Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 32:44 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

44 బెన్యామీను ప్రాంతాల్లోనూ, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ, యూదా పట్టణాల్లోనూ, కొండ సీమల్లోనూ, పడమటి దిగువ కొండ ప్రదేశాల్లోనూ, దక్షిణ ప్రాంతాల్లోనూ పొలాలు వెండి ఇచ్చి కొంటారు, ఒప్పందాలపై సంతకాలు చేస్తారు, కొనుగోలు పత్రాలపై ముద్రలు వేస్తారు, ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

44 నేను వారిలో చెరపోయినవారిని రప్పింపబోవుచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములుకొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్రవేయుదురు, సాక్షులను పెట్టుదురు; ఇదే యెహోవా వాక్కు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

44 వాళ్ళు వెండితో పొలాలు కొని ముద్రించిన రాత పత్రాల్లో రాస్తారు. వాళ్ళు బెన్యామీను దేశంలో, యెరూషలేము ప్రాంతాల్లో, యూదా పట్టణాల్లో, మన్యంలోని పట్టణాల్లో, దక్షిణదేశపు పట్టణాల్లో సాక్షులను సమావేశపరుస్తారు. ఎందుకంటే నేను వాళ్ళ భాగ్యం వాళ్లకు మళ్ళీ తీసుకొస్తాను.” ఇది యెహోవా వాక్కు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

44 ప్రజలు తమ ధనాన్ని వెచ్చించి పంట భూములు కొంటారు. ప్రజలు తమ క్రయదస్తావేజులపై సంతకాలు చేసి వాటిపై ముద్రలు వేసి భద్రపరుస్తారు. ప్రజలు తమ దస్తావేజులపై సంతకాలు చేయునట్లు సాక్షులను నియమిస్తారు. బెన్యామీను వంశస్తులు నివసించే ప్రాంతంలో కూడా ప్రజలు మళ్లీ భూములు కొంటారు వారు యెరూషలేము చుట్టుపట్ల పొలాలు కొంటారు. వారు యూదా పట్టణ ప్రాంతాలలోను, మన్య ప్రాంతాలలోను, పడమటి కొండవాలు ప్రాంతంలోను, మరియు దక్షిణ ఎడారి ప్రాంతంలోను భూములు కొంటారు. మీ ప్రజలందరిని నేను తిరిగి స్వదేశానికి తీసికొని వస్తాను. గనుక ఇదంతా జరుగుతుంది.” ఈ సందేశం యెహోవా నుండి వచ్చినది.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

44 బెన్యామీను ప్రాంతాల్లోనూ, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ, యూదా పట్టణాల్లోనూ, కొండ సీమల్లోనూ, పడమటి దిగువ కొండ ప్రదేశాల్లోనూ, దక్షిణ ప్రాంతాల్లోనూ పొలాలు వెండి ఇచ్చి కొంటారు, ఒప్పందాలపై సంతకాలు చేస్తారు, కొనుగోలు పత్రాలపై ముద్రలు వేస్తారు, ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.”

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 32:44
17 Iomraidhean Croise  

నా సేవకుని మాటలను స్థిరపరచి నా దూతల ఆలోచనను నెరవేర్చేది నేనే. “యెరూషలేము నివాస స్థలంగా అవుతుందని యూదా పట్టణాలు మరలా కట్టబడతాయని వాటిలో పాడైన స్థలాలను బాగుచేయబడతాయని చెప్పాను.


దక్షిణ వైపు ఉన్న పట్టణాలు మూసివేయబడతాయి, వాటిని తెరవడానికి పట్టించుకునేవారే ఉండరు. యూదా వారంతా బందీగా కొనిపోబడతారు, ఏమి మిగులకుండ పూర్తిగా కొనిపోబడతారు.


యూదా పట్టణాల నుండి, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల నుండి, బెన్యామీను ప్రాంతం నుండి, పడమటి కొండ దిగువ ప్రదేశాల నుండి, కొండ ప్రదేశాల నుండి, దక్షిణ వైపు నుండి ప్రజలు దహనబలులను, బలులను, భోజనార్పణలను, ధూపద్రవ్యాలను, కృతజ్ఞతార్పణలను యెహోవా ఆలయానికి తీసుకువస్తారు.


“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నేను యాకోబు ఇంటివారిని చెర నుండి తిరిగి రప్పించి, అతని నివాసాలపై కనికరం చూపుతాను. పట్టణం దాని శిథిలాల మీద మరలా కట్టబడుతుంది, రాజభవనం దాని స్థలంలోనే ఉంటుంది.


అవి జరుగబోయే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నా ప్రజలైన ఇశ్రాయేలును, యూదాను చెరనుండి విడిపించి, వారి పూర్వికులకు నేనిచ్చిన దేశానికి వారిని రప్పిస్తాను, వారు దాన్ని స్వాధీనం చేసుకునే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా చెప్తున్నారు.”


ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను వారిని చెర నుండి తిరిగి రప్పించినప్పుడు, యూదా దేశంలోనూ దాని పట్టణాల్లోనూ ఉన్న ప్రజలు ఇలా చెప్తారు: ‘నీతి కలిగిన నగరమా, పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక.’


నేను క్రయపత్రం వ్రాసి ముద్రవేసి, సాక్షి సంతకం కూడా చేయించి వెండిని తూకం వేయించి ఇచ్చాను.


నా ఉగ్రతతో, గొప్ప కోపంతో నేను వారిని వెళ్లగొట్టే అన్ని దేశాల నుండి తప్పకుండా వారిని సమకూర్చి తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి క్షేమంగా జీవించేలా చేస్తాను.


సంతోషకరమైన శబ్దాలు, ఆనంద ధ్వనులు, వధూవరుల స్వరాలు మరోసారి వినిపిస్తాయి. వారు యెహోవా ఆలయానికి కృతజ్ఞతార్పణలు తీసుకువస్తూ, “సైన్యాల యెహోవాకు స్తుతులు చెల్లించండి, యెహోవా మంచివాడు; ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది” అంటారు. ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను’ అని యెహోవా అంటున్నారు.


కొండ ప్రాంత పట్టణాల్లో, పడమటి పర్వత ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతంలో, బెన్యామీను ప్రాంతంలో, యెరూషలేము చుట్టూ ఉన్న గ్రామాల్లో, యూదా పట్టణాల్లో మందలు లెక్కించే వారిచేత లెక్కించబడతాయి’ అని యెహోవా చెప్తున్నారు.


అప్పుడు నేను యాకోబు నా సేవకుడైన దావీదుల సంతతిని తిరస్కరించి ఉండేవాన్ని, అబ్రాహాము, ఇస్సాకు యాకోబుల సంతతివారిని పరిపాలించడానికి అతని కుమారులలో ఒక్కరిని కూడా ఎన్నుకోను. ఎందుకంటే నేను చెర నుండి వారిని తిరిగి రప్పించి, వారిపై కనికరం చూపుతాను.’ ”


నేను యూదాను, ఇశ్రాయేలీయులను చెర నుండి తిరిగి రప్పించి వారు ఎలా పూర్వం ఉన్నారో వారిని తిరిగి అలాగే నిర్మిస్తాను.


దక్షిణ ప్రాంత ప్రజలు ఏశావు పర్వతాలను స్వాధీనం చేసుకుంటారు, దిగువ కొండ ప్రాంత ప్రజలు, ఫిలిష్తీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. వారు ఎఫ్రాయిం, సమరయ భూములను స్వాధీనం చేసుకుంటారు, బెన్యామీను వారు గిలాదును స్వాధీనం చేసుకుంటారు.


కనానులో బందీలుగా ఉన్న ఇశ్రాయేలీయులు సారెపతు వరకు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు; సెఫారాదులో ఉన్న యెరూషలేము ప్రవాసులు దక్షిణ ప్రాంత పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు.


ఆ ప్రాంతం యూదా వంశంలో మిగిలిన వారికి స్వాధీనం అవుతుంది. వారి దేవుడు యెహోవా వారి పట్ల శ్రద్ధ చూపిస్తారు, వారు బందీలుగా వెళ్లిన స్థలాల నుండి ఆయన వారిని రప్పిస్తారు. వారు ఆ ప్రాంతంలో తమ మందలు మేపుతారు. సాయంకాల సమయంలో అష్కెలోను ఇళ్ళలో పడుకుంటారు.


యెరూషలేము, దాని ప్రక్కన ఉన్న పట్టణాలన్ని విశ్రాంతిగా క్షేమంగా ఉన్నప్పుడు, దక్షిణ ప్రదేశం, పడమటి మైదానాల్లో ప్రజలు విస్తరించి ఉన్నప్పుడు పూర్వకాలపు ప్రవక్తల ద్వారా యెహోవా ఈ మాటలను ప్రకటించలేదా?’ ”


Lean sinn:

Sanasan


Sanasan