యిర్మీయా 18:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 వారి దేశం పాడైపోయి నిత్యం హేళన చేయబడేదిగా ఉంటుంది; దారిన వెళ్లేవారంతా నివ్వెరపోయి వారి తలలాడిస్తారు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగానుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 వాళ్ళ దేశం పాడైపోతుంది. అది ఎప్పటికీ ఎగతాళికి గురి అవుతుంది. ఆ దారిన వెళ్లేవాళ్ళంతా వణికిపోతూ తమ తలలూపుతారు. Faic an caibideilపవిత్ర బైబిల్16 యూదా రాజ్యం వట్టి ఎడారిగా మారిపోతుంది! ఆ దారిన పోయే వారందరు దాని గతిచూచి ఆశ్చర్యంతో తలలు ఆడిస్తారు. ఆ దేశం ఎలా నాశనమైపోయిందా అని వారు తికమక పడతారు! Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 వారి దేశం పాడైపోయి నిత్యం హేళన చేయబడేదిగా ఉంటుంది; దారిన వెళ్లేవారంతా నివ్వెరపోయి వారి తలలాడిస్తారు. Faic an caibideil |
ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకున్న యూదా వారిలో మిగిలి ఉన్నవారిని నేనే అక్కడికి తీసుకువెళ్తాను. వారంతా ఈజిప్టులో నశిస్తారు; వారు ఖడ్గం వల్ల చనిపోతారు లేదా కరువుతో చనిపోతారు. సామాన్యుల నుండి గొప్పవారి వరకు, వారు ఖడ్గం చేత గాని కరువుచేత గాని చనిపోతారు. వారు శాపంగాను, భయం పుట్టించే వారుగాను; ఒక శాపంగాను నిందకు కారణమైనవారిగాను అవుతారు.