Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ఎఫెసీయులకు 2:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 మనం మన అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

5 మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 మనం మన అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

5 మనం మన అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనలను బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు.

Faic an caibideil Dèan lethbhreac




ఎఫెసీయులకు 2:5
20 Iomraidhean Croise  

ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, వీడు తప్పిపోయి దొరికాడు’ అని అన్నాడు. అలా వారందరు అతనితో ఆనందించడం మొదలుపెట్టారు.


తండ్రి ఎలాగైతే చనిపోయినవారిని లేపి జీవమిస్తారో, కుమారుడు కూడా తనకు ఇష్టమైనవారికి జీవాన్ని ఇస్తారు.


ఆత్మ జీవాన్ని ఇస్తుంది; శరీరం వలన ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మతో జీవంతో నిండి ఉన్నాయి.


వారు రక్షణ పొందినట్లే, ప్రభువైన యేసు కృప చేతనే మనం కూడా రక్షణ పొందుకుంటున్నామని నమ్ముతున్నాం కదా.”


సమాధానకర్తయైన దేవుడు త్వరలో తన పాదాల క్రింద సాతానును నలిపివేస్తారు. మన ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక.


కాబట్టి విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు.


కాబట్టి, వాగ్దానం విశ్వాసమూలంగానే వస్తుంది. ఆ వాగ్దానం అబ్రాహాము సంతానమంతటికి అనగా, కేవలం ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవారికి మాత్రమే కాకుండా అబ్రాహాము ఏ విశ్వాసాన్నైతే కలిగి ఉన్నాడో అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నవారందరికి కృప ద్వారా వర్తిస్తుంది. అతడు మనందరికి తండ్రి.


ఎందుకంటే, మనం దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడితే ఆయన జీవం ద్వారా మరి అధికంగా రక్షించబడతాము.


మనం ఇంకను బలహీనులమై ఉన్నప్పుడే, సరియైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం మరణించారు.


కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం మరణించుట ద్వారా దేవునికి మన పట్ల ఉన్న తన ప్రేమను చూపించారు.


ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని ఇచ్చే ఆత్మ నియమం మిమ్మల్ని పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది.


ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికి తోడై యుండును గాక.


మీరైతే, మీ అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండి,


మీరు మీ విశ్వాసం ద్వారా కృపను చేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ నుండి వచ్చింది కాదు, గాని ఇది దేవుడు మీకిచ్చిన బహుమానము.


అందుకే వాక్యంలో, “నిద్రిస్తున్నవాడా, మేల్కో, మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తారు” అని వ్రాయబడింది.


మీ పాపాలను బట్టి మీ శరీరం సున్నతి పొందని కారణంగా మీరు చచ్చినవారిగా ఉండగా దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో పాటు బ్రతికించారు. ఆయన మన పాపాలన్నిటిని క్షమించారు,


మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది.


ఆయన మనల్ని రక్షించారు, మనం చేసిన నీతిపనులను బట్టి కాదు కాని, తన కనికరం చేతనే మనం రక్షించబడ్డాము. ఆయన మన పాపాలను కడిగి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు క్రొత్త జన్మనిచ్చి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు.


ప్రభువైన యేసు కృప దేవుని ప్రజలతో ఉండును గాక ఆమేన్.


Lean sinn:

Sanasan


Sanasan