Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 సమూయేలు 9:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఒకసారి దావీదు, “యోనాతాను బట్టి నేను దయ చూపించడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 – యోనాతానునుబట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైన కలడాయని దావీదు అడిగెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 “సౌలు కొడుకు యోనాతానును బట్టి నేను ఏదైనా మేలు చేయడానికి అతని కుటుంబానికి చెందినవారు ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని దావీదు అడిగాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

1 “సౌలు కుటుంబంలో ఇంకాఎవరైనా మిగిలియున్నారా? యోనాతాను కోసం ఆ వ్యక్తికి నేను కనికరం చూపదల్చుకున్నాను” అని దావీదు చెప్పాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ఒకసారి దావీదు, “యోనాతాను బట్టి నేను దయ చూపించడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు.

Faic an caibideil Dèan lethbhreac




2 సమూయేలు 9:1
15 Iomraidhean Croise  

నా సోదరుడా, యోనాతానా! నీకోసం నేనెంతో దుఃఖిస్తున్నాను; నీవు నాకెంతో ప్రియమైనవాడవు. నాపై నీకున్న ప్రేమ ఎంతో అద్భుతమైనది, అది స్త్రీలు చూపించే దానికన్నా అద్భుతమైనది.


దావీదు సౌలు కుమారుడైన యోనాతానుతో యెహోవా ఎదుట చేసిన ప్రమాణం కారణంగా సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును రాజు వారికి అప్పగించలేదు.


దావీదు అతనితో, “భయపడకు, నీ తండ్రి యోనాతాను బట్టి నేను నీ మీద దయ చూపిస్తాను. నీ తాత సౌలుకు చెందిన భూమంతటిని నీకు మరలా ఇప్పిస్తాను, నీవు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అన్నాడు.


“అయితే గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుల పట్ల దయ చూపించు, నీ బల్ల దగ్గర భోజనం చేసేవారిలో వారిని ఉండనివ్వు. నేను మీ సోదరుడు అబ్షాలోము నుండి పారిపోయినప్పుడు వీరు నా పక్షాన నిలబడ్డారు.


నీ స్నేహితులను గాని నీ కుటుంబ స్నేహితులను గాని విడచిపెట్టకు, నీకు ఆపద కలిగిన రోజున నీ సహోదరుల ఇంటికి వెళ్లకు, దూరంలో ఉన్న సహోదరుల కంటే దగ్గర ఉన్న పొరుగువాడు మేలు.


నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకరికి ఒక గిన్నెడు చల్లని నీళ్లను ఇస్తే వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.”


“అందుకు ఆ రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేశారు కాబట్టి, నాకు చేసినట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.


మీరు క్రీస్తుకు చెందినవారని ఎవరైనా నా పేరట ఒక గిన్నెడు నీళ్లను మీకు ఇచ్చినా వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.


చివరిగా మీరందరు ఏక మనసు కలిగి సానుభూతి కలవారై పరస్పరం ప్రేమ కలిగి కరుణ, వినయంతో ఉండండి.


అప్పుడు యోనాతాను, “యెహోవా నీకు నాకు మధ్య, నీ సంతానానికి నా సంతానానికి మధ్య ఎప్పటికీ సాక్షిగా ఉండును గాక. మనమిద్దరం యెహోవా నామాన్ని బట్టి ప్రమాణం చేసుకున్నాం కాబట్టి మనస్సులో నెమ్మది కలిగి వెళ్లు” అని దావీదుతో చెప్పగా దావీదు బయలుదేరి వెళ్లిపోయాడు. యోనాతాను పట్టణానికి తిరిగి వెళ్లాడు.


Lean sinn:

Sanasan


Sanasan