Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యెషయా 3:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 కాని ఆ రోజు అతడు కేక వేసి, “నా దగ్గర పరిష్కారం లేదు. నా ఇంట్లో ఆహారం గాని బట్టలు గాని లేవు; నన్ను ప్రజలకు నాయకునిగా చేయవద్దు” అంటాడు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 అతడు ఆ దినమున కేకవేసి–నేను సంరక్షణ కర్తనుగా ఉండనొల్లను నాయింట ఆహారమేమియు లేదు వస్త్రమేమియు లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాదనును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 అతడు ఆ రోజున కేక వేసి, ‘నేను సంరక్షణ కర్తగా ఉండను, నాకు ఆహారం గాని, వస్త్రాలు గాని లేవు. నన్ను ప్రజలకు అధిపతిగా నియమించవద్దు’ అంటాడు.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

7 అయితే ఆ సోదరుడు లేచి, “నేను నీకు సహాయం చేయలేను. సరిపడినంత ఆహారంగాని బట్టలుగాని నా ఇంట్లో లేవు. నన్ను మీ నాయకుడిని చేయవద్దు” అని చెబుతాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 కాని ఆ రోజు అతడు కేక వేసి, “నా దగ్గర పరిష్కారం లేదు. నా ఇంట్లో ఆహారం గాని బట్టలు గాని లేవు; నన్ను ప్రజలకు నాయకునిగా చేయవద్దు” అంటాడు.

Faic an caibideil Dèan lethbhreac




యెషయా 3:7
10 Iomraidhean Croise  

అయితే అబ్రాము సొదొమ రాజుతో, “చేతులెత్తి సర్వోన్నతుడైన దేవుడు, భూమ్యాకాశాల సృష్టికర్తయైన యెహోవాకు ఇలా ప్రమాణం చేశాను,


పూర్వకాలపు శిథిలాలను మీ ప్రజలు కడతారు. అనేక తరాల నాటి పునాదులను మీరు మరల వేస్తారు; మీరు కూలిన గోడలను మరమత్తు చేసే మేస్త్రీగా, నివాసయోగ్యంగా వీధుల్ని బాగు చేసేవారిగా పిలువబడతారు.


యెహోవా, మీరు యూదాను పూర్తిగా తిరస్కరించారా? మీరు సీయోనును తృణీకరిస్తున్నారా? మేము స్వస్థత పొందలేనంతగా మమ్మల్ని ఎందుకు బాధించారు? మేము సమాధానం కోసం నిరీక్షించాం కానీ ఏ మంచి జరగలేదు, స్వస్థత జరిగే సమయం కోసం నిరీక్షించాం కానీ కేవలం భయమే ఉండింది.


యెరూషలేము కుమారీ! నీ గురించి ఏమి చెప్పగలను? నిన్ను దేనితో పోల్చగలను? సీయోను కుమారీ, కన్యకా! నిన్నెలా ఓదార్చడానికి నిన్ను దేనితో పోల్చగలను నీకు కలిగిన గాయం సముద్రమంత లోతుగా ఉంది నిన్నెవరు స్వస్థపరచగలరు?


మీరు బలహీనమైన వాటిని బలపరచలేదు, రోగంతో ఉన్నవాటిని స్వస్థపరచలేదు, గాయపడిన వాటికి కట్టు కట్టలేదు. మీరు దారితప్పిన వాటిని తిరిగి తీసుకురాలేదు, తప్పిపోయిన వాటికోసం వెదకలేదు. మీరు వాటిని కఠినంగా, క్రూరంగా పాలించారు.


“ఎఫ్రాయిం తన రోగాన్ని, యూదా తన పుండ్లను చూసుకున్నప్పుడు, ఎఫ్రాయిం అష్షూరు వైపు తిరిగి గొప్ప రాజును సహాయం కోరాడు. అయితే అతడు నిన్ను బాగుచేయలేదు, నీ పుండ్లను స్వస్థపరచలేదు.


“రండి, మనం యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. ఆయన మనల్ని ముక్కలుగా చీల్చారు కాని ఆయనే మనల్ని బాగుచేస్తారు; ఆయన మనల్ని గాయపరచారు కాని ఆయన మన గాయాలను కడతారు.


మన కళ్లెదుటే దేవుని మందిరంలో ఆహారం నిలిపివేయబడలేదా సంతోషం ఆనందం నిలిచిపోలేదా?


నేను ఆకాశం వైపు నా చేయి ఎత్తి రూఢిగా ప్రమాణం చేస్తున్నాను: నా శాశ్వత జీవం తోడని చెప్తున్న,


Lean sinn:

Sanasan


Sanasan