Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 17:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 నేను మీకు కాపరిగా ఉండకుండ పారిపోలేదు; వారికి నిరాశ దినం రావాలని నేను కోరుకోలేదని మీకు తెలుసు. నా పెదవుల నుండి బయటకు వచ్చే ప్రతీ మాట మీకు తెలుసు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 నేను నిన్ను అనుసరించు కాపరినైయుండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు, నీకే తెలిసియున్నది. నా నోటినుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 నేను నిన్ను అనుసరిస్తూ కాపరిగా ఉండడం మానలేదు. విపత్తుదినం కోసం నేను ఎదురు చూడలేదు. నా నోట నుంచి వచ్చిన మాటలు నీకు తెలుసు. అవి నీ దగ్గరనుంచే వచ్చాయి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

16 యెహోవా, నేను నీనుండి దూరంగా పారిపోలేదు. నేను నిన్ను అనుసరించాను. నీవు కోరిన విధంగా నేను గొర్రెలకాపరినయ్యాను. ఆ భయంకరమైన రోజు రావాలని నేను కోరుకోలేదు. యెహోవా, నేను చెప్పిన విషయాలు నీకు తెలుసు. జరుగుతున్నదంతా నీవు చూస్తూనే ఉన్నావు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 నేను మీకు కాపరిగా ఉండకుండ పారిపోలేదు; వారికి నిరాశ దినం రావాలని నేను కోరుకోలేదని మీకు తెలుసు. నా పెదవుల నుండి బయటకు వచ్చే ప్రతీ మాట మీకు తెలుసు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 17:16
21 Iomraidhean Croise  

అయినా యెహోవా, నేను మీకు తెలుసు; మీరు నన్ను చూస్తున్నారు, మిమ్మల్ని గురించిన నా ఆలోచనలను మీరు పరీక్షిస్తున్నారు. వధకు గొర్రెలు లాగివేయబడునట్లు వారిని లాగివేయండి! వధ దినం కోసం వారిని వేరు చేయండి!


మీరు వినకపోతే మీ గర్వాన్ని బట్టి నేను రహస్యంగా ఏడుస్తాను; యెహోవా మంద చెరగా కొనిపోబడుతుంది కాబట్టి నా కళ్లు ఎంతగానో ఏడుస్తాయి, కన్నీరు కారుస్తాయి.


యెహోవా, మీరు అర్థం చేసుకోండి; నన్ను జ్ఞాపకముంచుకొని నా పట్ల శ్రద్ధ చూపండి. నన్ను హింసించేవారి మీద నా కోసం ప్రతీకారం తీర్చుకోండి. మీ ఓర్పును బట్టి నన్ను తీసుకెళ్లనివ్వకండి; మీ కోసం నేనెలా నిందలు అనుభవిస్తున్నానో ఆలోచించండి.


మేలుకు ప్రతిగా కీడు చేయాలా? అయినా వారు నా కోసం గొయ్యి త్రవ్వారు. నేను నీ ఎదుట నిలబడి వారి మీది నుండి మీ కోపం తొలగించమని వారి పక్షాన నేను మిమ్మల్ని వేడుకున్నానని జ్ఞాపకం తెచ్చుకోండి.


యెహోవా! మీరే నన్ను మోసగించావు, నేను లోబడ్డాను, మీరు నాకంటే బలవంతులు, మీరే గెలిచారు, రోజంతా అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు.


“దేవుని పేరు నేనెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటించను” అని అనుకుంటే, అప్పుడది నా హృదయంలో అగ్నిలా మండుతుంది. నా ఎముకల్లో మూయబడిన అగ్ని! ఎంత కాలమని ఓర్చుకోను? విసుగొస్తుంది, చెప్పకుండా ఉండలేను.


అయ్యో, నా తల నీటి బావి నా కళ్లు కన్నీటి ఊట అయి ఉంటే బాగుండేది! చంపబడిన నా ప్రజల కోసం నేను పగలు రాత్రి ఏడ్చే వాన్ని.


న్యాయస్థానంలో న్యాయం కోసం నిలబడే వారిని యథార్థంగా మాట్లాడేవారిని ద్వేషించేవారు మీలో ఉన్నారు.


మీకు ఉపయోగకరమైన దానిని సంకోచించకుండా బహిరంగంగా ఇంటింటికి తిరిగి బోధించానని మీకు తెలుసు.


ఎందుకంటే, దేవుని ఉద్దేశమంతటిని మీకు ప్రకటించడానికి నేను సంకోచించలేదు.


ఇప్పుడు ఇది మాకు గర్వకారణం: ముఖ్యంగా మీతో మాకు గల సంబంధం విషయంలో నిజాయితితో, దేవుడు ఇచ్చే పవిత్రతతో మేము నడచుకున్నాము. లోకజ్ఞానంపై ఆధారపడక దేవుని కృపపై ఆధారపడి నడుచుకున్నామని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది.


మేము దేవుని వాక్యాన్ని స్వలాభం కోసం అమ్మేవారం కాదు, మేము దేవుని వాక్యాన్ని నిజాయితీగా క్రీస్తు అధికారంతో ఆయన ఎదుట బోధిస్తున్నాము. దేవుడు మమ్మల్ని చూస్తున్నారని మాకు తెలుసు.


నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు దీనిని గ్రహించాలి: ప్రతి ఒక్కరు వినడానికి తొందరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, అలాగే తొందరపడి కోపపడవద్దు;


నా సహోదరీ సహోదరులారా, బోధకులమైన మనం అత్యంత కఠినంగా తీర్పు తీర్చబడతామని మీకు తెలుసు కాబట్టి మీలో అనేకమంది బోధకులుగా మారకండి.


Lean sinn:

Sanasan


Sanasan