యిర్మీయా 15:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 వారు నిన్ను, ‘మేము ఎక్కడికి వెళ్లాలి?’ అని అడిగితే, వారితో చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: “ ‘మరణానికి నిర్ణయించబడినవారు, మరణానికి; ఖడ్గానికి నిర్ణయించబడినవారు, ఖడ్గానికి; ఆకలికి నిర్ణయించబడినవారు, ఆకలికి; చెరకు నిర్ణయించబడినవారు, చెరకు వెళ్లాలి.’ Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగినయెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–చావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింప బడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడినవారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెరకును పోవలెను. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 “మేమెక్కడికి వెళ్ళాలి?” అని వాళ్ళు నిన్నడితే నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, చావు కోసం ఏర్పాటైన వాళ్ళు చావుకూ, కత్తి కోసం ఏర్పాటైన వాళ్ళు కత్తికీ, కరువు కోసం ఏర్పాటైన వాళ్ళు కరువుకూ, చెరకు ఏర్పాటైన వాళ్ళు చెరకూ వెళ్ళాలి. Faic an caibideilపవిత్ర బైబిల్2 ‘మేమెక్కడికి వెళతాము, అని వారడుగవచ్చు. అప్పుడు వారితో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పు: “‘నేను వారిలో కొంతమంది అసహజంగా చనిపోవటానికి ఉద్దేశించాను. వారు మృత్యువు వాతబడతారు. కొంతమందిని కత్తికి బలిచేయటానికి ఉద్దేశించాను. వారు కత్తులతో యుద్దానికి పోయి చనిపోతారు. కొందరిని ఆకలి చావులకు ఉద్దేశించాను. వారు కరువుకు గురవుతారు. మరి కొందరిని అన్యదేశాలలో బందీలు కావటానికి ఉద్దేశించాను. వారు బందీలై పరదేశానికి తీసుకుపోబడతారు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 వారు నిన్ను, ‘మేము ఎక్కడికి వెళ్లాలి?’ అని అడిగితే, వారితో చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: “ ‘మరణానికి నిర్ణయించబడినవారు, మరణానికి; ఖడ్గానికి నిర్ణయించబడినవారు, ఖడ్గానికి; ఆకలికి నిర్ణయించబడినవారు, ఆకలికి; చెరకు నిర్ణయించబడినవారు, చెరకు వెళ్లాలి.’ Faic an caibideil |