Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 30:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘భయంతో కూడిన కేకలు వినబడుతున్నాయి, భయమే ఉంది తప్ప, సమాధానం లేదు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 యెహోవా యిట్లనెను–సమాధానములేనికాలమున భీతిచేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 “యెహోవా ఇలా అంటున్నాడు, ‘భయంతో వణుకుతున్న స్వరం మేం విన్నాం. ఆ స్వరంలో శాంతి లేదు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

5 యెహోవా చెప్పినది ఇలా ఉంది: “భయంతో ప్రజలు చేసే ఆక్రందన మనం వింటున్నాం! ప్రజలు భీతావహులయ్యారు! వారికి శాంతి లేదు!

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘భయంతో కూడిన కేకలు వినబడుతున్నాయి, భయమే ఉంది తప్ప, సమాధానం లేదు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 30:5
22 Iomraidhean Croise  

వారు ఆ రోజు సముద్ర ఘోషలా తమ శత్రువు మీద గర్జిస్తారు. ఒకవేళ ఎవరైనా భూమివైపు చూస్తే, అక్కడ చీకటి, బాధ మాత్రమే కనబడుతుంది; మేఘాలు కమ్మి వెలుగు కూడా చీకటిగా అవుతుంది.


మేమంతా ఎలుగుబంట్లలా కేకలు వేస్తున్నాము; పావురాల్లా దుఃఖంతో మూలుగుతున్నాము. మేము న్యాయం కోసం చూస్తున్నాం కాని అది దొరకడం లేదు. రక్షణ కోసం చూస్తున్నాం కాని అది మాకు దూరంగా ఉంది.


ఎడారిలో ఉన్న బంజరు కొండలపైకి నాశనం చేసేవారు గుంపుగా వస్తున్నారు, యెహోవా ఖడ్గం భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు హతం చేస్తుంది; ఎవరూ క్షేమంగా ఉండరు.


గొర్రెల కాపరుల మొర, మంద నాయకుల ఏడ్పులు వినబడుతున్నాయి, యెహోవా వారి పచ్చికను నాశనం చేస్తున్నారు.


ఇశ్రాయేలు, యూదా గురించి యెహోవా చెప్పిన మాటలు:


నేను చూస్తున్నదేంటి? వారు భయభ్రాంతులకు గురవుతున్నారు, వారు వెన్ను చూపుతున్నారు, వారి యోధులు ఓడిపోయారు. వారు వెనుకకు చూడకుండ వేగంగా పారిపోతున్నారు, అన్నివైపులా భయమే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, ఉత్తర దేశం నుండి ఒక సైన్యం వస్తుంది; ఒక గొప్ప దేశం భూదిగంతాల నుండి పురికొల్పబడతారు.


నా ప్రజలారా, గోనెపట్ట కట్టుకుని బూడిదలో దొర్లండి. ఒక్కగానొక్క కుమారుని కోసం తీవ్ర రోదనతో దుఃఖించండి, ఎందుకంటే హఠాత్తుగా నాశనం చేసేవాడు మన మీదికి వస్తాడు.


శత్రువుల గుర్రాల బుసలు కొట్టడం దాను నుండి వినబడుతుంది; వారి మగ గుర్రాల సకిలింపుకు దేశమంతా వణికిపోతుంది. వారు మ్రింగివేయడానికి భూమిని, అందులోని సమస్తాన్ని, పట్టణాన్ని, అందులో నివసించే వారినందరిని మ్రింగివేయడానికి వచ్చారు.


సుదూరదేశం నుండి నా ప్రజల మొరను ఆలకించు: “యెహోవా సీయోనులో లేడా? ఆమె రాజు ఇక ఇప్పుడు అక్కడ లేరా?” “వారు తమ చిత్రాలతో, తమ పనికిమాలిన పరదేశి విగ్రహాలతో ఎందుకు నాకు కోపం రప్పించారు?”


సీయోను నుండి రోదిస్తున్న శబ్దం వినబడుతుంది: ‘మనం పూర్తిగా పతనం అయ్యాము! మన ఘోరంగా అవమానపరచబడ్డాము! మన ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి మనం మన దేశాన్ని వదిలిపెట్టాలి.’ ”


నేను మీరు ఆచరించే పండుగలను విలాపంగా, మీ పాటలన్నీ విషాద గీతాలుగా మారుస్తాను. నేను మీరంతా గోనెపట్ట కట్టుకునేలా, తల గొరిగించుకునేలా చేస్తాను. ఏకైక కుమారుని కోసం ఏడ్చినట్లుగా ఆ సమయాన్ని చేస్తాను, దాని అంతం ఘోరమైన రోజుగా ఉంటుంది.


వారు రాజులను వెక్కిరిస్తారు పాలకులను ఎగతాళి చేస్తారు. కోటలున్న పట్టణాలను చూసి నవ్వుతారు; మట్టి దిబ్బలు వేసి వాటిని స్వాధీనపరచుకుంటారు.


తమవి కాని నివాస స్థలాలను ఆక్రమించుకోడానికి, భూమి అంచుల వరకు తిరిగే క్రూరులును, ఆవేశపరులునైన బబులోను ప్రజలను నేను రేపుతున్నాను.


Lean sinn:

Sanasan


Sanasan