Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 34:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 అయితే ఆ తర్వాత వారు మనస్సు మార్చుకుని విడిపించిన బానిసలను వెనుకకు తీసుకుని మళ్ళీ బానిసలుగా చేసుకున్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని, తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపరచుకొనిరి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 అయితే ఆ తరువాత వాళ్ళు మనస్సు మార్చుకుని, తాము స్వతంత్రులుగా వెళ్ళనిచ్చిన దాసదాసీలను మళ్ళీ దాసులుగా, దాసీలుగా చేసుకోడానికి బలవంతంగా వాళ్ళను పట్టుకున్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

11 కాని ఆ తరువాత బానిసల యజమానులంతా తమ మనస్సు మార్చుకున్నారు. వారు స్వేచ్ఛగా వదిలిన బానిసలందరినీ మరల బానిసలుగా నియమించుకొన్నారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 అయితే ఆ తర్వాత వారు మనస్సు మార్చుకుని విడిపించిన బానిసలను వెనుకకు తీసుకుని మళ్ళీ బానిసలుగా చేసుకున్నారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 34:11
25 Iomraidhean Croise  

అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారిని దుష్టులతో పాటు బహిష్కరిస్తారు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.


వారి నోటి మాటల్లో దుష్టత్వం, మోసం నిండి ఉన్నాయి; వారు తెలివిగా వ్యవహరించడంలో, మంచి చేయడంలో విఫలమవుతారు.


కప్పల నుండి ఉపశమనం కలిగిందని చూసిన ఫరో యెహోవా చెప్పిన ప్రకారమే తన హృదయాన్ని కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు.


ఫరో మోషే అహరోనులను పిలిపించి, “నా నుండి నా ప్రజల నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాకు ప్రార్థించండి, అప్పుడు యెహోవాకు బలి అర్పించడానికి నీ ప్రజలను వెళ్లనిస్తాను” అని అన్నాడు.


యెహోవాకు ప్రార్థించండి, ఎందుకంటే ఇంతవరకు పడిన ఉరుములు వడగండ్లు చాలు. నేను మిమ్మల్ని వెళ్లనిస్తాను; మీరు ఇక ఇక్కడ ఉండనవసరం లేదు” అని అన్నాడు.


తన మూర్ఖత్వాన్ని మరల కనుపరచు బుద్ధిహీనుడు తను కక్కిన దానికి తిరిగిన కుక్క వంటివాడు.


చేసిన నేరానికి శిక్ష త్వరగా పడకపోతే ప్రజలు భయం లేకుండా చెడుపనులు చేస్తారు.


కాబట్టి ఈ ఒడంబడిక ప్రకారం వచ్చిన అధికారులందరు, అలాగే ప్రజలందరూ తమ దగ్గర ఉన్న ఆడ, మగ బానిసలను విడుదల చేస్తామని, ఇక ఎప్పటికీ వారిని బానిసలుగా ఉంచమని అంగీకరించి, ఆ ఆజ్ఞకు లోబడి వారిని విడుదల చేశారు.


అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చింది:


కాని ఇప్పుడు మీరు తిరగబడి నా పేరును అపవిత్రం చేశారు. మీలో ప్రతి ఒక్కరు మీ ఆడ, మగ బానిసలను వారు కోరుకున్న చోటికి వెళ్లగలిగేలా వారిని విడుదల చేశారు. కాని మీరు వారిని మళ్ళీ మీ బానిసలుగా ఉండాలని బలవంతం చేశారు.


“నేను యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను వారిని చంపాలనుకున్న శత్రువుల చేతికి, అంటే నీ దగ్గర నుండి వెనుకకు వెళ్లిపోయిన బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను.


ఫరో సైన్యం ఈజిప్టు నుండి బయలుదేరగా, యెరూషలేమును ముట్టడించిన బబులోనీయులు ఆ వార్త విని యెరూషలేము నుండి వెనుకకు వెళ్లిపోయారు.


“ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి? యూదా, నిన్ను నేనేం చేయాలి? మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా, ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది.


వారు సర్వోన్నతుని వైపు తిరుగరు, వారు పనికిరాని విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ గర్వపు మాటల వలన కత్తివేటుకు పడిపోతారు. ఇందుచేత ఈజిప్టు దేశంలో వారు ఎగతాళి చేయబడతారు.


యెహోవాను అనుసరించకుండా ప్రక్కకు తిరిగినవారిని ఆయనను వెదకకుండ, ఆయన దగ్గర విచారణ చేయనివారిని నాశనం చేస్తాను.”


ఒకడు తన శత్రువును కనుగొన్నప్పుడు, అతడు అతన్ని క్షేమంగా తప్పించుకోనిస్తాడా? ఈ రోజు నీవు నాతో ప్రవర్తించిన తీరుకు యెహోవా నీకు మంచి ప్రతిఫలమివ్వాలి.


అందుకు సౌలు, “నేను పాపం చేశాను. దావీదూ నా కుమారుడా, తిరిగి రా. ఈ రోజు నీవు నా ప్రాణాన్ని విలువైనదిగా గుర్తించావు, కాబట్టి నేను మరలా నీకు హాని చేయడానికి ప్రయత్నించను. నేను ఒక మూర్ఖునిలా చాలా భయంకరమైన తప్పు చేశాను” అన్నాడు.


Lean sinn:

Sanasan


Sanasan