Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 సమూయేలు 2:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 కొంతకాలం తర్వాత దావీదు యెహోవా దగ్గర విచారణ చేసి, “యూదా పట్టణాలకు నేను వెళ్ల వచ్చా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు” అని చెప్పారు. “ఎక్కడికి వెళ్లాలి?” అని దావీదు అడిగాడు. అందుకు యెహోవా, “హెబ్రోనుకు వెళ్లు” అని చెప్పారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఇది జరిగిన తరువాత–యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగా–పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. –నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా–హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 కొంతకాలం తరువాత దావీదు “నేను యూదా పట్టణాల్లో ప్రవేశించ వచ్చా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. “వెళ్ళు” అని యెహోవా అతనితో చెప్పాడు. “ఏ పట్టణానికి వెళ్ళమంటావు?” అని దావీదు అడిగాడు. “హెబ్రోనుకు వెళ్ళు” అని ఆయన చెప్పాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

1 దావీదు యెహోవాకు ప్రార్థన చేసి, “నేను యూదా రాజ్యంలో ఏ నగరానికైనా వెళ్లనా?” అని అడిగాడు. “వెళ్లు” అన్నాడు యెహోవా. “ఎక్కడికి వెళ్లను?” అని దావీదు అడిగితే, “హెబ్రోనుకు” అని యెహోవా సమాధానమిచ్చాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 కొంతకాలం తర్వాత దావీదు యెహోవా దగ్గర విచారణ చేసి, “యూదా పట్టణాలకు నేను వెళ్ల వచ్చా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు” అని చెప్పారు. “ఎక్కడికి వెళ్లాలి?” అని దావీదు అడిగాడు. అందుకు యెహోవా, “హెబ్రోనుకు వెళ్లు” అని చెప్పారు.

Faic an caibideil Dèan lethbhreac




2 సమూయేలు 2:1
26 Iomraidhean Croise  

కాబట్టి అబ్రాము హెబ్రోనులో మమ్రే అనే చోట సింధూర వృక్షాల దగ్గర నివసించడానికి వెళ్లాడు. అక్కడ తన గుడారాలు వేసుకున్నాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.


యాకోబు వారిని చూసి, “ఇది దేవుని సేన!” అని ఆ స్థలానికి మహనయీము అని పెట్టారు.


ఇలా నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్షాలోము రాజు దగ్గరకు వెళ్లి, “నేను హెబ్రోనుకు వెళ్లి యెహోవాకు నేను చేసిన మ్రొక్కుబడిని తీర్చుకోనివ్వండి.


దావీదు హెబ్రోనులో యూదా వారిని రాజుగా పరిపాలించిన కాలం ఏడు సంవత్సరాల ఆరు నెలలు.


అప్పుడు దావీదు, “నేను వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేయాలా? మీరు నాకు వారిని అప్పగిస్తారా?” అని యెహోవాను అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు, నేను వారిని తప్పకుండా నీ చేతికి అప్పగిస్తాను” అని అతనికి జవాబిచ్చారు.


కాబట్టి దావీదు యెహోవా దగ్గర విచారణ చేసినప్పుడు యెహోవా, “నీవు తిన్నగా వెళ్లకుండా చుట్టూ తిరిగివెళ్లి వారి వెనుక నుండి కంబళి చెట్లకు ఎదురుగా వారిమీద దాడి చేయి.


దావీదు ఇశ్రాయేలును నలభై సంవత్సరాలు పరిపాలించాడు. హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.


వారు దేవుని మందిరం పనికి అయిదువేల తలాంతుల బంగారాన్ని, పదివేల డారిక్కుల బంగారాన్ని, పదివేల తలాంతుల వెండిని, పద్దెనిమిది వేల తలాంతుల ఇత్తడిని, లక్ష తలాంతుల ఇనుమును ఇచ్చారు.


జోరహు, అయ్యాలోను, హెబ్రోను. ఇవన్నీ యూదా, బెన్యామీనులో కోటగోడలు గల పట్టణాలు ఉన్నాయి.


నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి, ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక. నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను, నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి.


యెహోవాను ఒకటి అడిగాను, నేను కోరింది ఇదే; యెహోవా ప్రసన్నతను చూస్తూ ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.


“ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తమ కోసం ఇలా చేయమని ఇశ్రాయేలు ప్రజలు నన్ను వేడుకునేలా చేస్తాను. గొర్రెలు విస్తరించినట్లు నేను వారు విస్తరించేలా చేస్తాను.


దక్షిణ దిక్కునుండి వెళ్లి, హెబ్రోనుకు వచ్చారు, అక్కడ అహీమాను, షేషయి, తల్మయి అనే అనాకు వంశస్థులు నివసించారు. (హెబ్రోను, ఈజిప్టులోని సోయను కంటే ఏడు సంవత్సరాల ముందే కట్టబడిన పురాతన పట్టణము.)


అతన్ని యాజకుడైన ఎలియాజరు ఎదుట నిలబెట్టు, ఎలియాజరు యెహోవా సన్నిధిలో ఊరీముతో సంప్రదించి అతని కోసం చట్టాలు పొందుకోవాలి. అతని ఆజ్ఞమేరకు అతడు, ఇశ్రాయేలు సమాజమంతా బయటకు వెళ్తుంది, అతని ఆజ్ఞమేరకు వారు లోనికి వస్తారు.”


యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబుకు యూదాలో ఒక భాగాన్ని అనగా కిర్యత్-అర్బాను, అంటే హెబ్రోనును ఇచ్చాడు. (అర్బా అనాకు యొక్క పూర్వికుడు.)


యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు, “కనానీయులతో యుద్ధం చేయడానికి మాలో ఎవరు మొదట వెళ్లాలి?” అని యెహోవాను అడిగారు.


కాబట్టి వారు, “అతడు ఇక్కడ ఉన్నాడా?” అని యెహోవా దగ్గర విచారణ చేశారు. అందుకు యెహోవా, “అవును, అతడు సామాన్లలో దాక్కున్నాడు” అని చెప్పారు.


దావీదు, “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేసి కెయీలాను రక్షించు” అని అతనికి జవాబిచ్చారు.


దావీదు మరోసారి యెహోవా దగ్గర విచారణ చేసినప్పుడు, “నీవు లేచి కెయీలాకు వెళ్లు, నేను ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తాను” అని యెహోవా జవాబిచ్చారు.


హెబ్రోనులో ఉన్నవారికి, దావీదు అతని మనుష్యులు తిరిగిన అన్ని స్థలాల్లో ఉన్న పెద్దలకు పంపించాడు.


Lean sinn:

Sanasan


Sanasan