Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 23:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అతని పరిపాలనలో యూదాకు కాపుదల ఉంటుంది ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తుంది. యెహోవా మన నీతిమంతుడైన రక్షకుడు అని పిలువబడతాడు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఆయన రోజుల్లో యూదాకు విడుదల వస్తుంది. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తుంది. ‘యెహోవా మనకు నీతి’ అని అతనికి పేరు పెడతారు.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

6 శుద్ధమైన మంచి బీజోత్పత్తి సమయమందు యూదా ప్రజలు రక్షింపబడతారు. ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తుంది. “యెహోవా మనకు న్యాయం” అని అతనికి పేరుగా ఉంటుంది.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అతని పరిపాలనలో యూదాకు కాపుదల ఉంటుంది ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తుంది. యెహోవా మన నీతిమంతుడైన రక్షకుడు అని పిలువబడతాడు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 23:6
50 Iomraidhean Croise  

సొలొమోను జీవితకాలంలో దాను నుండి బెయేర్షేబ వరకు యూదా, ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా, ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద నిర్భయంగా నివసించారు.


పదునైన మీ బాణాలు శత్రురాజుల గుండెలను చీల్చుకునిపోతాయి. మీ పాదాల క్రింద జనాలు కూలి పడతారు.


అయితే ఇశ్రాయేలీయులు ఉన్న గోషేను దేశంలో మాత్రమే వడగండ్లు పడలేదు.


ఆయన దేశాల మధ్య తీర్పు తీరుస్తారు, అనేక జనాంగాల వివాదాలను పరిష్కరిస్తారు. వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా, తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు. ఒక దేశం మరొక దేశం మీద ఖడ్గం ఎత్తదు, వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు.


చూడండి, ఒక రాజు నీతిగా రాజ్యపాలన చేస్తాడు అధికారులు న్యాయంగా పాలిస్తారు.


అప్పుడు నా ప్రజలు సమాధానకరమైన నివాసాల్లో సురక్షితమైన ఇళ్ళలో ఎలాంటి ఆటంకాలు లేని విశ్రాంతి స్థలాల్లో నివసిస్తారు.


యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు; మనల్ని రక్షించేది ఆయనే.


యెహోవా ఘనత పొందుతారు, ఆయన ఎత్తైన చోట నివసిస్తారు; ఆయన తన న్యాయంతో, నీతితో సీయోనును నింపుతారు.


అక్కడ ఏ సింహం ఉండదు, ఏ క్రూర జంతువు ఉండదు; అవి అక్కడ కనబడవు. విమోచన పొందిన వారే అక్కడ నడుస్తారు.


“యెహోవానైన నేను నీతిలో నిన్ను పిలిచాను; నేను నీ చేయి పట్టుకుంటాను. గుడ్డివారి కళ్లు తెరవడానికి, చెరసాలలోని ఖైదీలను విడిపించడానికి, చీకటి గుహల్లో నివసించేవారిని బయటకు తీసుకురావడానికి, నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా, యూదేతరులకు వెలుగుగా చేస్తాను.


అయితే యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందుతుంది; మీరు మరలా ఎప్పటికీ సిగ్గుపరచబడరు, అవమానం పొందరు.


నీకు వ్యతిరేకంగా తయారుచేయబడిన ఏ ఆయుధం విజయం సాధించదు, నిన్ను దూషించే ప్రతి నాలుకను నీవు ఖండిస్తావు. యెహోవా సేవకులు పొందే స్వాస్థ్యం ఇదే, నా వలన వారికి కలిగే నిరూపణ ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


కాబట్టి, ప్రభువే స్వయంగా మీకు ఒక సూచన ఇస్తారు: ఇదిగో ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు.


ఎందుకంటే మన కోసం ఒక శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన అద్భుతమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి, సమాధానాధిపతి అని పిలువబడతాడు.


ఎందుకంటే మీ కోసం నేను ఏర్పరచుకున్న ప్రణాళికలు నాకు తెలుసు” అని యెహోవా అంటున్నారు. “అవి మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి, రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలిగించే సమాధానకరమైన ఉద్దేశాలే గాని మీకు హాని కలిగించడానికి కాదు.


“ ‘కాబట్టి నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలు, కలవరపడకు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘సుదూర ప్రాంతం నుండి నేను నిన్ను తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతిని వారు బందీలుగా ఉన్న దేశం నుండి తప్పకుండా రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ సమాధానం నెమ్మది కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు.


ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను వారిని చెర నుండి తిరిగి రప్పించినప్పుడు, యూదా దేశంలోనూ దాని పట్టణాల్లోనూ ఉన్న ప్రజలు ఇలా చెప్తారు: ‘నీతి కలిగిన నగరమా, పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక.’


నా ఉగ్రతతో, గొప్ప కోపంతో నేను వారిని వెళ్లగొట్టే అన్ని దేశాల నుండి తప్పకుండా వారిని సమకూర్చి తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి క్షేమంగా జీవించేలా చేస్తాను.


“ ‘ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదు వంశం నుండి నీతి కొమ్మను మొలకెత్తిస్తాను. అతడు దేశంలో నీతి న్యాయాలు జరిగిస్తాడు.


ఆ రోజుల్లో యూదాకు కాపుదల ఉంటుంది యెరూషలేము క్షేమంగా జీవిస్తుంది. యెహోవాయే మన నీతిమంతుడైన రక్షకుడు అనే పేరుతో యెరూషలేము పిలువబడుతుంది.’


శిథిలం! ఒక శిథిలం! నేను దానిని శిథిలం చేస్తాను! కిరీటం న్యాయంగా ఎవరికి చెందినదో ఆయన వచ్చేవరకు అది ఉండదు; దానిని నేను ఆయనకు ఇస్తాను.’


అందులో వారు నిశ్చింతగా నివసించి ఇల్లు కట్టుకుని ద్రాక్షతోటలు నాటతారు. వారిని హింసించిన వారి పొరుగువారందరిని నేను శిక్షించిన తర్వాత వారు నిర్భయంగా నివసిస్తారు. అప్పుడు నేనే తమ దేవుడనైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”


“మనుష్యకుమారుడా, గోగుకు వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించే రోజున నీవు ఇది గమనించలేదా?


“దాని చుట్టూ విస్తీర్ణం 18,000 మూరలు. “అప్పటినుండి ఆ పట్టణానికి, ‘యెహోవా షమ్మా అని పేరు.’ ”


“దోషం ముగించడానికి, పాపం తుదముట్టించడానికి, దుష్టత్వానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, శాశ్వత నీతిని చేకూర్చడానికి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి, నీ ప్రజలకు, నీ పరిశుద్ధ పట్టణానికి డెబ్బై ‘ఏడులు’ నిర్ణయించబడ్డాయి.


“ప్రభువా! మీరు నీతిమంతులు, కాని ఈ రోజు మేమైతే అనగా మీ పట్ల మేము చూపిన నమ్మకద్రోహాన్ని బట్టి ఆయా దేశాలకు చెదరగొట్టబడిన యూదా ప్రజలం, యెరూషలేము నివాసులం, ఇశ్రాయేలీయులం, దగ్గరగా దూరంగా ఉన్నవారమందరం అవమానంతో నిండిపోయాము.


యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏకమవుతారు; వారు ఒక నాయకున్ని నియమించుకుంటారు, వారు ఈ దేశంలో ఎదుగుతారు, ఎందుకంటే యెజ్రెయేలు దినం గొప్పగా ఉండబోతుంది.


అయితే యూదా వారికి నా ప్రేమను చూపించి వారిని రక్షిస్తాను; విల్లు, ఖడ్గం, యుద్ధం, గుర్రాలు, రౌతుల వల్ల కాదు, కాని వారి దేవుడనైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను.”


ఆ రోజున నా ప్రజల కోసం అడవి జంతువులతో, ఆకాశ పక్షులతో, నేలను ప్రాకే జంతువులతో నిబంధన చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధం దేశంలో లేకుండా చేస్తాను, అప్పుడు వారు క్షేమంగా పడుకుంటారు.


అయితే సీయోను పర్వతం మీద విడుదల ఉంటుంది; అది పవిత్రంగా ఉంటుంది, యాకోబు వారు తన వారసత్వాన్ని స్వాధీనపరచుకుంటారు.


ఏశావు పర్వతాలను పరిపాలించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు, రాజ్యం యెహోవాది అవుతుంది.


ఇశ్రాయేలులో మిగిలినవారు ఏ తప్పు చేయరు; వారు అబద్ధాలు చెప్పరు. మోసపూరిత నాలుక వారి నోళ్లలో ఉండదు. వారు తిని పడుకుంటారు వారికి ఎవరి భయం ఉండదు.”


“నేను యూదాను బలపరుస్తాను యోసేపు గోత్రాలను రక్షిస్తాను. వారి పట్ల నాకు దయ ఉంది కాబట్టి, నేను వారిని తిరిగి రప్పిస్తాను. నేను వారిని విడిచిపెట్టిన సంగతిని వారు మరిచిపోతారు, ఎందుకంటే నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారికి జవాబిస్తాను.


“ ‘ఆ రోజున మీ ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద కూర్చోడానికి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారిని పిలుస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.”


యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా నమ్మిన వారందరికి ఈ నీతి ఇవ్వబడుతుంది. యూదులకు యూదేతరులకు మధ్య ఏ భేదం లేదు.


దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు.


మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారు.


క్రీస్తును సంపాదించుకుని, ధర్మశాస్త్రం వలన కలిగే నా నీతిని కాకుండా, క్రీస్తులోని విశ్వాసాన్నిబట్టి దేవుడు దయ చేసిన నీతిని కలిగి ఆయనలో కనబడాలని,


Lean sinn:

Sanasan


Sanasan