Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 42:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 యూదాలో మిగిలి ఉన్నవారలారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఒకవేళ మీరు ఈజిప్టుకు వెళ్లి, అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొని ఉంటే,

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 యూదావారిలో శేషించినవారలారా, యెహోవా మాట ఆలకించుడి; ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఐగుప్తునకు వెళ్లవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండు టకు మీరు వెళ్లినయెడల

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 యూదా ప్రజల్లో మిగిలి ఉన్న వారు యెహోవా చెప్పే ఈ మాట వినండి. సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు ఒకవేళ ఐగుప్తులో నివసించడానికి వెళ్లాలని నిర్ణయం చేసుకుంటే,

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

15 యూదాలో మిగిలిన ప్రజలారా, మీరలా అంటే యెహోవా వర్తమానం ఏమిటో వినండి. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘మీరు ఈజిప్టునందు నివసింప నిశ్చయిస్తే మీకు ఇలా జరుగుతుంది:

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 యూదాలో మిగిలి ఉన్నవారలారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఒకవేళ మీరు ఈజిప్టుకు వెళ్లి, అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొని ఉంటే,

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 42:15
8 Iomraidhean Croise  

తన యావదాస్తితో పారిపోయాడు, యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండసీమ వైపు వెళ్లాడు.


“ ‘ “అయితే, ఏదైనా దేశం గాని రాజ్యం గాని బబులోను రాజైన నెబుకద్నెజరుకు సేవ చేయకపోయినా అతని కాడి క్రింద మెడ వంచకపోయినా, నేను ఆ దేశాన్ని కత్తితో, కరువుతో, తెగులుతో శిక్షిస్తాను, అతని చేతితో దానిని పూర్తిగా నాశనం చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు.


నిజానికి, ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొనిన వారందరూ ఖడ్గం, కరువు, తెగులు వల్ల చస్తారు; నేను వారి మీదికి తెచ్చే విపత్తు నుండి వారిలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు, ప్రాణాలతో బయటపడలేరు.’


అప్పుడు యిర్మీయా స్త్రీలతో సహా ప్రజలందరితో, “ఈజిప్టులోని యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి.


అతడు తన రాజ్యమంతటి బలంతో వచ్చి దక్షిణాది రాజుతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతని రాజ్యాన్ని పడగొట్టడానికి ఒక కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేస్తాడు, కాని అతని ప్రణాళికలు విజయవంతం కావు, అవేవి అతనికి సహాయపడవు.


తాను పరలోకానికి ఎత్తబడే సమయం ఆసన్నమైనదని గ్రహించి, యేసు యెరూషలేముకు వెళ్లాలని మనస్సును స్థిరపరచుకున్నారు.


అంతేకాక, రాజు గుర్రాలను అధిక సంఖ్యలో సంపాదించవద్దు, వాటిని ఇంకా ఎక్కువ సంపాదించుకునేందుకు ప్రజలను ఈజిప్టుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే, “మీరు మరలా ఆ త్రోవలో వెళ్లకూడదు” అని యెహోవా మీకు చెప్పారు.


Lean sinn:

Sanasan


Sanasan