Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 22:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 దానికి జవాబు: ‘ఎందుకంటే వారు తమ దేవుడైన యెహోవా నిబంధనను విడిచిపెట్టి, ఇతర దేవతలను ఆరాధించి సేవించారు.’ ”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 అచ్చటి వారు–వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 “ఎందుకంటే వాళ్ళు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి ఇతర దేవుళ్ళను పూజించి వాటికి మొక్కారు” అని జవాబు చెప్పుకుంటారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

9 దానికి సమాధానమిది: ‘యూదా రాజ్య ప్రజలు వారి యెహోవా దేవుని నిబంధనను అనుసరించటం, మాని వేయటం మూలంగా దేవుడు యెరూషలేమును నాశనం చేశాడు. ఆ ప్రజలు అన్య దేవుళ్ళను కొలిచి ఆరాధించారు.’”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 దానికి జవాబు: ‘ఎందుకంటే వారు తమ దేవుడైన యెహోవా నిబంధనను విడిచిపెట్టి, ఇతర దేవతలను ఆరాధించి సేవించారు.’ ”

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 22:9
16 Iomraidhean Croise  

ఈ మందిరం శిథిలాల కుప్పగా మారుతుంది. దాటి వెళ్లేవారంతా ఆశ్చర్యపడి, అపహాస్యం చేస్తూ, ‘యెహోవా ఈ దేశానికి, ఈ ఆలయానికి ఇలా ఎందుకు చేశారో?’ అని అడుగుతారు.


ఎందుకంటే, ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేశారు. వారు చేతులతో చేసిన విగ్రహాలన్నిటి బట్టి నాకు కోపం రేపారు, నా కోపం ఈ స్థలంపై రగులుకుంటుంది, అది చల్లారదు.’


ఎందుకంటే ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళకు ధూపం వేశారు, వారు చేతులతో చేసిన వాటన్నిటి బట్టి నాకు కోపం రేపారు. నా కోపం ఈ స్థలంపై కుమ్మరించబడుతుంది, అది చల్లారదు.’


నా మాటలు వినడానికి నిరాకరించిన తమ పూర్వికుల పాపాలకు వారు తిరిగి వచ్చారు. వారికి సేవ చేసేందుకు ఇతర దేవుళ్ళను అనుసరించారు. ఇశ్రాయేలు యూదా వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను ఉల్లంఘించారు.


ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఈ నిబంధన నియమాలను పాటించనివాడు శాపగ్రస్తుడు.


అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘మీ పూర్వికులు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని సేవిస్తూ, ఆరాధించారు. వారు నన్ను విడిచిపెట్టారు నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదని యెహోవా ప్రకటిస్తున్నారు.


వారిని చూసినవారు వారిని మ్రింగివేశారు; వారి శత్రువులు, ‘మేము దోషులం కాదు, ఎందుకంటే వారు తమ నీతి సింహాసనమైన యెహోవాకు, తమ పూర్వికుల నిరీక్షణయైన యెహోవాకు విరోధంగా పాపం చేశారు’ అని అన్నారు.


యెహోవా ఇలా అన్నాడు, “నేను వారి ముందుంచిన నా ధర్మశాస్త్రాన్ని వారు విడిచిపెట్టారు; వారు నాకు విధేయత చూపలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు.


వారు వెళ్లే దేశాల్లోని ప్రజలకు వారు చేసే అసహ్యమైన ఆచారాల గురించి వివరించడానికి వారిలో కొంతమందిని ఖడ్గం నుండి కరువు తెగులు నుండి కాపాడి తప్పిస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు.”


వారి ప్రవర్తన వారి పనులు చూసినప్పుడు నేను కారణం లేకుండా ఏదీ చేయలేదని మీరు తెలుసుకుని ఓదార్పు పొందుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”


ఇశ్రాయేలీయులు పాపం చేసిన కారణంగా బందీలుగా వెళ్లవలసి వచ్చిందని, నా పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు నేను వారికి నా ముఖం దాచి వేసి వారంతా కత్తివేటుకు కూలిపోయేలా వారి శత్రువులకు అప్పగించానని ఇతర ప్రజలు తెలుసుకుంటారు.


నేను కోపంలో, ఉగ్రతలో, కఠోరమైన మందలింపుతో నిన్ను శిక్షించినప్పుడు, నీ చుట్టూ ఉన్న జాతులకు నీవు ఒక నిందగా హేళనగా ఒక హెచ్చరికగా ఒక భయానకమైనదానిగా ఉంటావు. యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.


దేశాలన్నీ, “ఈ దేశానికి యెహోవా ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఈ భయంకరమైన, మండుతున్న కోపం?” అని అడుగుతాయి.


Lean sinn:

Sanasan


Sanasan