Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 32:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 మీరు వేలమందిపై ప్రేమ చూపిస్తారు కానీ తల్లిదండ్రుల పాపాల శిక్షను వారి తర్వాత వారి పిల్లల ఒడిలోకి తీసుకువస్తారు. ఆయన గొప్ప బలవంతుడైన దేవుడు, ఆయన పేరు సైన్యాల యెహోవా.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 నీవు వేవేలమందికి కృపచూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 నువ్వు వేవేల మందికి నీ నిబంధనా నమ్మకత్వం కనపరుస్తావు. తండ్రుల దోషం వాళ్ళ తరువాత వాళ్ళ పిల్లల ఒడిలో వేస్తావు. నువ్వు గొప్ప శక్తిగల దేవుడవు. సేనల ప్రభువైన యెహోవా అని నీకు పేరు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

18 యెహోవా, నీవు వేలాది ప్రజలకు దయామయుడవు, నమ్మకస్తుడవు అయివున్నావు. కాని పెద్దల తప్పులకు వారి పిల్లలను కూడా శిక్షింపగలవాడవు. మహోన్నతుడవు, శక్తి సంపన్నుడవు, సర్వశక్తిమంతుడైన యెహోవా అని నీకు పేరు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 మీరు వేలమందిపై ప్రేమ చూపిస్తారు కానీ తల్లిదండ్రుల పాపాల శిక్షను వారి తర్వాత వారి పిల్లల ఒడిలోకి తీసుకువస్తారు. ఆయన గొప్ప బలవంతుడైన దేవుడు, ఆయన పేరు సైన్యాల యెహోవా.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 32:18
33 Iomraidhean Croise  

కానీ అతని విల్లు స్థిరంగా నిలిచింది, అతని చేతులు బలంగా ఉన్నాయి, ఎందుకంటే యాకోబు యొక్క బలవంతుని హస్తాన్ని బట్టి, కాపరి, ఇశ్రాయేలు యొక్క బండను బట్టి,


‘నిన్నటి రోజు నేను నాబోతు రక్తం అతని కుమారుల రక్తం చూశాను, ఖచ్చితంగా ఈ పొలంలోనే నీకు ప్రతీకారం చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.’ కాబట్టి ఇప్పుడు అతన్ని ఎత్తి ఆ పొలంలో పడవెయ్యి.”


నేను ఆయనకు ఇలా ప్రార్థించాను: “యెహోవా పరలోకపు దేవా, అద్భుతమైన గొప్ప దేవా, మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల మీ ప్రేమ ఒడంబడికను మీరు నెరవేరుస్తారు,


దేవుడైన యెహోవా, బలాఢ్యుడు, భూమితో మాట్లాడతారు, సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు వారందరిని పిలుస్తారు.


పొంగే సముద్రాన్ని మీరు అదుపులో ఉంచుతారు; అలలను మీరు అణచివేస్తారు.


మోషే ఎదుట నుండి ఆయన దాటి వెళ్తూ, “యెహోవా, దేవుడైన యెహోవా కనికరం దయ కలిగినవారు, త్వరగా కోప్పడరు, ప్రేమ నమ్మకత్వాలతో నిండియున్నవారు,


వేలాదిమందికి ప్రేమను చూపిస్తూ, దుర్మార్గాన్ని, తిరుగుబాటును, పాపాన్ని క్షమిస్తారు గాని ఆయన దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టక, మూడు నాలుగు తరాల వరకు తల్లిదండ్రుల పాపానికి పిల్లలను వారి పిల్లలను శిక్షిస్తారు” అని ప్రకటించారు.


మిగిలినవారు తిరిగి వస్తారు, యాకోబులో మిగిలినవారు బలవంతుడైన దేవుని వైపు తిరుగుతారు.


ఎందుకంటే మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసియైన దేవుడు ఇలా చెప్తున్నారు: “నేను ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాను, అంతేకాక వినయం గలవారి ఆత్మకు చైతన్యం కలిగించడానికి నలిగినవారి ప్రాణానికి చైతన్యం కలిగించడానికి ఆత్మలో వినయం, దీనమనస్సు గలవారి దగ్గర నివసిస్తాను.


ఎందుకంటే మన కోసం ఒక శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన అద్భుతమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి, సమాధానాధిపతి అని పిలువబడతాడు.


యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు. ఆయన పేరు సైన్యాల యెహోవా.


యెహోవా, మీలాంటి వారు ఎవరు లేరు; మీరు గొప్పవారు, మీ నామం ఘనమైనది.


అయితే పరాక్రమంగల బలాఢ్యుడైన యెహోవా నాకు తోడు; కాబట్టి నన్ను హింసించేవారు నిలువలేక తడబడతారు, వారు అనుకున్నది సాధించే యుక్తి లేక అవమానపాలవుతారు; వారి అవమానం ఎన్నటికీ మరవబడదు.


యెహోవా ఇలా చెప్తున్నారు, పగలు ప్రకాశించడానికి సూర్యుని నియమించినవాడు, రాత్రి ప్రకాశించడానికి, చంద్రుని, నక్షత్రాలను శాసించేవాడు, కెరటాలు గర్జించేలా, సముద్రాన్ని కదిలించేవాడు ఆయనే, ఆయన పేరు సైన్యాల యెహోవా:


“యెహోవా ఇలా అంటున్నారు, ఆయన భూమిని సృష్టించారు, యెహోవా దానిని రూపించి, స్థాపించారు; యెహోవా అని పేరు కలిగినవారే ఇలా చెప్తున్నారు,


అయినా వారి విమోచకుడు బలవంతుడు; ఆయన పేరు సైన్యాల యెహోవా. ఆయన వారి దేశానికి విశ్రాంతిని తెచ్చేలా వారి పక్షాన వాదిస్తారు, బబులోనులో నివసించేవారికి అశాంతి కలుగుతుంది.”


మనుష్యుల చేతితో ముట్టని రాయి, పర్వతం నుండి చీలిపోయి ఇనుమును, ఇత్తడిని, వెండిని, బంగారాన్ని ముక్కలు చేసినట్లు వచ్చిన ఆ దర్శనానికి అర్థం ఇది. “గొప్ప దేవుడు భవిష్యత్తులో జరిగేది రాజుకు వెల్లడి చేశారు. ఈ కల నిజం, దాని వివరణ నమ్మదగినది.”


యెహోవా, నీవు ఆరంభం నుండి ఉన్నవాడవు కావా? నా దేవా, నా పరిశుద్ధుడా, నీవు ఎన్నడు చనిపోవు. యెహోవా, నీవు వారిని తీర్పు తీర్చడానికి నియమించావు; నా రక్షకా, మమ్మల్ని దండించడానికి నీవు వారిని నియమించావు.


‘యెహోవా త్వరగా కోప్పడరు, ప్రేమ క్షమాగుణాలతో నిండియున్నవారు, ఆయన తిరుగుబాటును పాపాన్ని క్షమిస్తారు గాని ఆయన దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టక, మూడు నాలుగు తరాల వరకు తల్లిదండ్రుల పాపానికి వారి పిల్లలను శిక్షిస్తారు.’


అప్పుడు ప్రజలందరు, “ఇతని రక్తం మామీద మా పిల్లల మీద ఉండును గాక!” అని కేకలు వేశారు.


ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. అణచి, కుదిపి, పొర్లిపారునట్లు నిండు కొలత మీ ఒడిలో పోయబడుతుంది. ఎందుకంటే, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత కొలవబడుతుంది.”


ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా దేవుళ్ళకు దేవుడు ప్రభువులకు ప్రభువు, గొప్ప దేవుడు, బలవంతుడు, అద్భుత దేవుడు, పక్షపాతం లేనివారు, లంచం పుచ్చుకోని దేవుడు.


మీరు వారికి భయపడకండి, ఎందుకంటే మీ మధ్య ఉన్న మీ దేవుడైన యెహోవా గొప్పవాడు, అద్భుత దేవుడు


Lean sinn:

Sanasan


Sanasan