Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 10:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 ఆయన ఉరిమినప్పుడు ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనా గారములలోనుండి గాలిని రావించును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 ఆయన స్వరం ఆకాశమండలంలో నీటి గర్జనలాగా వినిపిస్తుంది. భూదిగంతాల్లో నుండి ఆయన ఆవిరి మేఘాలు వచ్చేలా చేస్తాడు. వర్షంతో బాటు ఆయన మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల నుండి గాలిని పంపిస్తాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

13 భయంకరమైన శబ్ధంగల పిడుగులను దేవుడే కలుగజేస్తాడు. ఆకాశంనుండి ధారాపాతంగా వర్షం పడేలా కూడా దేవుడే చేస్తాడు. భూమి నలుమూలల నుండీ ఆకాశంలోకి మేఘాలు లేచేలా ఆయన చేస్తాడు. ఆయన ఉరుములు మెరుపులతో వానపడేలా చేస్తాడు. ఆయన తన గిడ్డంగుల నుండి గాలి వీచేలా చేస్తాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 ఆయన ఉరిమినప్పుడు ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 10:13
23 Iomraidhean Croise  

భూమి మీద ఏ పొద కనిపించలేదు, మొక్క మొలవలేదు, ఎందుకంటే యెహోవా దేవుడు భూమి మీద వాన కురిపించలేదు, భూమిని సేద్యం చేయడానికి నరులు లేరు,


తర్వాత ఏలీయా అహాబుతో, “భారీ వర్షం వచ్చే ధ్వని వస్తుంది, నీవు వెళ్లి అన్నపానాలు పుచ్చుకో” అన్నాడు.


“మంచు నిల్వ ఉండే స్థలాలకు నీవు వెళ్లవా? వడగండ్లు నిల్వ ఉండే స్థలాలను నీవు చూశావా?


తన ఆకాశ గదుల్లో నుండి ఆయన పర్వతాలను తడుపుతారు; ఆయన క్రియా ఫలం చేత భూమి తృప్తి చెందుతుంది.


చెవులున్నాయి కాని వినలేవు, వాటి నోళ్లలో ఊపిరి ఏమాత్రం లేదు.


ఆయన భూమి అంచుల నుండి మేఘాలను లేచేలా చేస్తారు; వర్షంతో పాటు మెరుపులను పంపిస్తారు తన కోటలో నుండి గాలిని బయటకు పంపిస్తారు.


ఆయన ఆకాశాన్ని మేఘాలతో కప్పుతారు; భూమికి వర్షమిచ్చి కొండలపై గడ్డి మొలిపిస్తారు.


యెహోవా పరలోకం నుండి ఉరిమారు; మహోన్నతుని స్వరం ప్రతిధ్వనించింది.


అనాది కాలం నుండి మహా ఆకాశాల్లో స్వారీ చేసే, తన స్వరంతో ఉరిమే ఆయనను కీర్తించండి.


మోషే తన కర్రను ఆకాశం వైపు చాచినప్పుడు, యెహోవా ఉరుములను వడగండ్లను పంపినప్పుడు మెరుపులు వేగంగా నేలను తాకాయి. ఈజిప్టు దేశమంతటా యెహోవా వడగండ్లు కురిపించారు.


జనాంగాల పనికిమాలిన విగ్రహాలేవైనా వర్షాన్ని కురిపిస్తాయా? ఆకాశాలు వాటంతట అవి జల్లులు కురిపిస్తాయా? లేదు, యెహోవా, మా దేవా మీరే కదా. కాబట్టి మీ మీదనే మా నిరీక్షణ ఉంది, ఎందుకంటే ఇదంతా చేసింది మీరే.


నేను ఈ ప్రదేశానికి, ఇక్కడ నివసించేవారికి ఇదే చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు. నేను ఈ పట్టణాన్ని తోఫెతులా చేస్తాను.


‘మనం మన దేవుడైన యెహోవాకు భయపడదాం, ఆయన తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తారు, నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను గురించి మనకు నిశ్చయత కలిగించేవాడు ఆయనే’ అని వారు తమ హృదయాల్లో అనుకోరు.


ఆయన ఉరిమినప్పుడు, ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.


పర్వతాలను ఏర్పరచింది గాలిని సృష్టించింది ఆయనే, తన ఆలోచనలను మనుష్యులకు వెల్లడి చేసేది, ఉదయాన్ని చీకటిగా మార్చేది ఆయనే, భూమి ఎత్తైన స్థలాల్లో ఆయన నడుస్తారు ఆయన పేరు దేవుడైన సైన్యాల యెహోవా.


వసంతకాలంలో వర్షం కోసం యెహోవాను అడగండి; ఉరుములతో ఉన్న తుఫానును పంపేది యెహోవాయే. అందరి పొలానికి మొక్కలు పెరిగేలా, ఆయన ప్రజలందరికి వర్షాన్ని కురిపిస్తారు.


Lean sinn:

Sanasan


Sanasan