Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 10:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 తెలివిలేని ప్రతిమనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమునుబట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 ప్రతి మనిషీ తెలివిలేని మూర్ఖుడు. విగ్రహాలు పోతపోసే ప్రతివాడూ తాను చేసిన విగ్రహాన్నిబట్టి అవమానం పొందుతాడు. అతడు పోత పోసిన విగ్రహాలు నకిలీవి. వాటికి ప్రాణం లేదు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

14 ప్రజలు మందబుద్ధి గలవారయ్యారు! లోహపు పనివారు వారు చేసిన విగ్రహాల చేత మూర్ఖులయ్యారు. వారి బొమ్మలు అబద్ధాలకు ప్రతీకలు. అవి జడపదార్థములు

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 10:14
20 Iomraidhean Croise  

వివేకం కలిగి దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని యెహోవా పరలోకం నుండి మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు.


దుష్టులు గడ్డిలా మొలకెత్తినా, కీడుచేసేవారంతా వర్ధిల్లుతున్నా, వారు శాశ్వతంగా నాశనమవుతారని, తెలివిలేనివారికి తెలియదు, మూర్ఖులు గ్రహించరు.


ప్రజల్లో తెలివిలేని మీరు, గమనించండి; అవివేకులారా, మీరు ఎప్పుడు జ్ఞానులవుతారు?


వ్యర్థ విగ్రహాలనుబట్టి గొప్పలు చెప్తూ, చెక్కిన ప్రతిమలను పూజించేవారందరు సిగ్గుపడతారు సకల దేవుళ్ళారా, యెహోవా ఎదుట సాగిలపడండి!


నిజంగా నేను క్రూరమైనవాన్ని, మనుష్యుని కాదు; మనుష్యులకు ఉండే ఇంగిత జ్ఞానం నాకు లేదు.


అయితే చెక్కిన విగ్రహాలను నమ్మినవారు ప్రతిమలతో, ‘మీరు మాకు దేవుళ్ళు’ అని చెప్పేవారు, చాలా సిగ్గుతో వెనుకకు తిరుగుతారు.


అలా చేసే ప్రజలందరూ సిగ్గుపరచబడతారు. ఆ శిల్పకారులు కేవలం మనుష్యులే. వారందరు కలిసివచ్చి నిలబడాలి; వారు భయానికి గురై సిగ్గుపడతారు.


విగ్రహాలను చేసే వారందరు సిగ్గుపడి అవమానపడతారు. వారందరు కలిసి అవమానానికి గురవుతారు.


నీ నీతిని పనులను నేను బయటపెడతాను అవి మీకు ప్రయోజనకరంగా ఉండవు.


దోసకాయ పొలంలో దిష్టిబొమ్మలా, వారి విగ్రహాలు మాట్లాడలేవు; అవి నడవలేవు కాబట్టి వాటిని మోయాలి. వాటికి భయపడవద్దు; అవి ఏ హాని చేయలేవు అలాగే ఏ మేలు కూడా చేయలేవు.”


వారంతా తెలివిలేనివారు, మూర్ఖులు; వారు పనికిరాని చెక్క విగ్రహాల బోధను వింటున్నారు.


వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చి, సృష్టికర్తకు బదులుగా ఆయన సృష్టించిన వాటిని పూజించి సేవించారు. అయితే ఆయన ఎల్లప్పుడు స్తోత్రార్హుడు. ఆమేన్.


ఆ మరుసటి ఉదయం అష్డోదు ప్రజలు లేచి చూడగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలపై బోర్లా పడి ఉంది. దాగోను తల రెండు చేతులు నరికివేయబడి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రమే మిగిలి ఉంది.


Lean sinn:

Sanasan


Sanasan