిక్రమాలను జ్ఞాపకం చేసుకున్నారు.


కాబట్టి నీవు ఇప్పుడు వెళ్లి అమాలేకీయుల మీద దాడిచేసి వారికి చెందిన వాటన్నిటిని నాశనం చేయాలి. వారిని విడిచిపెట్టవద్దు; పురుషులను స్త్రీలను, పిల్లలను చంటిబిడ్డలను, పశువులను గొర్రెలను, ఒంటెలను, గాడిదలనన్నిటిని చంపివేయాలి.’ ”


Lean sinn:

Sanasan


Sanasan