Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 26:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 నేను ఈ మందిరానికి షిలోహుకు చేసినట్లు చేస్తాను, ఈ పట్టణాన్ని భూమ్మీద ఉన్న అన్ని దేశాల్లో ఒక శాపంగా చేస్తాను.’ ”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసెదను, ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 నేను షిలోహుకు చేసినట్టు ఈ మందిరానికి కూడా చేస్తాను. ఈ పట్టణాన్ని భూమిపై ఉన్న రాజ్యాలన్నిటికీ శాపంగా చేస్తాను.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

6 మీరు నన్ను అనుసరించక పోతే యెరూషలేములో ఉన్న నా ఆలయాన్ని షిలోహులో వున్న నా పవిత్ర గుడారం మాదిరిగా చేసివేస్తాను. ప్రపంచంలోని ప్రజలెవరైనా తమకు గిట్టని నగరాలకు కీడు జరగాలని తలిస్తే, యెరూషలేముకు జరిగినట్లు జరగాలని కోరుకుంటాను.’”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 నేను ఈ మందిరానికి షిలోహుకు చేసినట్లు చేస్తాను, ఈ పట్టణాన్ని భూమ్మీద ఉన్న అన్ని దేశాల్లో ఒక శాపంగా చేస్తాను.’ ”

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 26:6
20 Iomraidhean Croise  

వారు శపించబడి నాశనమవుతారని ఈ స్థలం గురించి ఈ ప్రజల గురించి నే చెప్పిన మాటలు విని నీ హృదయం స్పందించి నీవు యెహోవా ఎదుట తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో ఏడ్చావు కాబట్టి, నేను కూడా నీ మనవి విన్నానని యెహోవా చెప్తున్నారు.


కాబట్టి నేను నీ మందిరంలోని ప్రధానులను అవమానించాను; నేను యాకోబును నాశనానికి ఇశ్రాయేలును దూషణకు అప్పగించాను.


నేను ఏర్పరచుకున్నవారు వారి శాపవచనాల్లో మీ పేరును ఉపయోగిస్తారు; ప్రభువైన యెహోవా మిమ్మల్ని చంపుతారు. ఆయన తన సేవకులకు మరొక పేరు పెడతారు.


నేను వారిని చెదరగొట్టిన అన్ని భూరాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా, అభ్యంతరకరమైన వారిగా నిందగా, ఒక సామెతగా, ఒక శాపంగా, హేళనకు కారణంగా చేస్తాను.


అవి నేడు ఉన్నట్లుగా నాశనం చేయడానికి వాటిని నిర్జనంగా ఎగతాళిగా ఒక శాపంగా మార్చడానికి యెరూషలేముకు, యూదా పట్టణాలకు, దాని రాజులకు అధికారులకు దానిని త్రాగించాను;


నేను వారిని ఖడ్గంతో, కరువుతో, తెగుళ్ళతో వెంటాడి, వారిని ఏ దేశాల్లోకి తరుముతానో ఆ భూరాజ్యాలన్నిటికి వారిని అసహ్యమైన వారిగా, శాపంగా, భయానకంగా, హేళనగా నిందగా చేస్తాను.


వారి కారణంగా, బబులోనులో ఉన్న యూదా నుండి బందీలుగా వెళ్లిన వారందరూ, ‘సిద్కియా, అహాబులను బబులోను రాజు అగ్నిలో కాల్చివేసినట్టుగా, యెహోవా మీకు చేయును గాక’ అని శపిస్తారు.


ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘యెరూషలేములో నివసించేవారి మీద నా కోపం, ఉగ్రత ఎలా కుమ్మరించానో, మీరు ఈజిప్టుకు వెళ్లినప్పుడు కూడా నా కోపం మీమీద అలాగే కుమ్మరిస్తాను. మీరు శాపగ్రస్తులుగా, భయానకంగా, శాపంగా, నిందగా అవుతారు; మీరు ఈ స్థలాన్ని మళ్ళీ చూడలేరు.’


మీ దుష్ట కార్యాలను, మీరు చేసిన అసహ్యకరమైన పనులను యెహోవా ఇక భరించలేనప్పుడు, మీ దేశం నేడు ఉన్నట్లుగా శాపంగా, నివాసులు లేని నిర్జనమైనదిగా మారింది.


నీ దారిన వెళ్లేవారంతా నిన్ను చూసి, చప్పట్లు కొడతారు; వారు యెరూషలేము దిక్కు చూసి ఎగతాళిగా తలలాడిస్తూ ఇలా అంటారు: “పరిపూర్ణ సౌందర్య పట్టణమని, సమస్త భూనివాసులకు ఆనంద కారణమని ఈ పట్టణాన్ని గురించేనా చెప్పుకున్నారు?”


నీ శత్రువులందరూ నీకు వ్యతిరేకంగా నోరు విప్పారు. వారు ఎగతాళి చేసి పళ్లు కొరుకుతూ, “మేము ఆమెను నాశనం చేశాము. ఈ రోజు కోసమే మేము ఎదురు చూసింది; దీన్ని చూడడానికే మేము బ్రతికి ఉండింది” అని అంటారు.


ఇశ్రాయేలంతా మీకు విధేయత చూపడం విడిచిపెట్టి, మీ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, వదిలేశారు. “కాబట్టి దేవుని దాసుడైన మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న శాపాలు, ప్రమాణం చేయబడిన తీర్పులు మామీద కుమ్మరించబడ్డాయి, ఎందుకంటే మీకు విరోధంగా మేము పాపం చేశాము.


అందుకతడు నాతో ఇలా అన్నాడు, “ఇది భూమి అంతటి మీదికీ బయలుదేరి వెళ్తున్న శాపం; దానికి ఒకవైపు వ్రాసి ఉన్న ప్రకారం దొంగలు నాశనమవుతారు, రెండవ వైపు వ్రాసి ఉన్న ప్రకారం అబద్ధ ప్రమాణం చేసేవారంతా దేశ బహిష్కరణ శిక్ష పొందుతారు.


నేను వచ్చి దేశాన్ని శపించకుండ ఉండేలా అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపు, పిల్లల హృదయాలను తండ్రుల వైపు త్రిప్పుతాడు.”


ఇశ్రాయేలీయుల సమాజమంతా షిలోహులో సమావేశమై అక్కడ సమావేశ గుడారాన్ని ఏర్పాటు చేసింది. ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది,


Lean sinn:

Sanasan


Sanasan