యిర్మీయా 30:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 “ ‘కాబట్టి నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలు, కలవరపడకు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘సుదూర ప్రాంతం నుండి నేను నిన్ను తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతిని వారు బందీలుగా ఉన్న దేశం నుండి తప్పకుండా రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ సమాధానం నెమ్మది కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మరియు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము, నేను దూరముననుండు నిన్నును, చెరలోనికి పోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడులేకుండ యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 కాబట్టి, నా సేవకుడవైన యాకోబూ, భయపడకు, యెహోవా చేప్పేదేమంటే, ‘ఇశ్రాయేలూ, దిగులు పడకు. దూరంగా ఉన్న నిన్ను, బందీలుగా ఆ దేశంలో ఉన్న నీ సంతతి వాళ్ళను, నేను రక్షించబోతున్నాను. యాకోబు సంతతి తిరిగి వచ్చి, శాంతి కలిగి ఉంటుంది. అతడు సురక్షితంగా ఉంటాడు, భయభీతులు ఇంక ఉండవు. Faic an caibideilపవిత్ర బైబిల్10 “కావున నా సేవకుడవైన యాకోబూ, నీవు భయపడవద్దు!” ఇదే యెహోవా వాక్కు: “ఇశ్రాయేలూ, భయపడవద్దు! ఆ సుదూర దేశంనుండి నిన్ను నేను రక్షిస్తాను. ఆ దూర దేశంలో మీరు బందీలైవున్నారు. మీ సంతతివారిని ఆ దేశంనుండి తిరిగి తీసుకొస్తాను. యాకోబుకు తిరిగి శాంతి సమకూరుతుంది. ప్రజలు యాకోబును బాధ పెట్టరు. నా ప్రజలను భయపెట్టుటకు ఇక శత్రువులుండరు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 “ ‘కాబట్టి నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలు, కలవరపడకు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘సుదూర ప్రాంతం నుండి నేను నిన్ను తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతిని వారు బందీలుగా ఉన్న దేశం నుండి తప్పకుండా రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ సమాధానం నెమ్మది కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు. Faic an caibideil |