Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 12:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 “మీరు కాలినడకన వెళ్తున్న వారితో పరుగెడితేనే వారు నిన్ను అలసిపోయేలా చేశారు, అలాంటప్పుడు గుర్రాలతో ఎలా పోటీపడతావు? భద్రతగల దేశం అని మీరనుకునే దేశంలోనే మీరు క్షేమంగా ఉండనప్పుడు, యొర్దాను ఒడ్డున ఉన్న దట్టమైన పొదల్లో ఎలా?

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 –నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా? నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావుగదా? యొర్దాను ప్రవాహముగా వచ్చునప్పుడు నీవేమి చేయుదువు?

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 యిర్మీయా, నువ్వు పాదచారులతో పరిగెత్తినప్పుడే నీవు అలసిపోయావు కదా, నువ్వు గుర్రపు రౌతులతో ఏ విధంగా పోటీ పడతావు? నెమ్మదిగా ఉన్న ప్రాంతంలోనే నువ్వు నిశ్చింతగా ఉండగలవు. మరి యొర్దాను పరవళ్ళు తొక్కుతూ వస్తే నీవేం చేస్తావు?

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

5 “యిర్మీయా, మానవులతో పరుగు పందెమునకే నీవు అలసిపోతే, మరి గుర్రాలతో నీవు ఎలా పరుగు పెట్టగలవు? సురక్షిత దేశంలోనే నీవు అలసిపోతే, యొర్దాను నదీ తీరాన పెరిగే ముండ్ల పొదలలోకి వస్తే నీవు ఏమి చేస్తావు?

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 “మీరు కాలినడకన వెళ్తున్న వారితో పరుగెడితేనే వారు నిన్ను అలసిపోయేలా చేశారు, అలాంటప్పుడు గుర్రాలతో ఎలా పోటీపడతావు? భద్రతగల దేశం అని మీరనుకునే దేశంలోనే మీరు క్షేమంగా ఉండనప్పుడు, యొర్దాను ఒడ్డున ఉన్న దట్టమైన పొదల్లో ఎలా?

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 12:5
14 Iomraidhean Croise  

యొర్దాను నది గట్లమీదుగా పొర్లి పారుతున్నప్పుడు, మొదటి నెలలో దానిని దాటి వెళ్లి లోయల్లో తూర్పు నుండి పడమర వరకు ఉన్నవారినందరిని తరిమివేసింది వీరే.


మీ ప్రవాహాల గర్జనతో అగాధం అగాధాన్ని పిలుస్తుంది; మీ తరంగాలు అలలు నా మీదుగా పొర్లి పారుతున్నాయి.


ఒకవేళ మీరు ఇబ్బందుల సమయంలో తడబడితే, మీ బలం ఎంత సూక్ష్మమైనది!


నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు ఆయన గద్దింపును అసహ్యించుకోవద్దు.


అందుకే నిన్ను చంపుతానని బెదిరిస్తున్న అనాతోతు ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నారు, “యెహోవా పేరిట ప్రవచించకండి, అలా చేస్తే మా చేతిలోనే చస్తారు.”


అయితే చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించినవన్నీ యిర్మీయా ప్రజలందరికి చెప్పడం ముగించిన వెంటనే యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ అతన్ని పట్టుకుని, “నీవు తప్పక చావాల్సిందే!


పైగా రాజు, లేఖికుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను బంధించమని రాజకుమారుల్లో ఒకడైన యెరహ్మెయేలు, అజ్రీయేలు కుమారుడైన శెరాయా, అబ్దీయేలు కుమారుడైన షెలెమ్యాలను ఆజ్ఞాపించాడు. అయితే యెహోవా వారిని దాచిపెట్టారు.


“యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను ఎదోమును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”


యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను బబులోనును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”


కోతకాలమంతా యొర్దాను నది పొంగుతూ ఉంటుంది. మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది దగ్గరకు వచ్చి వారి పాదాలు ఆ నీటికి తగలగానే పైనుండి వచ్చే నీళ్లు ఆగిపోయాయి.


ప్రియ మిత్రులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చిన అగ్నివంటి పరీక్షను చూసి మీకేదో వింత జరుగుతున్నట్లుగా ఆశ్చర్యపడకండి.


Lean sinn:

Sanasan


Sanasan