యిర్మీయా 3:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 ఆ రోజుల్లో దేశంలో మీ సంఖ్య బాగా పెరిగినప్పుడు” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “ప్రజలు ఇకపై, ‘యెహోవా నిబంధన మందసం’ అని అనరు. అది ఎప్పటికీ వారి మనస్సులోకి ఎక్కదు, జ్ఞాపకంలో ఉండదు; అది తప్పిపోదు, మరొకటి తయారుచేయబడదు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మీరు ఆ దేశములో అభివృద్ధిపొంది విస్తరించు దినములలో జనులు–యెహోవా నిబంధనమందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఆ రోజుల్లో మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరిస్తూ ఉన్నప్పుడు ప్రజలు యెహోవా నిబంధన మందసం గురించి మాట్లాడరు. అది వారి మనస్సుకు తట్టదు. దాన్ని జ్ఞాపకం చేసుకోరు. అది లేనందుకు బాధపడరు, ఇక ముందు దాన్ని తయారు చేయరు. ఇదే యెహోవా వాక్కు. Faic an caibideilపవిత్ర బైబిల్16 ఆ రోజుల్లో, రాజ్యంలో మీ సంతతి పెరిగి మీరనేకులై ఉంటారు.” ఈ వాక్కు యెహోవాది. “ఆ సమయంలో ప్రజలు తాము దేవుని నిబంధన మందసాన్ని కలిగివున్న రోజులు గుర్తున్నట్లు చెప్పరు. ఆ యెహోవా ఒడంబడికను గూర్చి వారెంత మాత్రం తలంచరు. వారు దానిని గుర్తుంచుకోరు. పోగొట్టు కోరు. వారు మరో పవిత్ర ఒడంబడికను చేయరు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 ఆ రోజుల్లో దేశంలో మీ సంఖ్య బాగా పెరిగినప్పుడు” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “ప్రజలు ఇకపై, ‘యెహోవా నిబంధన మందసం’ అని అనరు. అది ఎప్పటికీ వారి మనస్సులోకి ఎక్కదు, జ్ఞాపకంలో ఉండదు; అది తప్పిపోదు, మరొకటి తయారుచేయబడదు. Faic an caibideil |