యిర్మీయా 23:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 కాబట్టి సైన్యాల యెహోవా ప్రవక్తలను గురించి ఇలా అంటున్నారు: “నేను వారిని చేదు ఆహారం తినేలా చేస్తాను, విషపూరితమైన నీళ్లు త్రాగేలా చేస్తాను, ఎందుకంటే యెరూషలేము ప్రవక్తల భక్తిహీనత దేశమంతటా వ్యాపించింది.” Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈ ప్రవక్త లనుగూర్చి సెలవిచ్చునదేమనగా–యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చుచున్నాను. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 కాబట్టి సేనల ప్రభువు యెహోవా ఈ ప్రవక్తలను గురించి చెప్పేదేమిటంటే, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతా వ్యాపించింది. కాబట్టి వాళ్లకు తినడానికి చేదుకూరలూ తాగడానికి విషజలం నేను వారికిస్తాను. Faic an caibideilపవిత్ర బైబిల్15 అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ ప్రవక్తల విషయంలో ఇలా చెపుతున్నాడు. “ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను. ఆ శిక్ష విషముతిన్నట్లు, చేదు నీరు తాగినట్లు ఉంటుంది. ఆ ప్రవక్తలు ఆధ్యాత్మిక పరమైన ఒక రుగ్మతను ప్రబలింప చేశారు. ఆ రోగం దేశ వ్యాప్తంగా చెలరేగింది, కావున ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను. ఆ రోగం యెరూషలేములోని ప్రవక్తల నుండే సంక్రమించింది.” Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 కాబట్టి సైన్యాల యెహోవా ప్రవక్తలను గురించి ఇలా అంటున్నారు: “నేను వారిని చేదు ఆహారం తినేలా చేస్తాను, విషపూరితమైన నీళ్లు త్రాగేలా చేస్తాను, ఎందుకంటే యెరూషలేము ప్రవక్తల భక్తిహీనత దేశమంతటా వ్యాపించింది.” Faic an caibideil |