యిర్మీయా 13:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 నీ వ్యభిచారాలు, కామపు సకిలింపులు, నీ సిగ్గులేని వ్యభిచారం! కొండలమీద, పొలాల్లో నీ హేయమైన పనులు నేను చూశాను. యెరూషలేమా, నీకు శ్రమ! నీవు ఎంతకాలం అపవిత్రంగా ఉంటావు?” Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలో నున్న మెట్టలమీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి; యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచుకొననొల్లవు; ఇక నెంత కాలము ఈలాగు జరుగును? Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 నీ వ్యభిచారం, కామంతో కూడిన నీ సకిలింపులు నీ జార కార్యాలు నాకు తెలుసు. పొలాల్లోని ఉన్నత స్థలాల్లో నీవు చేసిన అసహ్యమైన కార్యాలు నాకు కనబడుతున్నాయి. యెరూషలేమా, నీకు శ్రమ. నిన్ను నువ్వు పవిత్ర పరచుకోవడం లేదు. ఇలా ఎంత కాలం కొనసాగుతుంది? Faic an caibideilపవిత్ర బైబిల్27 నీవు చేసిన భయంకరమైన పనులను నేను చూశాను. నీవు విజృంభించి ప్రియులతో వ్యభిచరించటం చూశాను. వేశ్యలా ప్రవర్తించాలనే నీ పథకం నాకు తెలుసు. నీవు కొండలమీద, మైదానాల మీద పాపాలు చేయుట నేను చూశాను. యెరూషలేమా, ఇది నీకు చాలా చెడ్డదిగా ఉంటుంది. అసహ్యమైన ఈ పాపాలు నీ వెన్నాళ్లు సాగిస్తావోనని నేను ఆశ్చర్యపోతున్నాను.” Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 నీ వ్యభిచారాలు, కామపు సకిలింపులు, నీ సిగ్గులేని వ్యభిచారం! కొండలమీద, పొలాల్లో నీ హేయమైన పనులు నేను చూశాను. యెరూషలేమా, నీకు శ్రమ! నీవు ఎంతకాలం అపవిత్రంగా ఉంటావు?” Faic an caibideil |