Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 27:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 ఒకవేళ వారు ప్రవక్తలైతే వారు యెహోవా మాటలు కలిగి ఉన్నట్లయితే, యెహోవా మందిరంలో, యూదారాజు రాజభవనంలో యెరూషలేములో మిగిలి ఉన్న వస్తువులను బబులోనుకు తీసుకెళ్లవద్దని వారు సైన్యాల యెహోవాను వేడుకోవడం మంచిది.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 వారు ప్రవక్తలైనయెడల, యెహోవా వాక్కు వారికి తోడైయుండినయెడల, యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపో బడకుండునట్లువారు సైన్యములకధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 వాళ్ళు ప్రవక్తలైతే యెహోవా సందేశం వాళ్ళతో ఉంటే యెహోవా మందిరంలో యూదా రాజు మందిరంలో యెరూషలేములో మిగిలిన పాత్రలు బబులోనుకు తరలి పోకుండా వాళ్ళు సేనల ప్రభువు యెహోవాను బతిమాలుకోవడం మంచిది.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

18 ఈ మనుష్యులు నిజంగానే ప్రవక్తలయితే, వారికి యెహోవా సందేశం అందితే వారిని ప్రార్థన చేయనివ్వండి. ఇంకా దేవునిలో వున్న వస్తువుల గురించి ప్రార్థన చేయనివ్వండి. రాజ భవనంలో యింకా మిగిలివున్న వస్తువుల గురించి వారిని ప్రార్థన చేయనివ్వండి. ఇంకా యెరూషలేములో వున్న వాటిని గురించి ప్రార్థన చేయనివ్వండి. ఆయా వస్తుసముదాయాలు బబులోనుకు తీసుకొని పోబడకుండా వుండేలా ఆ ప్రవక్తలను ప్రార్థన చేయనివ్వండి.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 ఒకవేళ వారు ప్రవక్తలైతే వారు యెహోవా మాటలు కలిగి ఉన్నట్లయితే, యెహోవా మందిరంలో, యూదారాజు రాజభవనంలో యెరూషలేములో మిగిలి ఉన్న వస్తువులను బబులోనుకు తీసుకెళ్లవద్దని వారు సైన్యాల యెహోవాను వేడుకోవడం మంచిది.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 27:18
18 Iomraidhean Croise  

అప్పుడు అబ్రాహాము దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు అబీమెలెకును, అతని భార్య, అతని ఆడ దాసీలను స్వస్థపరచగా వారు తిరిగి పిల్లలు కన్నారు.


మీరు మీ దేవుని పేరిట ప్రార్థన చేయండి, నేను యెహోవా పేరిట ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే అగ్నిని పంపి జవాబిస్తాడో ఆయనే నిజమైన దేవుడు” అని అన్నాడు. అప్పుడు ప్రజలంతా, “నీవు చెప్పింది బాగుంది” అన్నారు.


కాబట్టి వారు ఒక ఎద్దును తీసుకుని సిద్ధం చేశారు. తర్వాత వారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, “బయలా! మాకు జవాబివ్వు!” అని అంటూ బయలు పేరెత్తి బిగ్గరగా మొరపెట్టారు. కాని ఏ స్పందన లేదు; ఎవరూ జవాబివ్వలేదు. వారు సిద్ధం చేసిన బలిపీఠం చుట్టూ నాట్యం చేయడం మొదలుపెట్టారు.


రాజైన హిజ్కియా, ఆమోజు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా ఈ విషయం గురించి ప్రార్థించి ఆకాశం వైపు మొరపెట్టారు.


అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “మోషే, సమూయేలు నా ముందు నిలబడినా, నా హృదయం ఈ ప్రజల వైపుకు వెళ్లదు. వారిని నా సన్నిధి నుండి దూరంగా పంపివేయి! వారిని వెళ్లనివ్వు!


మేలుకు ప్రతిగా కీడు చేయాలా? అయినా వారు నా కోసం గొయ్యి త్రవ్వారు. నేను నీ ఎదుట నిలబడి వారి మీది నుండి మీ కోపం తొలగించమని వారి పక్షాన నేను మిమ్మల్ని వేడుకున్నానని జ్ఞాపకం తెచ్చుకోండి.


యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి, “దయచేసి మా విన్నపం విని, ఈ మిగిలిన వారందరి కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు. ఎందుకంటే నీవిప్పుడు చూస్తున్నట్లుగా, మేము ఒకప్పుడు చాలా మందిమే అయినప్పటికీ, ఇప్పుడు కొద్ది మందిమి మాత్రమే మిగిలి ఉన్నాము.


“కాబట్టి ఈ ప్రజల కోసం ప్రార్థించవద్దు, వేడుకోవద్దు, ఏ మనవి చేయవద్దు; నా దగ్గర ప్రాధేయపడవద్దు, ఎందుకంటే నేను నీ మాట వినను.


ఆ దేశంలో నోవహు దానియేలు యోబు ఈ ముగ్గురు ఉన్నప్పటికీ వారు తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.


“నేను దేశాన్ని నాశనం చేయకుండా దాని గోడలను బాగుచేయడానికి పగుళ్లలో నా ఎదుట నిలబడడానికి నేను తగిన వాన్ని వెదికాను కాని అలాంటివాడు ఒక్కడు కూడా నాకు కనపడలేదు.


“కానీ ఇప్పుడేమో మాపై దయచూపమని దేవుని వేడుకొంటున్నారు. మీ చేతులతో అలాంటి అర్పణలను ఇస్తే ఆయన స్వీకరిస్తాడా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.


ప్రజలందరు సమూయేలుతో, “మేము రాజు కావాలని అడిగి మా పాపాలన్నిటి కంటే ఎక్కువ చెడు చేశాం కాబట్టి మేము చనిపోకుండా నీ సేవకులమైన మాకోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి” అన్నారు.


నాకైతే, నేను మీ కోసం ప్రార్ధన చేయడంలో విఫలమవ్వడం వలన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినవాడనవుతాను. అది నాకు దూరమవ్వాలి. మంచిదైన సరియైన మార్గాన్ని నేను మీకు బోధిస్తాను.


వారు సమూయేలుతో, “మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించేలా మాకోసం ఆయనకు ప్రార్థన చేయడం మానవద్దు” అని మనవి చేశారు.


Lean sinn:

Sanasan


Sanasan