Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 2:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 సింహాలు గర్జించాయి; అవి అతని మీదికి గుర్రుమన్నాయి. వారు అతని దేశాన్ని పాడుచేశారు; అతని పట్టణాలు కాలిపోయి నిర్జనమయ్యాయి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను, అవి అతని దేశమును పాడుచేసెను, అతని పట్టణములు నివాసులులేక పాడాయెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 కొదమ సింహాలు అతనిపై గర్జించాయి, అతనిపై పెద్దగా అరుస్తూ అతని దేశాన్ని భయకంపితం చేశాయి. అతని పట్టణాలు ప్రజలు నివసించలేనంతగా నాశనం అయ్యాయి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

15 యువకిశోరాలు (శత్రువులు) ఇశ్రాయేలు రాజ్యంపై గర్జిస్తున్నాయి. సింహాలు కోపంతో గుర్రుమంటున్నాయి. ఇశ్రాయేలు ప్రజల దేశాన్ని సింహాలు నాశనం చేశాయి. ఇశ్రాయేలు నగరాలు తగులబెట్టబడ్డాయి. అవి నిర్మానుష్యమైనాయి. వాటిలో ప్రజలెవ్వరూ లేరు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 సింహాలు గర్జించాయి; అవి అతని మీదికి గుర్రుమన్నాయి. వారు అతని దేశాన్ని పాడుచేశారు; అతని పట్టణాలు కాలిపోయి నిర్జనమయ్యాయి.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 2:15
35 Iomraidhean Croise  

సింహాలు గర్జిస్తాయేమో కొదమసింహాలు కేకలు వేస్తాయేమో, అయినా అలాంటి బలమైన సింహాల కోరలు విరిగిపోతాయి.


నేను సింహాల మధ్య ఉన్నాను; నేను క్రూరమైన జంతువుల మధ్య నివసిస్తున్నాను వారు ఈటెలు బాణాల వంటి పళ్ళు కలిగిన మనుష్యులు, వారి నాలుకలు పదునైన కత్తుల వంటివి.


మీ దేశం నాశనమైపోయింది. మీ పట్టణాలు అగ్నిచేత కాలిపోయాయి; మీ కళ్లెదుటే మీ పొలాలు విదేశీయులచేత దోచుకోబడ్డాయి, కంటికి కనబడినవాటిని పరాయివారిగా నాశనం చేశారు.


చూడండి, యెహోవా భూమిని పాడుచేసి నాశనం చేయబోతున్నారు; ఆయన దాని ఉపరితలాన్ని పాడుచేసి దానిలో నివసించేవారిని చెదరగొడతారు.


వారి గర్జన సింహగర్జనలా ఉంది. కొదమసింహం గర్జించినట్లు గర్జిస్తారు; వారు తమ వేటను పట్టుకుని ఎత్తుకుపోతారు కాపాడే వారెవరు ఉండరు.


నేను వినేలా సైన్యాల యెహోవా చెప్పిన మాట: “నిజంగా గొప్ప ఇల్లు ఖాళీగా అయిపోతాయి, చక్కటి భవనాలు నివాసులు లేక పాడైపోతాయి.


అందుకు నేను, “ప్రభువా! ఇలా ఎంతకాలం వరకు?” అని అడిగాను. అందుకు ఆయన ఇలా జవాబిచ్చారు: “నివాసులు లేక పట్టణాలు నాశనం అయ్యేవరకు, మనుష్యులు లేక ఇల్లు పాడై విడిచిపెట్టబడే వరకు, భూమి పూర్తిగా నాశనమై బీడుగా అయ్యేవరకు,


వినండి! నివేదిక వస్తుంది ఉత్తర దేశం నుండి ఒక గొప్ప కలకలం! అది యూదా పట్టణాలను నిర్జనంగా, నక్కల విహారంగా చేస్తుంది.


“ఇప్పుడు నీవు వారికి ఈ మాటలన్నీ ప్రవచించి వారితో ఇలా చెప్పు: “ ‘యెహోవా పైనుండి గర్జిస్తారు; ఆయన తన పవిత్ర నివాసం నుండి ఉరుముతారు; ఈ దేశానికి వ్యతిరేకంగా బలంగా గర్జిస్తారు. ద్రాక్షపండ్లను త్రొక్కేవారి మీద ఆయన గట్టిగా అరుస్తారు, భూమిపై నివసించే వారందరికి వ్యతిరేకంగా కేకలు వేస్తారు.


నేను ఉత్తరాది జనాంగాలను, నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును పిలిపిస్తాను” అని యెహోవా అంటున్నారు. నేను వారిని ఈ దేశం మీదికి, దాని నివాసుల మీదికి, చుట్టుప్రక్కల ఉన్న అన్ని దేశాల మీదికి తీసుకువస్తాను. నేను ఈ ప్రజలను పూర్తిగా నాశనం చేస్తాను. వారిని భయానకంగా, హేళనగా శాశ్వతమైన నాశనంగా చేస్తాను.


ఈ మందిరం షిలోహులా అవుతుందని, ఈ పట్టణం నిర్జనమై ఎడారిగా అవుతుందని నీవు యెహోవా నామంలో ఎందుకు ప్రవచిస్తున్నావు?” అని అంటూ ప్రజలంతా యిర్మీయా యెహోవా మందిరంలో ఉండగానే అతని చుట్టూ గుమిగూడారు.


“యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ స్థలం గురించి మీరు ఇలా అంటున్నారు, “ఇది మనుష్యులు జంతువులు లేక పాడైపోయింది” అని మీరు చెప్పే ఈ స్థలంలోనే, మనుష్యులుగానీ, జంతువులుగానీ నివసించకుండా పాడైపోయిన యూదా పట్టణాల్లో యెరూషలేము వీధుల్లో


నేను ఆదేశాన్ని జారీ చేయబోతున్నాను. వారిని ఈ పట్టణానికి తిరిగి తీసుకువస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. వారు దానికి వ్యతిరేకంగా పోరాడి, దానిని స్వాధీనం చేసుకుని దానిని కాల్చివేస్తారు. నేను యూదా పట్టణాలను ఎవరూ నివసించని విధంగా నాశనం చేస్తాను.”


ఒక సింహం తన పొద చాటు నుండి బయటకు వచ్చింది; దేశాలను నాశనం చేసేవాడు బయలుదేరాడు. మీ దేశాన్ని పాడుచేయడానికి ఆయన తన స్థలాన్ని విడిచిపెట్టాడు. నీ పట్టణాలు నివాసులు లేకుండా శిథిలావస్థలో ఉంటాయి.


మీ దుష్ట కార్యాలను, మీరు చేసిన అసహ్యకరమైన పనులను యెహోవా ఇక భరించలేనప్పుడు, మీ దేశం నేడు ఉన్నట్లుగా శాపంగా, నివాసులు లేని నిర్జనమైనదిగా మారింది.


కాబట్టి అడవి నుండి సింహం వారిపై దాడి చేస్తుంది, ఎడారి నుండి ఒక తోడేలు వారిని నాశనం చేస్తుంది, ఒక చిరుతపులి వారి పట్టణాల దగ్గర పొంచి ఉంది బయటకు వెళ్లేవారిని ముక్కలు చేయడానికి, ఎందుకంటే వారి తిరుగుబాటు గొప్పది వారి విశ్వాసభ్రష్టత్వం చాలా ఎక్కువ.


“ఇశ్రాయేలు చెదరిపోయిన గొర్రెలు సింహాలు వాటిని తరిమికొట్టాయి. మొదట అష్షూరు రాజు వాటిని మ్రింగివేశాడు; చివరిగా బబులోను రాజైన నెబుకద్నెజరు వాటి ఎముకలను విరగ్గొట్టాడు.”


దాని ప్రజలంతా కొదమ సింహాల్లా గర్జిస్తారు, సింహం పిల్లల్లా కేకలు వేస్తారు.


యెరూషలేమా, ఈ హెచ్చరికను తీవ్రమైనదిగా తీసుకో, లేకపోతే నేను నిన్ను వదిలేసి నీ దేశాన్ని నిర్జనంగా చేస్తాను అందులో ఎవరూ నివసించలేరు.”


నేను పర్వతాల కోసం ఏడుస్తాను, రోదిస్తాను, అరణ్య పచ్చగడ్డి ఉన్న స్థలాల గురించి విలపిస్తాను. అవి నిర్జనమైనవి, ప్రయాణం చేయలేనివి, పశువుల అరుపులు వినబడవు. పక్షులన్నీ పారిపోయాయి జంతువులు వెళ్లిపోయాయి.


“నేను యెరూషలేమును శిథిలాల కుప్పగా, నక్కల విహారంగా చేస్తాను. నేను యూదా పట్టణాలను నాశనం చేస్తాను, అక్కడ ఎవరూ నివసించలేరు.”


కాబట్టి ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు మిగిలిన ఇతర దేశాల వారికి స్వాధీనమయ్యేలా, ప్రజల మధ్యలో మీరు ఎగతాళిచేయబడి హేళన చెందేలా, వారు అన్ని వైపుల నుండి మిమ్మల్ని ధ్వంసం చేసి అణచివేశారు.


“నీ చుట్టూ ఉన్న జాతుల మధ్యలో నిన్ను చూసే వారందరి ఎదుట నిన్ను నిర్జనంగాను నిందగాను చేస్తాను.


వారు యెహోవాను అనుసరిస్తారు; ఆయన సింహంలా గర్జిస్తారు, ఆయన గర్జించినప్పుడు, ఆయన పిల్లలు పడమటి నుండి వణకుతూ వస్తారు.


ఎందుకంటే నేను ఎఫ్రాయిముకు సింహంలా యూదాకు కొదమసింహంలా ఉంటాను. నేను వారిని ముక్కలుగా చీల్చి వెళ్లిపోతాను; వారిని మోసుకెళ్తాను, వారిని కాపాడేవారెవరూ ఉండరు.


యెహోవా చెప్పే మాట ఇదే: “గొర్రెల కాపరి సింహం నోటి నుండి విడిపించేటప్పుడు, దాని రెండు కాళ్లను గాని లేదా చెవి ముక్కను గాని విడిపించినట్లుగా, సమరయలో మంచాల మీద పట్టు దిండ్లమీద కూర్చుని ఉన్న, ఇశ్రాయేలీయులు రక్షించబడతారు.”


ఆహారం దొరకక పోతే, సింహం అడవిలో గర్జిస్తుందా? దేనినీ పట్టుకోకుండానే అది దాని గుహలో గుర్రుమంటుందా?


సింహం గర్జించింది, భయపడని వారెవరు? ప్రభువైన యెహోవా చెప్పారు దానిని ప్రవచించకుండ ఉన్నవారెవరు?


సింహాల గుహ ఇప్పుడు ఎక్కడ? వాటి పిల్లల మేత స్థలం ఎక్కడ? సింహం, ఆడసింహం, సింహం కూనలు ఏ భయం లేకుండా తిరిగే చోటు ఏది?


యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేవు.” ఆయన రోషాగ్ని చేత లోకమంతా దగ్దమవుతుంది, ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నారు.


సముద్రతీరాన కాపురమున్న కెరేతీయులారా! మీకు శ్రమ. ఫిలిష్తీయ ప్రజలు కాపురమున్న కనాను దేశమా! యెహోవా వాక్కు నీకు వ్యతిరేకంగా ఉంది, “నీలో ఎవరూ మిగలకుండా నేను నిన్ను నాశనం చేస్తాను” అని ఆయన అంటున్నారు.


“నేను దేశాలను నాశనం చేశాను; వాటి కోటలు పడగొట్టబడ్డాయి. నేను వాటి వీధులను ఎడారిగా వదిలేశాను, ఎవరూ వాటి గుండా వెళ్లరు. వాటిలో ఎవరూ నివసించకుండా వారి పట్టణాలను నిర్జనంగా చేశాను.


గొర్రెల కాపరుల ఏడ్పు వినండి; వారి శ్రేష్ఠమైన పచ్చికబయళ్లు నాశనమైపోయాయి! సింహాల గర్జన వినండి; యొర్దాను లోయలోని దట్టమైన అడవులు పాడైపోయాయి!


సంసోను తన తల్లిదండ్రులతో కలిసి తిమ్నాతుకు వెళ్లాడు. వారు తిమ్నాతు ద్రాక్షతోటలను సమీపించినప్పుడు, అకస్మాత్తుగా ఒక కొదమసింహం గర్జిస్తూ అతనివైపు వచ్చింది.


Lean sinn:

Sanasan


Sanasan