Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 2:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 అయితే మీరు మీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడున్నారు? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడగలిగితే రానివ్వండి! యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో, అంతమంది దేవుళ్ళు ఉన్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడ నున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో; యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నియే గదా.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 నీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు? నీ ఆపదలో వాళ్ళు వచ్చి నిన్ను రక్షిస్తారేమో. యూదా, నీ పట్టణాలెన్ని ఉన్నాయో నీ దేవతా విగ్రహాలు కూడా అన్ని ఉన్నాయి కదా.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

28 ఆ విగ్రహాలనే వచ్చి మిమ్మును ఆదుకోనివ్వండి! మీకైమీరు చేసిన ఆ విగ్రహాలు ఎక్కడ వున్నాయి? మీకష్టకాలంలో ఆ విగ్రహాలు వచ్చి మిమ్మును ఆదుకుంటాయేమో చూద్దాము. యూదా ప్రజలారా, మీనగరాలెన్ని వున్నాయో మీ విగ్రహాలు కూడా అన్ని వున్నాయి!

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 అయితే మీరు మీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడున్నారు? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడగలిగితే రానివ్వండి! యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో, అంతమంది దేవుళ్ళు ఉన్నారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 2:28
16 Iomraidhean Croise  

ఎలీషా ఇశ్రాయేలు రాజుతో, “నా దగ్గరకు ఎందుకు వచ్చావు? నీ తండ్రి ప్రవక్తల దగ్గరకు, నీ తల్లి ప్రవక్తల దగ్గరకు వెళ్లు” అన్నాడు. ఇశ్రాయేలు రాజు జవాబిస్తూ, “లేదు, యెహోవా మా ముగ్గురు రాజులను మోయాబుకు అప్పగించడానికి పిలిచారు” అన్నాడు.


“అంతా కలిసి రండి; దేశాల నుండి తప్పించుకు పారిపోయినవారలారా రండి. చెక్క విగ్రహాలను మోస్తూ, రక్షించలేని దేవుళ్ళకు మొరపెట్టే వారికి తెలివిలేదు.


అవన్నీ కలిసి వంగి మోకరిస్తాయి; ఆ బరువును తప్పించుకోలేక అవి కూడా బందీలుగా పట్టుబడతాయి.


వారు దానిని తమ భుజాలపై ఎత్తుకుని మోస్తారు; దాని చోటులో దానిని నిలబెడతారు, ఆ చోటు నుండి అది కదల్లేదు. ఎవరైనా దానికి మొరపెట్టినా, అది జవాబివ్వలేదు; వారి కష్టాల నుండి వారిని రక్షించలేదు.


మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు మీరు సేకరించిన మీ విగ్రహాలే మిమ్మల్ని రక్షించాలి! గాలి వాటన్నిటిని తీసుకెళ్తుంది, కేవలం ఒకని ఊపిరి వాటిని చెదరగొడుతుంది. అయితే నన్ను ఆశ్రయించినవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.”


నా ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, వారి చేతులు చేసిన విగ్రహాలను వారు పూజించి, వారు చేసిన దుర్మార్గాన్ని బట్టి నేను నా ప్రజల మీద నా తీర్పులను ప్రకటిస్తాను.


యూదా పట్టణాలు, యెరూషలేము ప్రజలు వెళ్లి తాము ధూపం వేసే దేవుళ్ళకు మొరపెట్టుకుంటారు, అయితే విపత్తు వచ్చినప్పుడు వారు ఏమాత్రం సహాయం చేయరు.


యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఆ అవమానకరమైన దేవుడైన బయలుకు ధూపం వేయడానికి మీరు ఏర్పాటుచేసిన బలిపీఠాలు యెరూషలేము వీధులంత విస్తారంగా ఉన్నాయి.’


ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందో! అలాంటిది మరొకటి ఉండదు. అది యాకోబుకు కష్టకాలం, అయితే వారు దాని నుండి రక్షించబడతారు.


‘బబులోను రాజు మీ మీదా, ఈ దేశం మీదా దాడి చేయడు’ అని మీకు ప్రవచించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు?


ఇశ్రాయేలు విస్తరించిన ద్రాక్షచెట్టు; అతడు బాగా ఫలించాడు. అతడు ఫలించినకొద్దీ, అతడు ఎక్కువ బలిపీఠాలను కట్టాడు. అతని భూమి సారవంతమైన కొద్ది, అతడు తన పవిత్ర రాళ్లను అలంకరించాడు.


“శిల్పి చెక్కిన ఒక విగ్రహం వలన ప్రయోజనమేంటి? అబద్ధాలు బోధించే ప్రతిమ వలన ప్రయోజనమేంటి? ఒకడు మాట్లాడలేని విగ్రహాలను చేసిన తాను రూపం ఇచ్చిన వాటిపైనే నమ్మకం ఉంచడం వలన ప్రయోజనమేంటి?


చెక్కను చూసి, ‘ప్రాణం తెచ్చుకో’ అని నిర్జీవమైన రాయితో, ‘మేలుకో’ అని చెప్పేవానికి శ్రమ! అది దారి చూపించగలదా? అది బంగారం వెండితో పూత వేయబడింది; దానిలో శ్వాస లేదు.”


ఆయన ఇలా అంటున్నారు: “వారి దేవుళ్ళు ఎక్కడ, వారు ఆశ్రయంగా ఏర్పరచుకున్న బండ ఎక్కడ,


వెళ్లండి, మీరు ఎంచుకున్న దేవుళ్ళకు వేడుకోండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు అవే మిమ్మల్ని కాపాడతాయేమో!” అని అన్నారు.


Lean sinn:

Sanasan


Sanasan