Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 32:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

34 నా పేరు కలిగిన మందిరంలో తమ నీచమైన విగ్రహాలను ప్రతిష్ఠించి దానిని అపవిత్రం చేశారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

34 మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైనవాటిని పెట్టిరి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

34 తరువాత వాళ్ళు నా పేరు పెట్టిన మందిరాన్ని అపవిత్రం చెయ్యడానికి దానిలో హేయమైన వాటిని పెట్టారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

34 వారు విగ్రహాలను చేస్తూనే వచ్చారు. నేనా విగ్రహాలను ఏవగించుకున్నాను. పైగా నా పేరు మీద పిలవబడే ఆలయంలో వారా విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ విధంగా వారు నా మందిరాన్ని ‘అపవిత్రం’ చేశారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

34 నా పేరు కలిగిన మందిరంలో తమ నీచమైన విగ్రహాలను ప్రతిష్ఠించి దానిని అపవిత్రం చేశారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 32:34
15 Iomraidhean Croise  

మనష్షే రాజైనప్పుడు అతని వయస్సు పన్నెండేళ్ళు, అతడు యెరూషలేములో యాభై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హెఫ్సిబా.


అతడు యెహోవా మందిరం నుండి యెరూషలేము బయట ఉన్న కిద్రోను లోయ దగ్గరకు అషేరా స్తంభాన్ని తెప్పించి, అక్కడ దానిని కాల్చివేశాడు. అతడు దానిని పొడిగా నలుగగొట్టి ఆ పొడిని సాధారణ ప్రజల సమాధుల మీద చల్లాడు.


అతడు యెహోవా మందిరంలో నుండి ఇతర దేవుళ్ళ విగ్రహాలను తొలగించాడు. యెరూషలేములో, యెహోవా మందిర కొండమీద తాను కట్టించిన బలిపీఠాలు తీసివేసి పట్టణం బయట వాటిని పారవేయించాడు.


ఇంకా, యాజకుల నాయకులందరు, ప్రజలందరు ఇతర దేశాల అసహ్యమైన ఆచారాలన్నిటిని అనుసరించి, యెరూషలేములో ఆయన ప్రతిష్ఠించిన యెహోవా మందిరాన్ని అపవిత్రం చేస్తూ మరింతగా నమ్మకద్రోహులయ్యారు.


ఎందుకంటే వారు నన్ను విడిచిపెట్టి, ఈ స్థలాన్ని ఇతర దేవతల స్థలంగా చేశారు. వారికి గాని, వారి పూర్వికులకు గాని, యూదా రాజులకు గాని తెలియని దేవతలకు ధూపం వేసి, ఈ స్థలాన్ని నిర్దోషుల రక్తంతో నింపారు.


“ప్రవక్త యాజకుడు ఇద్దరూ భక్తిహీనులే; నా మందిరంలో కూడా వారి దుర్మార్గాన్ని నేను చూస్తున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


నీ స్నేహితులందరు నిన్ను మరచిపోయారు; వారు నీ గురించి ఏమీ పట్టించుకోరు. శత్రువు కొట్టినట్లుగా నేను నిన్ను కొట్టి, క్రూరమైనవానిలా నిన్ను శిక్షించాను, ఎందుకంటే నీ అపరాధం చాలా పెద్దది, నీ పాపాలు చాలా ఎక్కువ.


ఇటీవలే మీరు పశ్చాత్తాపపడి మీలో ప్రతి ఒక్కరూ మీ సొంత ప్రజలకు విడుదల ప్రకటించి నా దృష్టికి సరియైనది చేశారు. నా పేరు కలిగిన మందిరంలో మీరు నా ముందు ఒక ఒడంబడిక కూడా చేశారు.


‘నేను అసహ్యించుకునే ఈ అసహ్యకరమైన పనిని చేయవద్దు!’ అని చెప్పమని మళ్ళీ మళ్ళీ నేను నా సేవకులైన ప్రవక్తలను పంపాను, వారు వెళ్లి చెప్పారు.


తర్వాత వచ్చి నా పేరుతో పిలువబడే ఈ మందిరంలో నా ముందు నిలబడి, “మేము క్షేమంగా ఉన్నాము” ఈ అసహ్యకరమైన వాటన్నిటిని చేయడానికి క్షేమంగా ఉన్నాము అని అంటారా?


“ ‘యూదా ప్రజలు నా దృష్టికి చెడు చేశారు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. వారు నా పేరు కలిగి ఉన్న నా మందిరంలో వారి అసహ్యమైన విగ్రహాలను నిలబెట్టి దానిని అపవిత్రం చేశారు.


వారు వారి కుమారులను, కుమార్తెలను అగ్నిలో కాల్చడానికి బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతులో క్షేత్రాలను నిర్మించారు. అలా చేయమని నేను ఆజ్ఞాపించలేదు నా మనస్సులోకి కూడా రాలేదు.


Lean sinn:

Sanasan


Sanasan