Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 22:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 ‘నేను విశాలమైన పై గదులున్న గొప్ప రాజభవనాన్ని నిర్మించుకుంటాను’ అని అతడు అనుకుంటాడు. కాబట్టి దానికి పెద్ద కిటికీలు చేయించుకుని, దేవదారుతో పలకలు అతికి వాటికి ఎరుపురంగు పూసి అలంకరిస్తాడు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో రంగువేయుచు నున్నాడే;

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 “నేను విశాలమైన మేడ గదులున్న పెద్ద ఇంటిని కట్టించుకుంటాను, అనుకునే వాళ్లకు బాధ. అతడు పెద్ద పెద్ద కిటికీలు చేయించుకుని దేవదారు పలకలతో పొదిగి, ఎర్ర రంగుతో అలంకరిస్తాడు.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

14 “నా కొరకు నేనొక గొప్ప భవంతిని నిర్మిస్తాను. ‘పై అంతస్తులో ఎన్నో గదులు నిర్మిస్తాను,’ అని యెహోయాకీము అంటాడు. అలా అని అతడు తన భవంతిని పెద్ద పెద్ద కిటికీలతో నిర్మిస్తాడు. వాటి చట్రాలకు, తలుపులకు దేవదారు కలపను ఉపయోగించాడు. వాటికి అందంగా ఎరువు రంగు వేశాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 ‘నేను విశాలమైన పై గదులున్న గొప్ప రాజభవనాన్ని నిర్మించుకుంటాను’ అని అతడు అనుకుంటాడు. కాబట్టి దానికి పెద్ద కిటికీలు చేయించుకుని, దేవదారుతో పలకలు అతికి వాటికి ఎరుపురంగు పూసి అలంకరిస్తాడు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 22:14
13 Iomraidhean Croise  

రాజు నాతాను ప్రవక్తతో, “ఇదిగో దేవుని మందసం గుడారంలో ఉంటుండగా నేను దేవదారు చెక్కలతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను” అన్నాడు.


అతడు ప్రధాన గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారం పొదిగించి, పైభాగాన ఖర్జూరపు చెట్లు, గొలుసుల్లాంటివి చెక్కించాడు.


తగాదాను ప్రేమించేవాడు పాపాన్ని ప్రేమిస్తాడు, తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనం వెదుకువాడు.


ముందుగా నీ బయటి పని చక్క పెట్టుకో నీ పొలాలను సిద్ధపరచుకో; దాని తర్వాత, నీ ఇల్లు కట్టుకో.


మన గృహం దేవదారు దూలాలు! మన వాసాలు సరళవృక్షాల మ్రానులు.


గర్వం, అహంకారంతో నిండిన హృదయం కలిగిన ప్రజలందరు అనగా ఎఫ్రాయిం, సమరయ వాసులు దానిని తెలుసుకుంటారు.


“అయితే అది వ్యభిచారాన్ని మరింత ఎక్కువగా చేసింది. అది గోడపై ఎరుపు రంగులో చిత్రీకరించబడిన కల్దీయుల పురుషుల చిత్రాలను చూసింది.


“నా రాజ నివాసంగా నేను కట్టుకున్న ఈ మహా బబులోను పట్టణం నా బలప్రభావంతో నా వైభవాన్ని కనుపరచడానికి కట్టుకుంది కాదా?” అని తనలో తాను అనుకున్నాడు.


ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసి, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “నేను యాకోబు గర్వాన్ని అసహ్యించుకుంటున్నాను అతని కోటలను ద్వేషిస్తున్నాను; నేను పట్టణాన్ని దానిలో ఉన్న అంతటితో శత్రువు వశం చేస్తాను.”


“ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు చెక్క పలకలతో కప్పిన మీ ఇళ్ళలో నివసించడానికి ఇది సమయమా?”


ఎదోము వారు, “మేము నలుగగొట్టబడ్డాము, అయినాసరే మేము ఆ శిథిలాలనే తిరిగి కట్టుకుంటాము” అని అంటారేమో! కాని సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: “వారు మళ్ళీ కట్టుకున్నా, నేను కూల్చివేస్తాను. వారిది దుర్మార్గుల దేశమని, ఎప్పటికీ యెహోవా ఉగ్రతకు గురయ్యే ప్రజలని పిలువబడతారు.


Lean sinn:

Sanasan


Sanasan