Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యెషయా 15:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 వారు తమ సంతవీధులలో గోనెపట్ట కట్టుకుంటారు; తమ మేడల మీద, బహిరంగ స్థలాల్లో వారందరు రోదిస్తారు, ఏడుస్తూ కన్నీరు కారుస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురువారి మేడలమీదను వారి విశాలస్థలములలోను వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయు దురు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు. వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 మోయాబు అంతటా ఇంటి కప్పుల మీద, వీధుల్లో ప్రజలు నల్ల బట్టలు ధరిస్తున్నారు. ప్రజలు ఏడుస్తున్నారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 వారు తమ సంతవీధులలో గోనెపట్ట కట్టుకుంటారు; తమ మేడల మీద, బహిరంగ స్థలాల్లో వారందరు రోదిస్తారు, ఏడుస్తూ కన్నీరు కారుస్తారు.

Faic an caibideil Dèan lethbhreac




యెషయా 15:3
17 Iomraidhean Croise  

దావీదు, “మీ బట్టలు చింపుకుని గోనెబట్ట వేసుకుని అబ్నేరు ముందు నడుస్తూ దుఃఖించండి” అని యోవాబుకు అతనితో ఉన్న ప్రజలందరికి ఆజ్ఞాపించి, రాజైన దావీదు కూడా పాడె వెంట నడిచాడు.


రాజు ఆ స్త్రీ చెప్పింది విన్నప్పుడు, తన బట్టలు చించుకున్నాడు. అతడు ప్రాకారం దగ్గర నడుస్తూ వెళ్తున్నప్పుడు, ప్రజలు అతనిపై వస్త్రం లోపల గోనెపట్ట ఉండడం చూశారు.


దీబోను ఏడ్వడానికి గుడికి తన క్షేత్రాలకు వెళ్తుంది; నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది. ప్రతి తల క్షౌరం చేయబడింది ప్రతివాని గడ్డం గొరిగించబడింది.


దర్శనపు లోయకు వ్యతిరేకంగా ప్రవచనం: ఏ కారణంగా మీరందరు మేడల మీదికి ఎక్కారు?


అప్పుడు నేను, “నా నుండి దూరంగా వెళ్లండి; నన్ను గట్టిగా ఏడవనివ్వండి. నా ప్రజలకు కలిగిన నాశనం గురించి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి” అని చెప్తాను.


సువాసనకు బదులు దుర్వాసన ఉంటుంది; నడికట్టుకు బదులు తాడు; అల్లిన జడకు బదులు బోడితల; ప్రశస్తమైన పైవస్త్రానికి బదులు గోనెపట్ట; అందానికి బదులు ఖైదీ వాత ఉంటుంది.


యెరూషలేములోని ఇల్లు, యూదా రాజుల భవనాలు ఆ తోఫెతు స్థలంలా అపవిత్రం చేయబడతాయి. అన్ని ఇళ్ల మీద ప్రజలు ఆకాశ సైన్యాలకు ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించారు.’ ”


ప్రతి తల గుండు చేయబడింది ప్రతి గడ్డం కత్తిరించబడింది; ప్రతి చేయి నరకబడింది ప్రతి నడుము గోనెపట్టతో కప్పబడింది.


సీయోను కుమార్తె పెద్దలు మౌనంగా నేలమీద కూర్చున్నారు; తమ తలలపై ధూళి చల్లుకొని గోనెపట్ట కట్టుకున్నారు. యెరూషలేము యువతులు తమ తలలు నేలకు వంచుకున్నారు.


వారు గోనెపట్ట కట్టుకుంటారు భయం వారిని ఆవరిస్తుంది. ప్రతి ఒక్కరు సిగ్గుతో తలవంచుకుంటారు, ప్రతి తల క్షౌరం చేయబడుతుంది.


నేను మీరు ఆచరించే పండుగలను విలాపంగా, మీ పాటలన్నీ విషాద గీతాలుగా మారుస్తాను. నేను మీరంతా గోనెపట్ట కట్టుకునేలా, తల గొరిగించుకునేలా చేస్తాను. ఏకైక కుమారుని కోసం ఏడ్చినట్లుగా ఆ సమయాన్ని చేస్తాను, దాని అంతం ఘోరమైన రోజుగా ఉంటుంది.


“కొరజీనూ నీకు శ్రమ! బేత్సయిదా నీకు శ్రమ! ఎందుకంటే మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో జరిగి ఉంటే, ఆ ప్రజలు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని పశ్చాత్తాపపడి ఉండేవారు.


మీరు ఒక క్రొత్త ఇంటిని కట్టుకున్నప్పుడు, మీ పైకప్పు చుట్టూ ఒక పిట్టగోడను కట్టుకోండి, తద్వారా ఎవరైనా పైకప్పు నుండి క్రింద పడితే మీ ఇంటిపైకి రక్తపాతం యొక్క అపరాధం తీసుకురాదు.


ధనవంతులారా రండి, మీపైకి రాబోతున్న దురవస్థలను బట్టి దుఃఖించి ఏడవండి.


చనిపోకుండా ఉన్నవారు గడ్డల చేత బాధించబడ్డారు. ఆ పట్టణ ప్రజల కేకలు ఆకాశం వరకు వినబడ్డాయి.


Lean sinn:

Sanasan


Sanasan