యిర్మీయా 23:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 యెరూషలేము ప్రవక్తల్లో భయంకరమైనది నేను చూశాను: వారు వ్యభిచారం చేస్తారు, అబద్ధాలతో జీవిస్తారు. వారు దుర్మార్గుల చేతులను బలపరుస్తారు, వారిలో ఒక్కరు కూడా తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టరు. వారందరూ నాకు సొదొమలాంటివారు; యెరూషలేము ప్రజలు గొమొర్రా వంటివారు.” Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు. Faic an caibideilపవిత్ర బైబిల్14 యూదా ప్రవక్తలు యెరూషలేములో ఘోరమైన పనులు చేయటం నేను చూశాను. ఈ ప్రవక్తలు వ్యభిచార దోషానికి పాల్పడ్డారు. వారు అబద్ధాలను వింటారు. వారు తప్పుడు బోధలను అనుసరించారు. వారు దుర్మార్గులను, చెడు కార్యాలు చేయటానికి ప్రోత్సహించారు. అందువల్ల ప్రజలు పాపం చేయటం మానలేదు. వారు సొదొమ నగరం వలె ఉన్నారు. యెరూషలేము ప్రజలు నా దృష్టిలో గొమొర్రా నగరం వలె ఉన్నారు!” Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 యెరూషలేము ప్రవక్తల్లో భయంకరమైనది నేను చూశాను: వారు వ్యభిచారం చేస్తారు, అబద్ధాలతో జీవిస్తారు. వారు దుర్మార్గుల చేతులను బలపరుస్తారు, వారిలో ఒక్కరు కూడా తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టరు. వారందరూ నాకు సొదొమలాంటివారు; యెరూషలేము ప్రజలు గొమొర్రా వంటివారు.” Faic an caibideil |