Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 38:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 అయితే సిద్కియా రాజు యిర్మీయాతో రహస్యంగా ఈ ప్రమాణం చేశాడు: “మనకు ఊపిరినిచ్చే, సజీవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్న, నిన్ను నేను చంపను, నిన్ను చంపాలనుకున్న వారికి అప్పగించను.”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 కావున రాజైన సిద్కియా–జీవాత్మను మన కనుగ్రహించు యెహోవాతోడు నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న యీ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహ స్యముగా ప్రమాణము చేసెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 కాని రాజైన సిద్కియా ఏకాంతంగా యిర్మీయాతో ప్రమాణం చేసి “మనలను సృష్టించిన యెహోవా తోడు, నేను నిన్ను చంపను, నిన్ను చంపాలని చూసేవాళ్ల చేతికి నిన్ను అప్పగించను,” అన్నాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

16 కాని రాజైన సిద్కియా యిర్మీయాకు ఒక ప్రమాణం చేశాడు. సిద్కియా ఇది రహస్యంగా చేశాడు. సిద్కియా ఇలా ప్రమాణం చేశాడు: “యిర్మీయా, మనందరికీ జీవం పోసిన ప్రాణదాత, నిత్యుడు అయిన యెహోవా సాక్షిగా నిన్ను నేను చంపను. అంతే గాదు. నిన్ను చంపజూచే అధికారులకు నిన్ను అప్పగించనని కూడా నేను నీకు ప్రమాణం చేస్తున్నాను.”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 అయితే సిద్కియా రాజు యిర్మీయాతో రహస్యంగా ఈ ప్రమాణం చేశాడు: “మనకు ఊపిరినిచ్చే, సజీవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్న, నిన్ను నేను చంపను, నిన్ను చంపాలనుకున్న వారికి అప్పగించను.”

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 38:16
13 Iomraidhean Croise  

మట్టితో తయారైంది తిరిగి మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుంది.


ఆకాశాలను సృష్టించి వాటిని విశాలపరచి, భూమిని దానిలో పుట్టిన సమస్తాన్ని విస్తరింపజేసి, దానిపై ఉన్న ప్రజలకు ఊపిరిని, దానిపై నడిచే వారికి జీవాన్ని ఇస్తున్న దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే:


నేను వారిని నిత్యం నిందించను, నేను ఎప్పుడు కోపంగా ఉండను ఎందుకంటే నా వలన వారు నీరసించిపోతారు. నేను పుట్టించిన ప్రజలు నీరసించిపోతారు.


వారిని చంపాలనుకున్న వారి శత్రువుల చేతికి నేను వారిని అప్పగిస్తాను. వారి మృతదేహాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి.


అప్పుడు రాజైన సిద్కియా అతన్ని పిలిపించి, రాజభవనానికి తీసుకువచ్చి, “యెహోవా నుండి ఏదైనా వాక్కు వచ్చిందా?” అని అడిగాడు. “అవును, నీవు బబులోను రాజు చేతికి అప్పగించబడతావు” అని యిర్మీయా జవాబిచ్చాడు.


ఇది ప్రవచనం: ఇశ్రాయేలు ప్రజల గురించి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశాలను విశాలపరచి, భూమికి పునాది వేసి, ఒక వ్యక్తిలో మానవ ఆత్మను సృష్టించిన యెహోవా చెప్తున్న మాట:


కానీ మోషే అహరోనులు సాగిలపడి, “ఓ దేవా! సర్వ ప్రాణులకు ఊపిరి ఇచ్చే దేవా, ఒక్క మనిషి పాపం చేస్తే సమాజమంతటి మీద కోప్పడతారా?” అని వేడుకున్నారు.


“సమస్త జీవులకు శ్వాసనిచ్చే దేవుడైన యెహోవా, ఈ సమాజం మీద ఒక నాయకుని నియమించాలి,


అతడు రాత్రివేళ యేసు దగ్గరకు వచ్చి, “రబ్బీ, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని మాకు తెలుసు. ఎందుకంటే దేవుడు తోడు లేకపోతే నీవు చేసే అద్భుత కార్యాలను ఎవరు చేయలేరు” అన్నాడు.


ఆయనే వారందరికి జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని అనుగ్రహించేవాడు కాబట్టి ఏదో అవసరం ఉన్నట్లు మానవుల చేతులతో చేసే సేవలు ఆయనకు అవసరం లేదు.


‘ఆయనలో మనం బ్రతుకుతున్నాం, కదులుతున్నాం మన ఉనికిని కలిగి ఉన్నాము.’ మీ సొంత కవులు కొందరు, ‘మనం ఆయన సంతానం’ అని అన్నారు.


మనల్ని క్రమశిక్షణలో పెంచిన మానవ తండ్రులను మనమందరం కలిగి ఉన్నాం, ఈ విషయంలో వారిని గౌరవిస్తాము. అలాగే ఆత్మలకు తండ్రియైన దేవునికి మనం ఇంకా ఎంత అధికంగా లోబడి జీవించాలి!


Lean sinn:

Sanasan


Sanasan