Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 19:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 వారు తమ పిల్లలను బయలుకు దహనబలులుగా అగ్నిలో కాల్చడానికి బయలుకు క్షేత్రాలను నిర్మించారు. అలా చేయమని నేను వారికి ఆజ్ఞాపించలేదు, కనీసం ప్రస్తావించలేదు, అసలు అది నా మనస్సులోకి కూడా రాలేదు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనస్సునకు తోచ నిదియునైన ఆచారము నాచరించిరి; తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 వాళ్ళు తమ కొడుకులను దహనబలులుగా కాల్చడానికి బయలుకు బలిపీఠాలు కట్టించారు. అలా చేయమని నేను వాళ్లకు చెప్పలేదు, అది నా మనస్సుకు ఎన్నడూ తోచలేదు.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

5 బయలు దేవతకు యూదా రాజులు ఉన్నత (పూజా) స్థలాలను నిర్మించినారు. ఆ స్థలాలను వారు తమ కుమారులను అగ్నిలో కాల్చి బయలు ముందు బలి అర్పించటానికి ఉపయోగించారు. బయలు దేవతకు వారి కుమారులను దహన బలులుగా అర్పించారు. అలా చేయమని నేనెన్నడూ వారికి చెప్పియుండలేదు. మీ కుమారులను బలియివ్వమని నేనెన్నడూ మిమ్మల్ని అడగలేదు. అటువంటి అకృత్యాన్ని నేను మనసులో కూడా ఎన్నడూ తలపోయలేదు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 వారు తమ పిల్లలను బయలుకు దహనబలులుగా అగ్నిలో కాల్చడానికి బయలుకు క్షేత్రాలను నిర్మించారు. అలా చేయమని నేను వారికి ఆజ్ఞాపించలేదు, కనీసం ప్రస్తావించలేదు, అసలు అది నా మనస్సులోకి కూడా రాలేదు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 19:5
14 Iomraidhean Croise  

తమ కుమారులను, కుమార్తెలను అగ్నిలో బలి ఇచ్చారు. భవిష్యవాణి, సోదె చెప్పించడం చేసి, యెహోవా దృష్టిలో చెడు చేయడానికి తమను తాము అమ్ముకుని ఆయనకు కోపం రేపారు.


అతడు తన సొంత కుమారుడిని అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం రేపాడు.


అతడు బెన్ హిన్నోము లోయలో బలులను కాల్చివేసి, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా ఏ జనాలనైతే వెళ్లగొట్టారో, ఆ జనాలు చేసిన హేయక్రియలు చేసి, తన కుమారులను అగ్నిలో బలి ఇచ్చాడు.


వారు తమ కుమారులను, కుమార్తెలను మోలెకుకు బలి ఇవ్వడానికి బెన్ హిన్నోము లోయలో బయలుకు క్షేత్రాలు కట్టారు. అది నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదా పాపంలో పడి అలాంటి అసహ్యమైనది చేస్తారని కనీసం నా మనస్సులోకి రాలేదు.


ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: నీవు నీ ప్రేమికులతో నీ వ్యభిచారంలో నీ కామాన్ని కుమ్మరించి, నీ నగ్న శరీరాన్ని చూపించినందుకు, నీ అసహ్యకరమైన విగ్రహాల కారణంగా, నీవు వాటికోసం నీ పిల్లల రక్తాన్ని చిందించినందున,


వారు తమ మొదటి సంతానాన్ని బలి ఇచ్చి తమను తాము అపవిత్రం చేసుకోనిచ్చాను. నేనే యెహోవానని వారు తెలుసుకునేలా వారిని భయాందోళనలకు గురిచేస్తాను.’


“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ రోజు నీ మనస్సులో చెడు ఆలోచనలు పుడతాయి. నీవు చెడు పన్నాగం పన్ని,


“రాజా! మీరు పడుకున్నప్పుడు, రాబోయే సంగతుల గురించి మీరు ఆలోచిస్తుండగా, మర్మాలను తెలిపేవాడు జరగబోయే దానిని చూపించారు.


“ ‘మీ పిల్లల్లో ఎవరినీ మోలెకుకు బలి ఇవ్వవద్దు, ఎందుకంటే మీరు మీ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.


మర్నాడు ఉదయం బాలాకు బిలామును బామోత్ బయలుకు తీసుకెళ్లాడు, అక్కడినుండి ఇశ్రాయేలు శిబిరం యొక్క చివరలను చూడగలిగాడు.


వారి విధానాల్లో మీ దేవుడనైన యెహోవాను మీరు ఆరాధించకూడదు, ఎందుకంటే వారు తమ దేవుళ్ళను పూజిస్తూ యెహోవా ద్వేషించే అసహ్యమైన సమస్తాన్ని చేస్తారు. వారు తమ కుమారులను కుమార్తెలను తమ దేవుళ్ళకు బలిగా అగ్నిలో కాల్చివేస్తారు.


Lean sinn:

Sanasan


Sanasan