Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 19:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 నేను ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను; దానిని భయానకంగా, ఎగతాళిగా చేస్తాను; దారిన వెళ్లేవారంతా నివ్వెరపోతారు, దాని గాయాలన్నిటిని చూసి అపహాస్యం చేస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్య పడి దానికి కలిగిన యిడుమలన్నిటిని చూచి అప హాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసెదను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఈ పట్టణాన్ని పాడు చేసి ఎగతాళికి గురి చేస్తాను. ఆ దారిలో వెళ్ళే ప్రతివాడూ దాని కడగండ్లన్నీ చూసి నిర్ఘాంతపోయి హేళన చేస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

8 ఈ నగరాన్ని నేను సర్వనాశనం చేస్తాను. యెరూషలేము మీదుగా వెళ్లే ప్రయాణీకులు విభ్రాంతితో చలించి తమ తలలు పంకిస్తారు. నగరం నాశనం చేయబడిన తీరు చూచి వారు విస్మయం చెందుతారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 నేను ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను; దానిని భయానకంగా, ఎగతాళిగా చేస్తాను; దారిన వెళ్లేవారంతా నివ్వెరపోతారు, దాని గాయాలన్నిటిని చూసి అపహాస్యం చేస్తారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 19:8
14 Iomraidhean Croise  

ఈ మందిరం శిథిలాల కుప్పగా మారుతుంది. దాటి వెళ్లేవారంతా ఆశ్చర్యపడి, అపహాస్యం చేస్తూ, ‘యెహోవా ఈ దేశానికి, ఈ ఆలయానికి ఇలా ఎందుకు చేశారో?’ అని అడుగుతారు.


వారి దేశం పాడైపోయి నిత్యం హేళన చేయబడేదిగా ఉంటుంది; దారిన వెళ్లేవారంతా నివ్వెరపోయి వారి తలలాడిస్తారు.


అవి నేడు ఉన్నట్లుగా నాశనం చేయడానికి వాటిని నిర్జనంగా ఎగతాళిగా ఒక శాపంగా మార్చడానికి యెరూషలేముకు, యూదా పట్టణాలకు, దాని రాజులకు అధికారులకు దానిని త్రాగించాను;


యెహోవా, “నా జీవం తోడు, బొస్రా నాశనంగా, శాపంగా మారుతుందని, భయానకంగా, నిందలకు గురి అవుతుందని నా మీద నేను ప్రమాణం చేస్తున్నాను. దాని పట్టణాలన్ని శాశ్వతంగా శిథిలావస్థలో ఉంటాయి” అని ప్రకటిస్తున్నారు.


యెహోవా కోపం వలన అది నివాసయోగ్యంగా ఉండదు. పూర్తిగా నిర్జనమైపోతుంది. బబులోను దాటి వెళ్లే వారందరూ నివ్వెరపోతారు; దాని గాయాలన్నిటిని బట్టి వారు ఎగతాళి చేస్తారు.


వివిధ ప్రజల మధ్యలో వర్తకులు నిన్ను ఎగతాళి చేస్తారు. నీవు భయంకరమైన ముగింపుకు వచ్చావు, పూర్తిగా నాశనం అవుతావు.’ ”


నేను భూమిని వృధా చేస్తాను, తద్వార అక్కడ నివసించే మీ శత్రువులు ఆశ్చర్యపడతారు.


మీరు ఒమ్రీ కట్టడాలను పాటించారు అహాబు ఇంటివారి విధానాలన్నీ పాటించారు; వారి సంప్రదాయాలను అనుసరించారు; కాబట్టి నేను మిమ్మల్ని నాశనం చేస్తాను ప్రజలు మిమ్మల్ని అపహాస్యం చేస్తారు; మీరు నా ప్రజల నిందను భరిస్తారు.”


ఇది క్షేమకరమైన ఆనందకరమైన పట్టణము. ఆమె తనలో తాను, “నా వంటి పట్టణం మరొకటి లేదని అనుకున్నది. ఆమె ఎంతగా పాడైపోయింది,” క్రూరమృగాలకు గుహలా మారింది! ఆ దారి గుండా వెళ్లే వారందరూ ఎగతాళి చేస్తూ చేతులు ఆడిస్తున్నారు.


యెహోవా మిమ్మల్ని నడిపించే ప్రజలందరి మధ్య మీరు భయానకమైన, ఒక సామెతగా హేళనకు కారణంగా మారతారు.


తర్వాతి తరాలలో మిమ్మల్ని అనుసరించే మీ పిల్లలు, సుదూర దేశాల నుండి వచ్చిన విదేశీయులు, దేశంపై పడిన ఆపదలను, వ్యాధులను వేటితోనైతే యెహోవా దాన్ని బాధించారో చూస్తారు.


Lean sinn:

Sanasan


Sanasan