Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 18:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నారు: “కన్యయైన ఇశ్రాయేలు అత్యంత ఘోరమైన పని చేసింది. ఇలాంటిది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? అన్ని దేశాలను అడిగి తెలుసుకోండి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–అన్యజనులను అడిగి తెలిసికొనుడి; ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైన వినెనా? ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసియున్నది.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు, రాజ్యాలను అడిగి తెలుసుకోండి. ఇలాంటిది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? ఇశ్రాయేలు కన్య చాలా ఘోరమైన పని చేసింది.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

13 యెహోవా చెప్పే విషయాలు వినండి: “అన్య దేశాల ప్రజలను ఈ ప్రశ్న అడగండి: ‘ఇశ్రాయేలు చేసినటువంటి దుష్కార్యాలు మరెవరైనా చేస్తున్నట్లు మీరెప్పుడైనా విన్నారా?’ పైగా ఇశ్రాయేలు దేవుని వధువులా ఉంది!

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నారు: “కన్యయైన ఇశ్రాయేలు అత్యంత ఘోరమైన పని చేసింది. ఇలాంటిది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? అన్ని దేశాలను అడిగి తెలుసుకోండి.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 18:13
14 Iomraidhean Croise  

అప్పుడు హిల్కీయా, రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, కార్యదర్శియైన షెబ్నా, ఆసాపు కుమారుడు, రాజ్య లేఖికుడైన యోవాహు, తమ బట్టలు చింపుకొని హిజ్కియా దగ్గరకు వెళ్లి అష్షూరు సైన్యాధిపతి చెప్పింది అతనికి తెలియజేశారు.


అలాంటి సంగతులు ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? అలాంటి సంగతులు ఎవరైనా ఎప్పుడైనా చూశారా? ఒక్క రోజులో దేశం పుడుతుందా ఒక్క నిమిషంలోనే ఒక జనం జన్మిస్తుందా? అయితే సీయోనుకు ప్రసవవేదన కలగగానే ఆమె తన బిడ్డలకు జన్మనిస్తుంది.


“వారితో ఈ మాట చెప్పు: “ ‘నా కళ్లలో కన్నీరు రాత్రింబగళ్ళు ఆగకుండా పొంగిపారును గాక; ఎందుకంటే, కన్యయైన నా ప్రజల కుమార్తెకు, తీవ్రమైన గాయం తగిలింది, అది ఆమెను నలిపివేస్తుంది.


లెబానోను మంచు దాని రాతి బండల నుండి ఎప్పుడైనా మాయమవుతుందా? సుదూర ప్రాంతాల నుండి వచ్చే దాని చల్లని జలాలు ప్రవహించడం ఆగిపోతాయా?


యెరూషలేము ప్రవక్తల్లో భయంకరమైనది నేను చూశాను: వారు వ్యభిచారం చేస్తారు, అబద్ధాలతో జీవిస్తారు. వారు దుర్మార్గుల చేతులను బలపరుస్తారు, వారిలో ఒక్కరు కూడా తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టరు. వారందరూ నాకు సొదొమలాంటివారు; యెరూషలేము ప్రజలు గొమొర్రా వంటివారు.”


నేను నిన్ను మళ్ళీ నిర్మిస్తాను, ఇశ్రాయేలు కన్యా, నీవు తిరిగి కట్టబడతావు. మళ్ళీ నీవు నీ తంబురలు తీసుకుని ఆనందించే వారితో కలిసి నాట్యం చేస్తావు.


“భయంకరమైన, దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఒకటి దేశంలో జరిగింది:


“నా మధ్య ఉన్న బలవంతులందరినీ యెహోవా తిరస్కరించారు; నా యువకులను అణచివేయడానికి ఆయన నా మీదికి సైన్యాన్ని పిలిపించారు. కన్యయైన యూదా కుమారిని ప్రభువు తన ద్రాక్షగానుగలో త్రొక్కారు.


నేను ఇశ్రాయేలులో ఘోరమైన విషయాన్ని చూశాను: అక్కడ ఎఫ్రాయిం వ్యభిచారానికి అప్పగించుకుంది, ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది.


ఇశ్రాయేలూ! ఈ మాట విను, ఇది మిమ్మల్ని గురించి విలాప వాక్కు:


“ఇశ్రాయేలు కన్య పడిపోయింది, ఆమె మరి ఎన్నడు లేవదు, ఆమెను లేపడానికి ఎవరూ లేక తన సొంత నేలపై పడి ఉంది.”


మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాము. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట కదా! ఇలాంటి వ్యభిచారం దేవుని ఎరుగనివారు కూడా సహించరు.


ఫిలిష్తీయులు భయపడి, “ఒక దేవుడు శిబిరంలోనికి వచ్చాడు; అయ్యో! ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుగలేదు.


Lean sinn:

Sanasan


Sanasan