Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 18:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 తూర్పు గాలి చెదరగొట్టినట్లు, నేను వారి శత్రువుల ముందు వారిని చెదరగొడతాను; వారి మీదకు విపత్తు వచ్చిన రోజున నేను వారిపై దయ చూపను.”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులయెదుట నిలువకుండ వారిని నేను చెదరగొట్టెదను; వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 తూర్పుగాలి చెదరగొట్టినట్టు నేను వాళ్ళ శత్రువుల ఎదుట వాళ్ళను చెదరగొడతాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

17 యూదా ప్రజలను వారి శత్రువులముందు పనికి రానివారిగా పడవేస్తాను. బలమైన తూర్పుగాలి వస్తువులను చెల్లాచెదరు చేసేలా నేను వారిని విసరివేస్తాను. నేనా ప్రజలను నాశనం చేస్తాను. ఆ సమయంలో నేను వారికి అండగా వస్తున్నట్టు నన్ను చూడలేరు. మరియు! నేను వారిని వదిలి పెడుతున్నట్లుగా చూస్తారు!”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 తూర్పు గాలి చెదరగొట్టినట్లు, నేను వారి శత్రువుల ముందు వారిని చెదరగొడతాను; వారి మీదకు విపత్తు వచ్చిన రోజున నేను వారిపై దయ చూపను.”

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 18:17
16 Iomraidhean Croise  

తూర్పు గాలి వారిని తీసుకెళ్తే, వారిక ఉండరు; అది వారి స్థలం నుండి వారిని తుడిచివేస్తుంది.


తూర్పు గాలితో బద్దలైన తర్షీషు ఓడల్లా మీరు వారిని నాశనం చేశారు.


ఎందుకంటే నీతిమంతులు ఏడుమారులు పడినను తిరిగి లేస్తారు, కాని విపత్తు సంభవించినప్పుడు దుష్టులు తడబడతారు.


“ఎడారి గాలికి కొట్టుకుపోయే పొట్టులా నేను నిన్ను చెదరగొడతాను.


వారు చెక్కతో, ‘నీవు మా తండ్రివి’ అని, రాయితో, ‘నీవు మాకు జన్మనిచ్చావు’ అంటున్నారు వారు నావైపు వారి ముఖాలు త్రిప్పకుండ, నాకు వెన్ను చూపారు; అయినప్పటికీ వారు కష్టంలో ఉన్నప్పుడు, ‘వచ్చి మమ్మల్ని రక్షించండి!’ అని అంటారు.


వారు నావైపు తమ ముఖాలు త్రిప్పక నాకు వెన్ను చూపారు. నేను వారికి పదే పదే బోధించినప్పటికీ, వారు క్రమశిక్షణను అంగీకరించలేదు, స్పందించలేదు.


దాని శాలల్లో ఉన్న కిరాయి సైనికులు బలిసిన దూడల వంటివారు. వారు కూడా నిలబడలేక, వెనక్కి పారిపోతారు. విపత్తు రోజు వారి మీదికి రాబోతోంది, అది వారు శిక్షించబడే సమయము.


నీ తెడ్లు నడిపేవారు మహా సముద్రంలోకి నిన్ను తీసుకెళ్లారు. కాని తూర్పు గాలి వీచి సముద్రం మధ్యలో నిన్ను నాశనం చేస్తుంది.


వారిని చూడకుండ నా ముఖాన్ని త్రిప్పుకుంటాను, కాబట్టి దొంగలు నా నిధి ఉన్న స్థలాన్ని అపవిత్రపరుస్తారు. వారు దానిలోనికి వెళ్లి దానిని మలినం చేస్తారు.


నేను ఎఫ్రాయిం పట్ల దయ చూపించను. యెహోవా నుండి తూర్పు గాలి వస్తుంది, ఎడారి నుండి అది వీస్తుంది. అతని నీటిబుగ్గ ఎండిపోతుంది అతని బావి ఇంకిపోతుంది. అతని ధననిధులు, ప్రియమైన వస్తువులు దోచుకోబడతాయి.


మీ శత్రువుల చేతిలో యెహోవా మిమ్మల్ని ఓడిపోయేలా చేస్తారు.మీరు వారి దగ్గరకు ఒకవైపు నుండి వస్తారు, కాని వారి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు. మీరంటే అన్ని రాజ్యాలకు భయం కలుగుతుంది.


అప్పుడు యెహోవా భూమి యొక్క ఒక చివర నుండి మరొక చివర వరకు అన్ని దేశాల మధ్య మిమ్మల్ని చెదరగొడతారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళను మీకు గాని మీ పూర్వికులకు గాని తెలియని చెక్కతో రాతితో చేయబడిన దేవుళ్ళను సేవిస్తారు.


ఆ రోజున నేను వారిపై కోప్పడి వారి చేయి విడిచిపెడతాను; నేను వారి నుండి నా ముఖాన్ని దాచుకుంటాను, వారు నాశనమవుతారు. అనేక విపత్తులు, ఆపదలు వారి పైకి వస్తాయి, ఆ రోజు వారు, ‘ఈ విపత్తులు మనపైకి రావడానికి కారణం మన దేవుడు మనతో లేకపోవడం కాదా?’ అని అనుకుంటారు.


పగ తీర్చుకోవడం నా పని; నేను తిరిగి చెల్లిస్తాను. సరియైన సమయంలో వారి పాదం జారుతుంది; వారి ఆపద్దినం దగ్గరపడింది వారి విధి వేగంగా వారి మీదికి వస్తుంది.”


Lean sinn:

Sanasan


Sanasan