Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యెషయా 8:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 ఆ పిల్లవాడు నాన్న అమ్మ అని పిలువకముందే, అష్షూరు రాజు దమస్కు సంపదని సమరయ దోపుడుసొమ్మును ఎత్తుకుని పోతాడు.”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 ఈ బాలుడు–నాయనా అమ్మా అని అననేరకమునుపు అష్షూరురాజును అతని వారును దమస్కుయొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తికొని పోవుదురనెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 ఈ పిల్లవాడు నాన్నా, అమ్మా అనగలిగే ముందే అష్షూరు రాజు, అతని మనుషులు దమస్కు ఐశ్వర్యాన్నీ షోమ్రోను దోపుడు సొమ్మునూ ఎత్తుకు పోతారు” అన్నాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

4 ఎందుకంటే ఆ పిల్లవాడు “అమ్మా” “నాన్నా” అనటం నేర్చుకొనక ముందే దమస్కు, షోమ్రోనుల ధనం, ఐశ్వర్యాలు దేవుడు తీసుకొని, వాటిని దేవుడు అష్షూరు రాజుకు ఇచ్చివేస్తాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 ఆ పిల్లవాడు నాన్న అమ్మ అని పిలువకముందే, అష్షూరు రాజు దమస్కు సంపదని సమరయ దోపుడుసొమ్మును ఎత్తుకుని పోతాడు.”

Faic an caibideil Dèan lethbhreac




యెషయా 8:4
16 Iomraidhean Croise  

ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు.


అష్షూరు రాజు అతని మాట అంగీకరించి, దమస్కు మీద దండెత్తి, దానిని స్వాధీనపరచుకున్నాడు. దాని ప్రజలను కీరుకు బందీలుగా తీసుకెళ్లాడు, రెజీనును చంపాడు.


అష్షూరు రాజైన షల్మనేసెరు హోషేయ మీద దాడి చేయడానికి రాగా హోషేయ అతనికి లొంగిపోయి అతనికి పన్ను చెల్లించాడు.


దమస్కుకు వ్యతిరేకంగా ప్రవచనం: “చూడండి, దమస్కు ఒక పట్టణంగా ఇక ఉండదు, కాని అది శిథిలాల కుప్పగా మారుతుంది.


ఎఫ్రాయిములో నుండి కోటగల పట్టణం మాయమవుతుంది, దమస్కు రాజ్యాధికారాన్ని కోల్పోతుంది; ఇశ్రాయేలీయుల ప్రభావానికి జరిగినట్లు అరాములో మిగిలినవారికి జరుగుతుంది” అని సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.


ఫలవంతమైన లోయ తలపై ఉన్న వాడిపోయిన పువ్వు లాంటి అతని వైభవం కోతకాలం రాకముందే పండిన అంజూర పండులా ఉంటుంది. ప్రజలు వాటిని చూడగానే తమ చేతిలోనికి తీసుకుని వెంటనే వాటిని మ్రింగివేస్తారు.


యెహోవా నాతో మరలా ఇలా మాట్లాడారు:


యెహోవా ఇలా చెప్తున్నారు: “దమస్కు చేసిన మూడు పాపాల గురించి, దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అది గిలాదును ఇనుప పనిముట్లతో నూర్చింది.


దమస్కు ద్వారాన్ని విరగ్గొడతాను; ఆవెను లోయలో ఉన్న రాజును నాశనం చేస్తాను అతడు బేత్-ఏదెనులో రాజదండం పట్టుకున్నవాడు. అరాము ప్రజలు కీరుకు బందీలుగా వెళ్తారు” అని యెహోవా చెప్తున్నారు.


అలాంటప్పుడు కుడి ఎడమలు తెలియని లక్ష ఇరవై వేలమంది మనుష్యులు ఎన్నో జంతువులు ఉన్న గొప్ప పట్టణమైన నీనెవె గురించి నేను చింతించకూడదా?” అన్నారు.


కవలలు ఇంకా పుట్టి మంచి చెడు ఏదీ చేయక ముందే, ఏర్పాటు చేయబడిన ప్రకారం, దేవుని ఉద్దేశం, క్రియలమూలంగా కాకుండా,


బందీలుగా వెళ్తారని మీరు చెప్పిన మంచి చెడు తెలియని మీ పిల్లలు ఆ దేశంలో అడుగుపెడతారు. నేను దానిని వారికి ఇస్తాను, వారు దానిని స్వాధీనం చేసుకుంటారు.


Lean sinn:

Sanasan


Sanasan