Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 38:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 అయితే రాజభవనంలో అధికారిగా ఉన్న ఎబెద్-మెలెకు అనే ఒక కూషీయుడు యిర్మీయాను నీటి గోతిలో వేశారు అని విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7-8 రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటి లోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండుడు, వారు యిర్మీయాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగరులోనుండి బయలువెళ్లి రాజుతో ఈలాగు మనవి చేసెను

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 అప్పుడు, రాజగృహంలో, కూషీయుడైన ఎబెద్మెలెకు నపుంసకుల్లో ఒకడు. యిర్మీయాను గోతిలో పెట్టారని అతడు విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

7 కాని ఎబెద్మెలెకు అనేవాడు అధికారులు యిర్మీయాను నీటిగోతిలోకి దించినట్లు విన్నాడు. ఎబెద్మెలెకు కూషీయుడు (ఇతియోపియ అనే దేశపువాడు) అతడు నపుంసకుడు (కొజ్జా) రాజ భవనంలో ఉద్యోగి. రాజైన సిద్కియా బెన్యామీను ద్వారం వద్ద కూర్చుని ఉండగా ఎబెద్మెలెకు రాజభవనం నుండి రాజును కలిసి మాట్లాడటానికి ద్వారం వద్దకు వెళ్లాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 అయితే రాజభవనంలో అధికారిగా ఉన్న ఎబెద్-మెలెకు అనే ఒక కూషీయుడు యిర్మీయాను నీటి గోతిలో వేశారు అని విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 38:7
22 Iomraidhean Croise  

నెబుకద్నెజరు యెహోయాకీనును బందీగా బబులోనుకు తీసుకెళ్లాడు. అతడు యెరూషలేము నుండి రాజు తల్లిని, రాజు భార్యలను, రాజభవన అధికారులను, దేశంలోని ప్రముఖులను కూడా తీసుకెళ్లాడు.


ఈజిప్టు నుండి రాయబారులు వస్తారు. కూషు తనను తాను దేవునికి సమర్పించుకుంటుంది.


రక్తపిపాసులు నిజాయితీ కల వ్యక్తిని ద్వేషిస్తారు యథార్థవంతులను చంపాలని చూస్తారు.


యెహోవాను వెంబడించే ఏ విదేశీయుడైనా, “యెహోవా తన ప్రజల్లో నుండి నన్ను వెలివేస్తారు” అని అనకూడదు. ఏ నపుంసకుడైనా, “నేను కేవలం ఎండిన చెట్టును” అని అనకూడదు.


కూషీయుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? అలాగే చెడు చేయడం అలవాటైన మీరు మంచి చేయలేరు.


అతడు యిర్మీయా ప్రవక్తను కొట్టించి, యెహోవా మందిరం దగ్గర బెన్యామీను ఎగువ ద్వారం దగ్గర ఉన్న కొయ్యకు బంధించాడు.


అప్పుడు అధికారులు, ప్రజలందరూ యాజకులతో ప్రవక్తలతో ఇలా అన్నారు, “ఇదంతా ఇతడు మన దేవుడైన యెహోవా నామంలో మనతో చెప్పాడు కాబట్టి ఇతనికి మరణశిక్ష విధించకూడదు!” అన్నారు.


(యెహోయాకీను రాజు, రాజమాత, ఆస్థాన అధికారులు, యూదా, యెరూషలేము నాయకులు, నిపుణులైన పనివారు కళాకారులు యెరూషలేము నుండి బందీలుగా తీసుకువెళ్లిన తర్వాత ఈ ఉత్తరం పంపబడినది.)


యూదా, యెరూషలేము నాయకులు, ఆస్థాన అధికారులు, యాజకులు, దేశ ప్రజలందరు దూడ ముక్కల మధ్య నడిచినవారు,


అయితే అతడు బెన్యామీను ద్వారం దగ్గరకు చేరుకున్నప్పుడు, హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు ఇరియా అనే కావలివారి దళాధిపతి ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకుని, “నీవు బబులోనీయులతో చేరిపోవడానికి వెళ్తున్నావు!” అన్నాడు.


ఎబెద్-మెలెకు రాజభవనంలో నుండి రాజు దగ్గరకు వెళ్లి రాజుతో,


న్యాయస్థానంలో న్యాయం కోసం నిలబడే వారిని యథార్థంగా మాట్లాడేవారిని ద్వేషించేవారు మీలో ఉన్నారు.


యెరూషలేముకు దక్షిణాన ఉన్న గెబా నుండి రిమ్మోను వరకు ఉన్న దేశమంతా అరాబాలా మైదానంలా అవుతుంది. అయితే యెరూషలేము బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు అనగా మొదటి ద్వారం ఉన్న స్థలం వరకు, హనానేలు గోపురం నుండి రాజ ద్రాక్షగానుగల వరకు వ్యాపించి ఉంటుంది.


“కాబట్టి చివరి వారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు” అని చెప్పారు.


అతని తండ్రి, తల్లి అతన్ని పట్టుకుని పట్టణ ద్వారం దగ్గర ఉన్న పెద్దల దగ్గరకు తీసుకురావాలి.


వారు ఈ పట్టణాల్లో ఒక దానికి పారిపోయినప్పుడు, వారు నగర ద్వారం దగ్గర నిలబడి, ఆ పట్టణపు పెద్దల ముందు తమ వాదనను తెలియజేయాలి. అప్పుడు పెద్దలు పారిపోయినవారిని తమ పట్టణంలోకి చేర్చి, వారి మధ్య నివసించడానికి ఒక స్థలాన్ని ఇవ్వాలి.


Lean sinn:

Sanasan


Sanasan