Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 10:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 నా గాయం వల్ల నాకు శ్రమ! నా గాయం మానిపోయేది కాదు! అయినా, “ఇది నా జబ్బు, నేను భరించాలి” అని నాలో నేను చెప్పుకున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 కటకటా, నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే –ఈ దెబ్బ నాకు తగినదే యనుకొని నేను దాని సహించుదును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 అయ్యో, నా ఎముకలకు దెబ్బ తగిలి ఆ గాయం పుండుగా మారింది. అయితే “ఇది నాకు కలిగిన బాధ. నేను దీనిని సహించాల్సిందే” అనుకుంటాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

19 అయ్యో నేను (యిర్మీయా) బాగా గాయపడ్డాను నా గాయం మానరానిది. “ఇది నా రోగం, నేను దానిచే బాధ పడవలసినదే” అని నేను తలపోశాను.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 నా గాయం వల్ల నాకు శ్రమ! నా గాయం మానిపోయేది కాదు! అయినా, “ఇది నా జబ్బు, నేను భరించాలి” అని నాలో నేను చెప్పుకున్నాను.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 10:19
17 Iomraidhean Croise  

ఇదంతా చేసింది మీరే కాబట్టి నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను.


అప్పుడు నేను ఇలా అనుకున్నాను, “ఇది నా విధి: మహోన్నతుడు నాకు వ్యతిరేకంగా చేయి ఎత్తారు.


యాకోబు వారసుల నుండి తన ముఖాన్ని దాస్తున్న యెహోవా కోసం నేను ఎదురుచూస్తాను. ఆయనపై నా నమ్మకాన్ని ఉంచుతాను.


“వారితో ఈ మాట చెప్పు: “ ‘నా కళ్లలో కన్నీరు రాత్రింబగళ్ళు ఆగకుండా పొంగిపారును గాక; ఎందుకంటే, కన్యయైన నా ప్రజల కుమార్తెకు, తీవ్రమైన గాయం తగిలింది, అది ఆమెను నలిపివేస్తుంది.


మా పాపాలు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నా, యెహోవా, మీ నామం కోసం ఏదైనా చేయండి. ఎందుకంటే మేము చాలాసార్లు దారితప్పాం; మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాము.


యెహోవా, మీరే ఇశ్రాయేలీయుల నిరీక్షణ; మిమ్మల్ని విడిచిపెట్టేవారందరూ అవమానానికి గురవుతారు. మిమ్మల్ని విడిచిపెట్టినవారి గమ్యం నాశనమే, ఎందుకంటే వారు జీవజలపు ఊటయైన యెహోవాను విడిచిపెట్టారు.


అయ్యో, నా వేదన, నా వేదన! నేను నొప్పితో విలపిస్తున్నాను. అయ్యో, నా హృదయ వేదన! నా గుండె నాలో కొట్టుకుంటుంది, నేను మౌనంగా ఉండలేను. నేను బూరధ్వని విన్నాను; నేను యుద్ధ కేకలు విన్నాను.


ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ ఏడ్పు, తన మొదటి బిడ్డను కంటూ వేదనపడుతున్న స్త్రీ కేకలు, ఊపిరి కోసం అల్లాడుతూ, సీయోను కుమారి తన చేతులు చాచి, “అయ్యో! నేను మూర్ఛపోతున్నాను; నా ప్రాణం హంతకులకు అప్పగించబడింది,” అంటూ కేకలు వేయడం నాకు వినబడుతుంది.


నా ప్రజలు నలిగిపోయారు కాబట్టి, నేనూ నలిగిపోయాను; నేను దుఃఖిస్తున్నాను, భయం నన్ను పట్టుకుంటుంది.


అయ్యో, నా తల నీటి బావి నా కళ్లు కన్నీటి ఊట అయి ఉంటే బాగుండేది! చంపబడిన నా ప్రజల కోసం నేను పగలు రాత్రి ఏడ్చే వాన్ని.


రాత్రంతా ఆమె ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది, ఆమె చెంపల మీద కన్నీరు ఉంటుంది. ఆమె ప్రేమికులందరి మధ్య ఉన్నా ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. ఆమె స్నేహితులందరూ ఆమెను అప్పగించారు; వారు ఆమెకు శత్రువులయ్యారు.


నా ప్రజలు నాశనమయ్యారు కాబట్టి నా కళ్ళ నుండి కన్నీటి ధారలు ప్రవహిస్తాయి.


నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను కాబట్టి, ఆయన నాకు న్యాయం తీర్చేవరకు ఆయన నా పక్షాన ఉండే వరకు నేను ఆయన కోపాగ్నిని భరిస్తాను. ఆయన నన్ను వెలుగులోకి తీసుకువస్తారు, నేను ఆయన నీతిని చూస్తాను.


Lean sinn:

Sanasan


Sanasan