Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 38:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 “యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ పట్టణంలో నివసించేవారు ఖడ్గంతో కరువుతో తెగులుతో చనిపోతారు, కానీ బబులోనీయుల దగ్గరకు వెళ్లేవారు బ్రతుకుతారు. వారు తమ ప్రాణాలతో తప్పించుకుని బ్రతుకుతారు; వారు జీవిస్తారు.’

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ పట్టణము నిశ్చయముగా బబులోనురాజు దండుచేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజలకందరికి ప్రకటింపగా

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 యెహోవా ఇలా అంటున్నాడు. “ఈ పట్టణం కచ్చితంగా బబులోను రాజు సైన్యం చేతికి అప్పగించడం జరుగుతుంది. అతడు దాన్ని చెరపట్టుకుంటాడు,” అని యిర్మీయా ప్రజలందరికీ ప్రకటించినప్పుడు,

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

2 “యెహోవా సెలవిస్తున్నదేమనగా, ‘యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కడు కత్తివల్లగాని, ఆకలివలనగాని, రోగంతోగాని చనిపోతాడు. కాని బబులోను సైన్యానికి లొంగిపోయిన ప్రతి ఒక్కడూ బ్రతుకుతాడు. వారు వారి ప్రాణాలతో తప్పించుకో గలుగుతారు.’

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 “యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ పట్టణంలో నివసించేవారు ఖడ్గంతో కరువుతో తెగులుతో చనిపోతారు, కానీ బబులోనీయుల దగ్గరకు వెళ్లేవారు బ్రతుకుతారు. వారు తమ ప్రాణాలతో తప్పించుకుని బ్రతుకుతారు; వారు జీవిస్తారు.’

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 38:2
20 Iomraidhean Croise  

‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు అని చెప్పండి: బబులోను రాజుతో ప్రాకారం బయట ఉన్న బబులోను వారితో పోరాడేందుకు మీరు ఉపయోగించే యుద్ధ ఆయుధాలను నేను మీ మీదికే త్రిప్పబోతున్నాను. నేను వాటిని ఈ పట్టణం లోపల పోగుచేయిస్తాను.


“ ‘అయితే, నేను యూదా రాజైన సిద్కియాకు, అతని అధికారులకు, యెరూషలేములో మిగిలిన వారికి ఈజిప్టులో నివసిస్తున్న వారికి తినలేనంతగా పాడైన అంజూర పండ్లకు చేసినట్టు చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.


అయితే ఏ దేశమైనా బబులోను రాజు కాడి క్రింద మెడ వంచి అతనికి సేవ చేస్తే, నేను ఆ దేశాన్ని దాని సొంత దేశంలోనే ఉండి, దానిలో వ్యవసాయం చేయడానికి అక్కడ నివసించడానికి అనుమతిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.” ’ ”


బబులోను రాజుకు సేవ చేయని ఏ దేశానికైనా యెహోవా హెచ్చరించినట్లు కత్తితో కరువుతో తెగులుతో నీవు, నీ ప్రజలు ఎందుకు చావాలి?


అయితే దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజు గురించి, మీతో పాటు బందీలుగా వెళ్లకుండా ఈ పట్టణంలో మిగిలిన మీ తోటి సోదరులు ప్రజలందరి గురించి యెహోవా ఇలా అంటున్నారు.


నేను వారిని ఖడ్గంతో, కరువుతో, తెగుళ్ళతో వెంటాడి, వారిని ఏ దేశాల్లోకి తరుముతానో ఆ భూరాజ్యాలన్నిటికి వారిని అసహ్యమైన వారిగా, శాపంగా, భయానకంగా, హేళనగా నిందగా చేస్తాను.


“కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: మీరు నా మాట వినలేదు. మీరు మీ సొంత ప్రజలకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించలేదు. కాబట్టి నేను ఇప్పుడు మీకు ‘స్వాతంత్ర్యాన్ని’ చాటిస్తున్నాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ఖడ్గం, తెగులు కరువుతో చావడానికే మీకు ‘విడుదల.’ నేను మిమ్మల్ని భూలోక రాజ్యాలన్నిటికీ అసహ్యమైన వారిగా చేస్తాను.


నేను నిన్ను రక్షిస్తాను; నీవు నన్ను నమ్మావు కాబట్టి నీవు ఖడ్గానికి బలి కాకుండ, నీవు ప్రాణంతో తప్పించుకుంటావు అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


నిజానికి, ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొనిన వారందరూ ఖడ్గం, కరువు, తెగులు వల్ల చస్తారు; నేను వారి మీదికి తెచ్చే విపత్తు నుండి వారిలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు, ప్రాణాలతో బయటపడలేరు.’


కాబట్టి ఇప్పుడు ఈ విషయం తప్పక గుర్తుంచుకోండి: మీరు ఎక్కడికి వెళ్లి స్థిరపడాలనుకున్నా మీరు ఖడ్గం, కరువు, తెగులు వల్ల చనిపోతారు.”


నేను యెరూషలేమును ఎలా శిక్షించానో ఈజిప్టులో నివసించేవారిని కూడా ఖడ్గంతో, కరువుతో, తెగులుతో అలాగే శిక్షిస్తాను.


‘అలాంటప్పుడు నీకోసం నీవు గొప్ప వాటిని వెదుక్కోవాలా? వాటిని వెదకవద్దు. నేను ప్రజలందరికి విపత్తు తెస్తాను, కానీ నీవు ఎక్కడికి వెళ్లినా నీవు ప్రాణాలతో తప్పించుకునేలా చేస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


“ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దాని మనుష్యులను వారి జంతువులను చంపడానికి యెరూషలేము మీదికి ఖడ్గం కరువు అడవి మృగాలు తెగులు అనే నాలుగు భయంకరమైన తీర్పులను పంపినప్పుడు అది ఎంతో ఘోరంగా ఉంటుంది!


“ ‘ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: మీ చేతులను చరిచి మీ పాదాలతో నేలను తన్ని ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గమైన అసహ్యమైన క్రియలనుబట్టి “అయ్యో!” అని ఏడువు ఎందుకంటే వారు ఖడ్గం కరువు తెగులు ద్వారా చస్తారు.


బయట కత్తి ఉంది; లోపల తెగులు కరువు ఉన్నాయి. బయట ఉన్నవారు కత్తి వలన చచ్చారు; పట్టణంలో ఉన్నవారు తెగులు కరువు వలన నాశనమవుతారు.


Lean sinn:

Sanasan


Sanasan