Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 44:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 ఆకాశ రాణికి ధూపం వేయడం ఆమెకు పానార్పణలు అర్పించడం మానివేసినప్పటి నుండి మా దగ్గర ఏమి లేకుండా పోయింది, మేము ఖడ్గం చేత కరువుచేత నాశనమవుతున్నాము.”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 మేం ఆకాశరాణికి ధూపం వేయకుండా, ఆమెకు పానీయ నైవేద్యాలు అర్పించకుండా ఉన్నప్పుడు పేదరికంతో బాధ పడ్డాం. కత్తి మూలంగానూ, కరువు మూలంగానూ నశించిపోతున్నాం.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

18 కాని మేము ఆకాశ రాణికి పానీయాలు సమర్పించటం మానివేశాం. ఆమె పూజలో ఇవన్నీ మేము చేయటం మానినప్పటి నుండి మాకు అనేక సమస్యలు వచ్చాయి. మా ప్రజలు కత్తులచేత, ఆకలిచేత చంపబడ్డారు.”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 ఆకాశ రాణికి ధూపం వేయడం ఆమెకు పానార్పణలు అర్పించడం మానివేసినప్పటి నుండి మా దగ్గర ఏమి లేకుండా పోయింది, మేము ఖడ్గం చేత కరువుచేత నాశనమవుతున్నాము.”

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 44:18
8 Iomraidhean Croise  

తనను ఓడించిన దమస్కు నగరవాసులకున్న దేవుళ్ళకు బలులు అర్పించాడు. “సిరియా రాజులకు వారి దేవుళ్ళు సహాయం చేసినట్లు నాకూ సాయం చేసేలా నేను వాటికి బలులు అర్పిస్తాను” అని అనుకున్నాడు. అయితే ఆ దేవుళ్ళ వలన అతనికి ఇశ్రాయేలు ప్రజలందరికి పతనం కలిగింది.


యెరూషలేములోని ఇల్లు, యూదా రాజుల భవనాలు ఆ తోఫెతు స్థలంలా అపవిత్రం చేయబడతాయి. అన్ని ఇళ్ల మీద ప్రజలు ఆకాశ సైన్యాలకు ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించారు.’ ”


వారందరూ వారు చెదరగొట్టబడిన అన్ని దేశాల నుండి యూదా దేశానికి, మిస్పాలోని గెదల్యా దగ్గరకు తిరిగి వచ్చారు. వారు సమృద్ధిగా ద్రాక్షరసాన్ని వేసవికాలపు పండ్లను సేకరించారు.


వారి తల్లి వ్యభిచారం చేసింది, అవమానంలో వారిని కన్నది. ఆమె, ‘నేను నా ప్రేమికుల వెంట వెళ్తాను, వారు నాకు నా ఆహారం, నీళ్లు, ఉన్ని, జనపనార, ఒలీవనూనె, పానీయం ఇస్తారు’ అన్నది.


Lean sinn:

Sanasan


Sanasan