Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 3:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 నీవు ఇప్పుడే నన్ను పిలిచి: ‘నా తండ్రీ, నా చిన్నప్పటి నుండి నా స్నేహితుడవు,

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 అయినను ఇప్పుడు నీవు–నా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవే యని నాకు మొఱ్ఱపెట్టుచుండవా?

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అయినా ఇప్పుడు నువ్వు “నా తండ్రీ, చిన్నప్పటి నుండి నాకు దగ్గర స్నేహితుడివి” అని నాకు మొర పెడుతున్నావు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

4 కాని నీవు నన్నిప్పుడు పిలుస్తున్నావు. ‘నా తండ్రీ’ నా బాల్యంనుండి ‘నీవు నాకు ప్రియ మిత్రునిలా ఉన్నావు.’

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 నీవు ఇప్పుడే నన్ను పిలిచి: ‘నా తండ్రీ, నా చిన్నప్పటి నుండి నా స్నేహితుడవు,

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 3:4
16 Iomraidhean Croise  

యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు? మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే.


ఈ దేవుడు ఎప్పటికీ మన దేవుడు; ఆయన చివరి వరకు నడిపిస్తారు.


దేవా! నా యవ్వనం నుండి మీరు నాకు బోధించారు, ఈ రోజు వరకు నేను మీ అద్భుత క్రియలను ప్రకటిస్తున్నాను.


ప్రభువైన యెహోవా, మీరే నా నిరీక్షణ, నా యవ్వనం నుండి మీరే నా ధైర్యం.


సామాన్యులకు బుద్ధి కలిగించడం కోసం, యవ్వనస్థులకు తెలివి వివేకం కలిగించడం కోసం,


అలాంటి స్త్రీ తన యవ్వన కాలపు భర్తను విడిచిపెట్టి దేవుని ఎదుట తాను చేసిన ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేస్తుంది.


“నీవు వెళ్లి యెరూషలేము వింటూ ఉండగా ఇలా ప్రకటించు: “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ యవ్వనంలోని నీ భక్తి నాకు జ్ఞాపకముంది, మీ నిశ్చితార్థ కాలం యొక్క ప్రేమ నాకు జ్ఞాపకముంది; నీవు అరణ్యంలో నన్ను వెంబడించావు, విత్తబడని భూమిలో నన్ను వెంబడించావు.


వారు చెక్కతో, ‘నీవు మా తండ్రివి’ అని, రాయితో, ‘నీవు మాకు జన్మనిచ్చావు’ అంటున్నారు వారు నావైపు వారి ముఖాలు త్రిప్పకుండ, నాకు వెన్ను చూపారు; అయినప్పటికీ వారు కష్టంలో ఉన్నప్పుడు, ‘వచ్చి మమ్మల్ని రక్షించండి!’ అని అంటారు.


“నేను నేనే ఇలా అన్నాను, “ ‘మిమ్మల్ని నా పిల్లల్లా చూసుకుంటాను మీకు ఆహ్లాదకరమైన భూమిని, ఏ జాతికి చెందనంత అందమైన వారసత్వాన్ని ఇస్తాను.’ ‘తండ్రీ’ అని నీవు నన్ను పిలుస్తావని అనుకున్నాను నన్ను అనుసరించకుండ దూరంగా వెళ్లవని అనుకున్నాను.


విశ్వాసఘాతకురాలవైన కుమార్తె, ఇశ్రాయేలూ, నీవు ఎంతకాలం తిరుగుతావు? యెహోవా భూమిపై ఒక క్రొత్తదాన్ని సృష్టిస్తారు, స్త్రీ పురుషుని దగ్గరకు తిరిగి వస్తుంది.”


వారు ఏడుస్తూ వస్తారు; నేను వారిని వెనుకకు తీసుకువస్తున్నప్పుడు వారు ప్రార్థన చేస్తారు. నేను వారిని నీటి ప్రవాహాల ప్రక్కన వారు తడబడని తిన్నని దారిలో నడిపిస్తాను ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల తండ్రిగా ఉంటాను, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారునిగా ఉంటాడు.


అక్కడ ఆమె ద్రాక్షతోటలను ఆమెకు తిరిగి ఇస్తాను, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అక్కడ ఆమె తన యవ్వన రోజుల్లో ఉన్నట్లు, ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రోజున ఉన్నట్లు స్పందిస్తుంది.


“కుమారుడు తన తండ్రిని గౌరవిస్తాడు, దాసుడు తన యజమానిని గౌరవిస్తాడు, కానీ ఒకవేళ నేను మీ తండ్రినైతే, మరి నా గౌరవం ఏది? నేను యజమానినైతే, నాకెందుకు భయపడరు?” అని సైన్యాల యెహోవా అంటున్నారు. “యాజకులైన మీరు నా నామాన్ని అవమానిస్తున్నారు. “అయినా మీరు, ‘మేము మీ నామాన్ని ఎలా అవమానిస్తున్నాము?’ అని అంటారు.


“ఎందుకు?” అని మీరడుగుతారు. ఎందుకంటే నీకు నీ యవ్వనకాలంలో నీవు పెండ్లాడిన భార్యకు మధ్య యెహోవా సాక్షిగా ఉన్నారు. ఆమె నీ భాగస్వామి, నీ చేసిన వివాహ నిబంధన వలన నీ భార్య అయినప్పటికీ నీవు ఆమెకు ద్రోహం చేశావు.


Lean sinn:

Sanasan


Sanasan