Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ప్రసంగి 1:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 ఇంతవరకు ఉన్నదే ఇకముందు కూడా ఉంటుంది, ఇంతవరకు జరిగిందే ఇకముందు జరుగబోతుంది; సూర్యుని క్రింద క్రొత్తది అంటూ ఏదీ లేదు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది;మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఇంతవరకూ ఉన్నదే ముందు కూడా ఉంటుంది. ఇంతవరకూ జరిగిందే ఇక ముందూ జరుగుతుంది. ఇది కొత్తది అని చెప్పదగినది సూర్యుని కింద ఏదీ లేదు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

9 అన్నీ ఆదినుంచి ఉన్నట్లే కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు జరిగినవే ఇక ముందూ ఎల్లప్పుడూ జరుగుతాయి. ఈ జీవితంలో కొత్తదంటూ ఏదీ లేదు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 ఇంతవరకు ఉన్నదే ఇకముందు కూడా ఉంటుంది, ఇంతవరకు జరిగిందే ఇకముందు జరుగబోతుంది; సూర్యుని క్రింద క్రొత్తది అంటూ ఏదీ లేదు.

Faic an caibideil Dèan lethbhreac




ప్రసంగి 1:9
10 Iomraidhean Croise  

“చూడండి! ఇది క్రొత్తది” అని ఎవరైనా ఒకదాని గురించి చెప్పడానికి ఏదైనా ఉందా? చాలా కాలం క్రితమే, అది ఉంది; మన కాలానికి ముందే అది ఉంది.


నేను జ్ఞానం, పిచ్చితనం, బుద్ధిహీనతల గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. రాజు ఇంతకుముందే చేసిన దానికంటే, రాజు తర్వాత వచ్చేవాడు అధికంగా ఇంకేమి చేయగలడు? అనుకున్నాను.


ఇప్పుడు జరుగుతున్నది ఇంతకుముందు జరిగిందే. ఇకముందు జరగబోయేది, పూర్వం జరిగి ఉన్నదే. మునుపున్నదాన్నే మళ్ళీ దేవుడు రప్పిస్తారు, జరిగిస్తారు.


ఉనికిలో ఉన్నవన్నీ ఇంతకు ముందు తెలిసినవే. మనుష్యులు ఎలా ఉంటారో పూర్వం నుండి తెలిసిందే; తనకంటే బలవంతుడితో ఎవరు పోరాడలేరు.


“ఇప్పుడు ఉన్న రోజుల కన్నా గడిచిపోయిన రోజులే ఎందుకు మంచివి?” అని అనవద్దు అలాంటి ప్రశ్నలు అడగడం తెలివైనది కాదు.


చూడండి, నేను ఒక క్రొత్త పని చేస్తున్నాను! ఇప్పుడే అది మొలకెత్తుతుంది; మీరు దానిని గ్రహించలేదా? నేను అరణ్యంలో దారి కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను.


విశ్వాసఘాతకురాలవైన కుమార్తె, ఇశ్రాయేలూ, నీవు ఎంతకాలం తిరుగుతావు? యెహోవా భూమిపై ఒక క్రొత్తదాన్ని సృష్టిస్తారు, స్త్రీ పురుషుని దగ్గరకు తిరిగి వస్తుంది.”


అయితే మీలో అబద్ధ బోధకులు ఉన్నట్లుగానే, గతంలో కూడా ప్రజల మధ్యలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు రహస్యంగా నాశనకరమైన నియమాలను ప్రవేశపెడుతూ, తమను కొన్న సర్వాధికారియైన ప్రభువును కూడా తిరస్కరిస్తూ తమ మీదికి తామే వేగంగా నాశనాన్ని తెచ్చుకుంటారు.


అప్పుడు నేను “క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని” చూశాను. మొదట ఉన్న ఆకాశం, భూమి గతించిపోయాయి. సముద్రం ఇక లేకపోయింది.


అప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్న దేవుడు, “ఇదిగో, సమస్తాన్ని నూతనపరుస్తున్నాను” అని చెప్పి, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి కాబట్టి వీటిని వ్రాసి పెట్టు” అన్నారు.


Lean sinn:

Sanasan


Sanasan