Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 11:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నీ ప్రకటించు: ‘ఈ ఒడంబడికలోని నియమాలను విని వాటిని అనుసరించండి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా – నీవు యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటిని ప్రకటింపుము – మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిననుసరించి నడుచుకొనుడి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నువ్వు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ఈ మాటలు ప్రకటించు. ‘మీరు ఈ నిబంధన మాటలు విని వాటిని పాటించండి.’

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

6 నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, ఈ సమాచారం యూదా పట్టణాలలోను, యెరూషలేము వీధులలోను ప్రకటించుము: ఈ ఒడంబడిక నియమాలు వినండి. ఆ ఒడంబడికలోని న్యాయసూత్రాలను పాటించండి.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నీ ప్రకటించు: ‘ఈ ఒడంబడికలోని నియమాలను విని వాటిని అనుసరించండి.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 11:6
13 Iomraidhean Croise  

వడ్డీ తీసుకోకుండ బీదలకు డబ్బు అప్పిచ్చేవారు; నిర్దోషులకు వ్యతిరేకంగా లంచం తీసుకోనివారు. వీటిని చేసేవారు ఎన్నటికి కదిలించబడరు.


“గట్టిగా కేకలు వేయండి, ఆపకండి. బూర ఊదినట్లు మీ స్వరం వినిపించండి. నా ప్రజలకు వారు చేసిన తిరుగుబాటును తెలియజేయండి, యాకోబు వారసులకు వారి పాపాలను తెలియజేయండి.


హర్సీతు ద్వారం దగ్గర ఉన్న బెన్ హిన్నోము లోయకు వెళ్లి అక్కడ నేను మీకు చెప్పే మాటలు ప్రకటిస్తూ,


“నీవు వెళ్లి యెరూషలేము వింటూ ఉండగా ఇలా ప్రకటించు: “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ యవ్వనంలోని నీ భక్తి నాకు జ్ఞాపకముంది, మీ నిశ్చితార్థ కాలం యొక్క ప్రేమ నాకు జ్ఞాపకముంది; నీవు అరణ్యంలో నన్ను వెంబడించావు, విత్తబడని భూమిలో నన్ను వెంబడించావు.


నీవు వెళ్లి, ఉత్తరాన ఈ సందేశం ప్రకటించాలి: “ ‘ద్రోహియైన ఇశ్రాయేలూ, తిరిగి రా’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘ఇకపై నేను నీవైపు కన్నెత్తి చూడను, ఎందుకంటే నేను నమ్మకస్థుడను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నిత్యం కోపంగా ఉండను.


“యెహోవా ఆలయ ద్వారం దగ్గర నిలబడి, అక్కడ ఈ సందేశాన్ని ప్రకటించండి: “ ‘యెహోవాను ఆరాధించడానికి ఈ ద్వారాల గుండా వచ్చే సర్వ యూదా ప్రజలారా, యెహోవా చెప్తుంది వినండి.


యెరూషలేము, దాని ప్రక్కన ఉన్న పట్టణాలన్ని విశ్రాంతిగా క్షేమంగా ఉన్నప్పుడు, దక్షిణ ప్రదేశం, పడమటి మైదానాల్లో ప్రజలు విస్తరించి ఉన్నప్పుడు పూర్వకాలపు ప్రవక్తల ద్వారా యెహోవా ఈ మాటలను ప్రకటించలేదా?’ ”


ఇప్పుడు మీకు ఈ సంగతులు తెలుసు కాబట్టి వాటిని పాటిస్తే మీరు ధన్యులు.


ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు కాని దానికి లోబడేవారే నీతిమంతులుగా ప్రకటించబడతారు.


ఇప్పుడు, ఇశ్రాయేలూ, నేను మీకు బోధించే శాసనాలు చట్టాలను వినండి. మీరు జీవించి, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోకి వెళ్లి స్వాధీనం చేసుకోవడానికి వాటిని అనుసరించండి.


చూడండి, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించవలసిన శాసనాలను చట్టాలను నేను మీకు బోధించాను.


మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాక్యం చెప్పేది చేయండి.


Lean sinn:

Sanasan


Sanasan