యెషయా 1:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అరికాలు నుండి నడినెత్తి వరకు పుండు లేనిచోటు లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, వాటిని శుభ్రం చేయలేదు, కట్టు కట్టలేదు, ఒలీవనూనెతో చికిత్స చేయలేదు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, మానని పుళ్ళు. అవి నయం కాలేదు. వాటిని ఎవరూ కడగలేదు, కట్టు కట్టలేదు, నూనెతో చికిత్స చెయ్యలేదు. Faic an caibideilపవిత్ర బైబిల్6 మీ అరికాలు మొదలుకొని మీ నడినెత్తి వరకు శరీరమంతా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు ఉన్నాయి. మీ పుండ్లను గూర్చి మీరు శ్రద్ధ తీసుకోలేదు. మీ పుండ్లు శుభ్రం చేయబడలేదు. వాటికి కట్లు కట్టలేదు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అరికాలు నుండి నడినెత్తి వరకు పుండు లేనిచోటు లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, వాటిని శుభ్రం చేయలేదు, కట్టు కట్టలేదు, ఒలీవనూనెతో చికిత్స చేయలేదు. Faic an caibideil |