Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 23:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 వాటిని మేపడానికి నేను గొర్రెల కాపరులను నియమిస్తాను, అవి ఇకపై భయపడవు, బెదిరిపోవు, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 నేను వాటి మీద కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడకుండను బెదరి పోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱెలను మేపెదరు; ఇదే యెహోవా వాక్కు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 నేను వాటి మీద కాపరులను నియమిస్తాను. ఇకనుంచి అవి భయపడకుండా, బెదరి పోకుండా, వాటిలో ఒకటైనా తప్పిపోకుండా వారు నా గొర్రెలను మేపుతారు. ఇది యెహోవా వాక్కు.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

4 నా గొర్రెల మందపై నేను క్రొత్త కాపరులను (నాయకులను) నియమిస్తాను. ఆ కాపరులు నా మంద విషయమై శ్రద్ధ వహిస్తారు. నా మంద బెదరిపోయేలా గాని, జడిసి పోయేలా గాని చేయబడదు. నా మందలో ఒక్క గొర్రె కూడా తప్పిపోదు.” ఇదే యెహోవా వాక్కు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 వాటిని మేపడానికి నేను గొర్రెల కాపరులను నియమిస్తాను, అవి ఇకపై భయపడవు, బెదిరిపోవు, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 23:4
25 Iomraidhean Croise  

ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు.


“ ‘కాబట్టి నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలు, కలవరపడకు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘సుదూర ప్రాంతం నుండి నేను నిన్ను తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతిని వారు బందీలుగా ఉన్న దేశం నుండి తప్పకుండా రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ సమాధానం నెమ్మది కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు.


“జనులారా, యెహోవా మాట వినండి; సుదూర తీరప్రాంతాలలో ఇలా ప్రకటించండి: ‘ఇశ్రాయేలును చెదరగొట్టినవారే వారిని సమకూర్చి, కాపరిలా తన మందను కాపాడతాడు.’


అప్పుడు నేను యాకోబు నా సేవకుడైన దావీదుల సంతతిని తిరస్కరించి ఉండేవాన్ని, అబ్రాహాము, ఇస్సాకు యాకోబుల సంతతివారిని పరిపాలించడానికి అతని కుమారులలో ఒక్కరిని కూడా ఎన్నుకోను. ఎందుకంటే నేను చెర నుండి వారిని తిరిగి రప్పించి, వారిపై కనికరం చూపుతాను.’ ”


మీమీద నివసించే మనుష్యులను పశువులను నేను విస్తరింపజేస్తాను, వారు ఫలించి విస్తరిస్తారు. గతంలో ఉన్నట్లే మీమీద ప్రజలను స్థిరపరచి, అంతకుముందు కన్నా అధికంగా అభివృద్ధి కలిగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.


“ ‘నేను మిమ్మల్ని దయతో చూస్తాను, మిమ్మల్ని ఫలవంతం చేస్తాను, మీ సంఖ్యను పెంచుతాను, నేను మీతో నా నిబంధనను ఉంచుతాను.


ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్షచెట్టు క్రింద, తమ అంజూర చెట్టు క్రింద కూర్చుంటారు, ఎవరూ వారిని భయపెట్టరు, ఎందుకంటే సైన్యాల యెహోవా మాట ఇచ్చారు.


“అయితే బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాల మధ్య నీవు చిన్నదానివైనప్పటికి, నా కోసం ఇశ్రాయేలు మీద పరిపాలన చేసే అధిపతి నీలో నుండి వస్తాడు, ఆయన పూర్వకాలం నుండి శాశ్వతకాలం ఉన్నవాడు.”


మీ చేతికర్రతో మీ ప్రజలను కాయండి, వారు మీ వారసత్వపు మంద, వారు అడవిలో ఒంటరిగా, సారవంతమైన పచ్చికబయళ్లలో నివసిస్తున్నారు. పూర్వకాలంలో మేసినట్లు వారిని బాషాను, గిలాదులో మేస్తారు.


ఇశ్రాయేలులో మిగిలినవారు ఏ తప్పు చేయరు; వారు అబద్ధాలు చెప్పరు. మోసపూరిత నాలుక వారి నోళ్లలో ఉండదు. వారు తిని పడుకుంటారు వారికి ఎవరి భయం ఉండదు.”


మోషేతో, “మేము సైనికుల లెక్క చూశాము. మాలో ఏ ఒక్కరు కూడా తప్పిపోలేదు.


నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఇచ్చిన పేరిట వారిని రక్షించి భద్రంగా ఉంచాను. లేఖనాలు నెరవేరేలా నాశనానికి దిగజారిన ఒక్కడు తప్ప మరి ఎవరు తప్పిపోలేదు.


“నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు” అని యేసు ముందుగా చెప్పిన మాటలు నెరవేరడానికి ఈ విధంగా జరిగింది.


చివరి రోజుల్లో ప్రకటించబడే రక్షణ మీకు కలిగేలా విశ్వాసం ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుతున్నారు, ఆ వారసత్వం పరలోకంలో మీ కోసం భద్రపరచబడి ఉంది.


Lean sinn:

Sanasan


Sanasan