Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యెషయా 5:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 నేను వినేలా సైన్యాల యెహోవా చెప్పిన మాట: “నిజంగా గొప్ప ఇల్లు ఖాళీగా అయిపోతాయి, చక్కటి భవనాలు నివాసులు లేక పాడైపోతాయి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెల విచ్చెను. –నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు అనేకములు నివాసులులేక పాడైపోవును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 నేను చెవులారా వినేలా సేనల ప్రభువు యెహోవా స్పష్టంగా ఈ మాట నాకు చెప్పాడు. నిజంగా గొప్పవి, అందమైన చాలా ఇళ్ళు వాటిలో నివాసముండే వారు లేక పాడైపోతాయి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

9 సర్వశక్తిమంతుడైన యెహోవా నాతో ఇలా చెప్పాడు, నేను అది విన్నాను, “ఇప్పుడు చాలా ఇళ్లు ఉన్నాయి. అయితే ఆ ఇళ్లన్నీ నాశనం చేయబడుతాయని నేను ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు అందమైన పెద్ద భవనాలు ఉన్నాయి. కానీ ఆ ఇళ్లు ఖాళీ అయిపోతాయి.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 నేను వినేలా సైన్యాల యెహోవా చెప్పిన మాట: “నిజంగా గొప్ప ఇల్లు ఖాళీగా అయిపోతాయి, చక్కటి భవనాలు నివాసులు లేక పాడైపోతాయి.

Faic an caibideil Dèan lethbhreac




యెషయా 5:9
14 Iomraidhean Croise  

దేశం తన సబ్బాతు దినాలను ఆనందంగా గడిపింది; యిర్మీయా చెప్పిన యెహోవా వాక్కు నెరవేరేలా డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యే వరకు అది పాడైన సమయమంతా విశ్రాంతి తీసుకుంది.


అతడు పాడైపోయిన పట్టణాల్లో ఎవరు నివసించని ఇళ్ళలో, శిధిలమైపోతున్న ఇళ్ళలో నివసిస్తాడు.


వారు మ్రింగివేయడానికి వారికి ఏమి మిగల్లేదు; వారి అభివృద్ధి నిలబడదు.


అత్యాశ తన ఇంటివారి మీదికి పతనాన్ని తెస్తుంది, లంచాన్ని అసహ్యించుకునేవారు బ్రతుకుతారు.


ప్రభువు, సైన్యాల యెహోవా బయలుపరిచింది ఇది: “నీ మరణించే రోజు వరకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు” అని సర్వశక్తిమంతుడైన సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.


బలమైన పట్టణం ఒంటరిగా నిలిచిపోతుంది, పాడుబడిన స్థలంగా మారి అరణ్యంలా విడిపెట్టబడుతుంది. అక్కడ దూడలు మేస్తాయి అక్కడే అవి పడుకుంటాయి; అవి దాని చెట్ల కొమ్మలు తినివేస్తాయి.


నేను దానిని బంజరు భూమిలా చేస్తాను, అది త్రవ్వరు, సాగు చేయరు, అక్కడ గచ్చపొదలు ముళ్ళచెట్లు పెరుగుతాయి. దానిపై వర్షం కురిపించవద్దని మేఘాలను ఆజ్ఞాపిస్తాను.”


తన సేవకులైన ప్రవక్తలకు తన ప్రణాళికను తెలియజేయకుండా ప్రభువైన యెహోవా ఏదీ చేయరు.


మీరు బీదలను అణగద్రొక్కుతూ, వారి ధాన్యం మీద పన్ను వేస్తారు. కాబట్టి మీరు రాళ్లతో భవనాలను కట్టుకున్నా, వాటిలో కాపురముండరు; అందమైన ద్రాక్షతోటలు నాటినా మీరు ఆ పండ్ల రసం త్రాగరు.


ఎందుకంటే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, పెద్ద కుటుంబాలు ముక్కలుగా విడిపోతాయి చిన్నా కుటుంబాలు చీలిపోతాయి.


కాబట్టి రాజు కోప్పడి తన సైన్యాన్ని పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.


చూడు, నీ ఇల్లు నిర్జనమైనదిగా నీకే విడిచిపెట్టబడుతుంది.


చూడండి మీ పొలాలను కోసిన పనివారికి ఇవ్వకుండా మోసంతో మీరు దాచిపెట్టిన వారి జీతాలు మొరపెట్టాయి. కోతపనివారి మొరలు సర్వశక్తిమంతుడైన ప్రభుని చెవులకు చేరాయి.


Lean sinn:

Sanasan


Sanasan