Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 41:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 వారు బబులోను రాజు దేశానికి అధిపతిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపాడు కాబట్టి వారు బబులోనీయులకు భయపడ్డారు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 అయితే వాళ్ళు బబులోను రాజు దేశం మీద అధికారిగా నియమించిన అహీకాము కొడుకు గెదల్యాను నెతన్యా కొడుకు ఇష్మాయేలు చంపిన కారణంగా వాళ్ళు కల్దీయులకు భయపడి, ఐగుప్తుకు వెళ్దాం అనుకుని, బేత్లెహేము దగ్గర ఉన్న గెరూతు కింహాములో కొంత కాలం ఉన్నారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 వారు బబులోను రాజు దేశానికి అధిపతిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపాడు కాబట్టి వారు బబులోనీయులకు భయపడ్డారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 41:18
11 Iomraidhean Croise  

బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాలో కొంతమందిని ఉండనిచ్చాడు. వారిమీద అతడు షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడు.


అయితే ఏడవ నెలలో రాజవంశానికి చెందిన ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొని గెదల్యా దగ్గరకు వచ్చి అతన్ని, మిస్పాలో అతనితో ఉన్న యూదా వారిని, బబులోనీయులను చంపాడు.


“మీరు ఎవరికి జడిసి భయపడి నా పట్ల నిజాయితీగా లేకుండా, నన్ను జ్ఞాపకం చేసుకోకుండా దీనిని పట్టించుకోకుండా ఉన్నారు? చాలా కాలం నేను మౌనంగా ఉన్నానని మీరు నాకు భయపడడం లేదు కదా?


అయితే, యిర్మీయా బయలుదేరక ముందు, నెబూజరదాను, “బబులోను రాజు యూదా పట్టణాలపై నియమించిన షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరకు తిరిగివెళ్లి, అతనితో పాటు ప్రజలమధ్య నివసించు, లేదా ఎక్కడికి వెళ్లడం సరియైనది అని నీకు అనిపిస్తే అక్కడికి వెళ్లు” అని చెప్పాడు. తర్వాత దళాధిపతి అతనికి ఆహారపదార్థాలు బహుమానం ఇచ్చి అతన్ని పంపించాడు.


అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను, హోషయా కుమారుడైన యెజన్యాతో సహా సైన్య అధికారులందరూ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరూ,


ఇప్పుడు మీరు ఎవరికైతే భయపడుతున్నారో ఆ బబులోను రాజుకు మీరు భయపడవద్దు. అతనికి భయపడవద్దు, అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని రక్షిస్తాను అతని చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను.


మీరు ఏ ఖడ్గానికి భయపడతారో అది అక్కడ మిమ్మల్ని పట్టుకుంటుంది, మీరు భయపడే కరువు ఈజిప్టులోకి కూడా మిమ్మల్ని వెంటపడుతుంది, అక్కడే మీరు చనిపోతారు.


Lean sinn:

Sanasan


Sanasan